ఎలెక్టోరల్ బాండ్ల గుట్టు మార్చి 21లోగా విప్పండి: ఎస్‌బీఐని ఆదేశించిన సుప్రీం
x

ఎలెక్టోరల్ బాండ్ల గుట్టు మార్చి 21లోగా విప్పండి: ఎస్‌బీఐని ఆదేశించిన సుప్రీం

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తన వద్ద ఉన్న ఎలక్టోరల్ బాండ్ల గురించిన అన్ని వివరాలను మార్చి 21లోగా అందించాలని సుప్రీం కోర్టు ఆదేశించింది.


స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తన వద్ద ఉన్న ఎలక్టోరల్ బాండ్ల గురించిన అన్ని వివరాలను మార్చి 21 సాయంత్రం 5 గంటలలోగా అందించాలని సుప్రీం కోర్టు ఆదేశించింది. ఏ సమాచారాన్ని పంచుకోవాలో బ్యాంకు ఎంచుకోకూడని ప్రధాన న్యాయమూర్తి డివై చంద్రచూడ్ నేతృత్వంలోని న్యాయమూర్తులు జస్టిస్ సంజీవ్ ఖన్నా, బీఆర్ గవాయ్, జేజీ పర్దివాలా, మనోజ్ మిశ్రా అభిప్రాయపడ్డారు.

ఇటు ఎస్‌బీఐ అందించిన వివరాలను తన అధికారిక వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేయాలని కూడా సుప్రీంకోర్టు ఎన్నికల సంఘాన్ని కోరింది.

కాగా ఎలక్టోరల్ బాండ్ల ఆల్ఫాన్యూమరిక్ నంబర్లను తమకు అందజేస్తామని ఎస్‌బీ ఐ తరఫున సీనియర్ న్యాయవాది హరీశ్ సాల్వే సుప్రీంకోర్టుకు తెలిపారు.

గత వారం సుప్రీం కోర్టు తన ఆదేశాలకు అనుగుణంగా యూనిక్ ఆల్ఫా న్యూమరిక్ నంబర్‌లను బహిర్గతం చేయకపోవడానికి గల కారణాలను వివరించాలని ఎస్‌బీఐకి నోటీసు జారీ చేసింది.

ఏప్రిల్ 12, 2019 న సుప్రీంకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. స్వీకరించిన విరాళాలు, స్వీకరించే విరాళాల సమాచారాన్ని రాజకీయ పార్టీలు తప్పనిసరిగా సీల్డ్ కవర్‌లో ECకి సమర్పించాలని సూచించింది.

ఫిబ్రవరి 15న అత్యున్నత న్యాయస్థానం కీలక నిర్ణయం తీసుకుంది. కేంద్రం ఎలక్టోరల్ బాండ్ల పథకాన్ని రద్దు చేసింది. దీనిని "రాజ్యాంగ విరుద్ధం"గా పేర్కొంది.

Read More
Next Story