‘‘గురజాడ అప్పారావు’’ కవితతో బడ్జెట్ ప్రారంభించిన ఆర్థిక మంత్రి
x

‘‘గురజాడ అప్పారావు’’ కవితతో బడ్జెట్ ప్రారంభించిన ఆర్థిక మంత్రి

బడ్జెట్ ప్రవేశపెట్టే సమయంలో కవితలు, సూక్తులు, పద్యాలు వాడుతున్న ఆర్థికమంత్రులు


కేంద్ర ఆర్థిక మంత్రి 2025-26 కు సంబంధించిన బడ్జెట్ ను లోక్ సభలో ప్రవేశపెట్టారు. కేంద్ర ఆర్థికమంత్రులు బడ్జెట్ ప్రవేశపెట్టిన చాలా సందర్భాల్లో కవులు రాసిన కవితలు, వ్యాఖ్యలు తీసుకుని ప్రారంభించడం ఆనవాయితీగా వస్తోంది.

తాజాగా నిర్మలా సీతారామన్ తెలుగు కవి ‘గురజాడ అప్పారావు’ రాసిన ‘ దేశమంటే మట్టికాదోయ్, దేశమంటే మనుషులోయ్’ అన్న సూక్తిని ప్రస్తావించారు. అలాగే మధ్య లో తమిళకవి అయిన తిరుక్కురళ్ ను సైతం గుర్తు చేసుకున్నారు.

కేంద్ర ఆర్థికమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తరువాత ఆమె వరుసగా ప్రవేశపెట్టిన ఎనిమిదో బడ్జెట్ ఇది. ఇంతకుముందు సంవత్సరాల్లో కూడా ఇదే విధంగా కవుల పద్యాలు, సూక్తులు కేంద్ర మంత్రి ప్రస్తావించారు.
మొదటి బడ్జెట్ ప్రసంగం 2019 లో..
తన మొదటి బడ్జెట్ ప్రవేశపెట్టే సందర్భంగా ఆర్థిక మంత్రి ఉర్దూ రచయిత మంజూర్ హష్మీ రాసిన కావ్యాన్ని కోట్ చేశారు. ‘‘ దీపాన్ని వెలిగించే మార్గం, గాలికి దొరికిందంటే నమ్ముతారా’’ అనే సూక్తిని వాడారు.
2020 లో..
తన రెండో బడ్జెట్ ప్రసంగంలో భాగంగా సీతారామన్.. కాశ్మీరీ కవి, సాహిత్య అకాడమీ విజేత అయిన పండిట్ దీనా నాథ్ రాసిన పద్యాన్ని కోట్ చేశారు. ఇది కాశ్మీర్ అందాలను వర్ణిస్తుంది. జమ్మూకాశ్మీర్ కు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించే ఆర్టికల్ 370 రద్దు తరువాత, అది దేశానికి చెందిందని అర్థం వచ్చే విధంగా ఓ కవిత్వాన్ని వాడారు.
2021 బడ్జెట్ ప్రసంగం సందర్భంగా విశ్వకవి రబీంద్రనాథ్ ఠాగూర్ ను ఉటంకించారు. ‘‘ విశ్వాసం అనేది కాంతిని అనుభవించే పక్షి, తెల్లవారుజామున ఇంకా చీకటి ఉన్నప్పటీకీ అది కూస్తునే ఉంటుంది’’ అన్న కవితాసూక్తిని వాడారు. కోవిడ్ తరువాత అస్తవ్యస్థమైన ఆర్థిక వ్యవస్థను చక్కదిద్దే ఉద్దేశంతో దీన్ని ప్రస్తావించారు.
2022 లో.. బడ్జెట్ సందర్భంగా మహాభారతంలోని ‘దాపయిత్వకరంధర్మ్యం రాష్ట్రనిత్యన్యథావిధి.. అశేషాంకల్పయేద్రజాయోగ క్షేమనాతండ్రిత:’’ అనే శ్లోకం ప్రస్తావించారు.
రాజు అలసటను విడిచిపెట్టి, ధర్మానికి అనుగుణంగా పన్నులను వసూలు చేయాలని చెబుతుంది. వాటితోనే ప్రజల యోగ క్షేమాలకు ఏర్పాట్లు చేయాలని శాంతి పర్వతంలోని ఈ శ్లోక సారాంశం.
అరుణ్ జైట్లీ..
దివంగత ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ 2016 లో బడ్జెట్ ను ప్రవేశ పెట్టే సమయంలో ఉర్దూ కవితను ప్రస్తావించారు. ‘‘అలసిపోయిన నావికులు పడవను మాకు అప్పగించారు. మేము ప్రతిచోటా తుఫాన్లు, అనేక ఒడిదుడుకులు ఎదుర్కొన్నప్పటికీ తీరాన్ని చేరాము’’ అనే అర్థం వచ్చే విధంగా కవితను వివరించారు.
అలాగే 2017 లో బడ్జెట్ ను ప్రవేశపెడుతూ.. నోట్ల రద్దును హైలైట్ చేస్తూ ఓ కవితను చదివారు. ‘‘ ఇది కొత్త ప్రపంచం, ఇది కొత్త ఆశ, ఇంతకుముందు రంగుల కంటే, ఈ రంగులు కొత్తగా ఉన్నాయి.. చీకటిని కాంతి దోచుకున్నట్లుగా, నల్లధనం కూడా తన రంగును మార్చుకుంది’’ అని వివరించారు.
చిదంబరం..
యూపీఏ హయాంలో ఆర్థికమంత్రిగా విధులు నిర్వహించిన చిదంబరం 2013 లో బడ్జెట్ సందర్భంగా ప్రఖ్యాత తమిళరచయిత అయిన తిరుక్కురల్ నుంచి కొన్ని పదాలను ఉదహరించారు. ‘‘ కలంగాతు కంద వినైక్కన్ తులంగతు తూక్కండ్ కడియంతు సెయల్’’ (నిద్రలేమితో ఉన్నప్పటికీ దృఢ సంకల్పంతో ఉన్న సమయంలో ఏది సరైనదని మనిషికి అనిపిస్తుందో అది నెరవేర్చాలి)
అంతకుముందు బడ్జెట్ ప్రవేశ పెట్టిన యశ్వంత్ సిన్హా, దేశ ఆర్థిక గతిని మార్చిన 1990 నాటి బడ్జెట్ సమర్పించిన మన్మోహన్ ఇలా అనేక మంది కేంద్ర ఆర్థిక మంత్రులు కవితలు, సూక్తులను బడ్జెటలకు అన్వయించారు.
Read More
Next Story