మొదటి టెస్ట్.. వందో టెస్ట్ లో సేమ్ నంబర్లు.. ఇదేట్లా సాధ్యం అశ్విన్ !
x
భారత్ బౌలర్లు అశ్విన్, భూమ్రా

మొదటి టెస్ట్.. వందో టెస్ట్ లో సేమ్ నంబర్లు.. ఇదేట్లా సాధ్యం అశ్విన్ !

ఇంగ్లండ్ తో ధర్మశాల వేదికగా జరుగుతున్న ఐదో టెస్ట్ లో టీమిండియా ఇన్సింగ్స్ 64 పరుగుల తేడాతో గెలుపొందింది. ఇదే మ్యాచ్ ద్వారా వందో మ్యాచ్ ఆడుతున్న అశ్విన్ అరుదైన ఘనత..


ఇంగ్లండ్ తో ధర్మశాల వేదికగా జరుగుతున్న ఐదో టెస్ట్ మ్యాచ్ ద్వారా వందో టెస్ట్ ఆడుతున్న భారత ఆఫ్ స్పిన్నర్ అశ్విన్ అరుదైన ఘనత సాధించాడు.రెండో ఇన్నింగ్స్‌లో అశ్విన్ ఐదు వికెట్లు పడగొట్టాడు. దీంతో ప్రత్యర్థి ఇంగ్లండ్ ఇన్నింగ్స్ 64 పరుగుల తేడాతో చిత్తుగా ఓడింది.

అరంగ్రేట టెస్ట్ లో ఐదు వికెట్ల ప్రదర్శన
ధర్మశాలలో అశ్విన్ 9/128తో ప్రత్యర్ధికి చుక్కలు చూపాడు. 2011లో ఢిల్లీలో వెస్టిండీస్‌తో జరిగిన తన అరంగేట్రం టెస్ట్‌లో అలాగే 100వ టెస్టులో ఐదు వికెట్లు తీసిన తొలి బౌలర్‌గా చరిత్ర పుటల్లో నిలిచాడు. మరో అరుదైన విషయం ఏంటంటే.. తన మొదటి, 100వ టెస్ట్ రెండింటిలోనూ ఒకే విధమైన బౌలింగ్ గణాంకాలను నమోదు చేయడం.
తన మొదటి టెస్టులో అశ్విన్ 9/128 (3/81, 6/47) గణాంకాలను నమోదు చేయగా, 100వ టెస్టులో కూడా అదే గణాంకాలు (4/51, 5/77) కలిగి ఉన్నాడు. ముత్తయ్య మురళీధరన్, షేన్ వార్న్, భారత దిగ్గజ స్పిన్నర్ అనిల్ కుంబ్లేలతో కలిసి అరంగేట్రం మ్యాచ్ తో పాటు 100వ టెస్టుల్లో కూడా ఐదు వికెట్లు తీసిన నాలుగో బౌలర్ గా అశ్విన్ రికార్డుల కెక్కాడు. అలాగే భారత్ తరఫున అత్యధిక సార్లు ఐదు వికెట్లు తీసిన కుంబ్లే రికార్డు(35)ను దాటి అశ్విన్ (36 సార్లు) ఐదు అంతకంటే ఎక్కువ సార్లు ఉత్తమ ప్రదర్శన నమోదు చేశాడు.
అశ్విన్ ఏం చెప్పాడంటే..
వందో టెస్ట్ ఆడుతున్న అశ్విన్ ప్రపంచ ఉత్తమ ఆటగాళ్లలో ఒకడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇప్పటి వరకూ 516 వికెట్లు పడగొట్టిన చెన్నై సొగ్గాడు.. బ్యాట్ తో ఐదు సెంచరీలు బాదాడు. అవన్నీ కూడా వెస్టిండీస్ పైనే సాధించడం మరో విశేషం. అలా ఇప్పటి వరకూ 3000 పరుగుల క్లబ్ లో చేరాడు.
ధర్మశాలలో సిరీస్ విజయం తర్వాత హోస్ట్ బ్రాడ్‌కాస్టర్‌తో అశ్విన్ మాట్లాడుతూ, “ వందో టెస్ట్ ఆడుతున్నందుకు సంతోషంగా ఉంది. ఈ సంతోషాన్ని మాటల్లో చెప్పలేను. మ్యాచ్ కు ముందు అనేక చర్చలు జరిగాయి. నా శ్రేయోభిలాషులు నాకు శుభాకాంక్షలు చెప్పారు
నువ్వు బాగా ఆడాలి.. ఎక్కువ వికెట్లు తీసి ఇండియాను గెలిపించాలి” అని కోరారు. ఒక బౌలర్ ను ఇంతకంటే ఎక్కువ ఏమి కోరుకోవాలి. భారత దేశంలో ఆడాలంటే విభిన్న శైలిలు, బంతుల్లో వైవిధ్యం, వేగంలో మార్పు కావాలని అశ్విన్ అభిప్రాయపడ్డాడు. ఆటల్లో ఎన్నో విషయాలు జరుగుతాయి. ముఖ్యంగా కొత్త బంతి తో బౌలింగ్ చేస్తుంటే ఏదో మిస్ అవుతున్న ఫీలింగ్ ఒక్కోసారి వస్తుందని వివరించాడు.Read More
Next Story