మార్చి 22న మరో ఐదుగురి పేర్లు: యడియూరప్ప
x

మార్చి 22న మరో ఐదుగురి పేర్లు: యడియూరప్ప

కర్ణాటకలో మొత్తం 28 లోక్ సభ స్థానాలకుగాను గతవారం 20 మంది అభ్యర్థుల పేర్లను బీజేపీ ప్రకటించింది. 22వ తేదీ మరో ఐదుగురి పేర్లను వెల్లడించనుంది.


కర్ణాటకలోని మిగిలిన ఐదు లోక్‌సభ స్థానాలకు అభ్యర్థుల పేర్లను మార్చి 22న ప్రకటిస్తామని మాజీ ముఖ్యమంత్రి బిఎస్ యడియూరప్ప తెలిపారు. మొత్తం 28 నియోజక వర్గాలకు గత వారం 20 మంది అభ్యర్థులతో కూడిన తొలి జాబితాను బీజేపీ విడుదల చేసింది.

బీజేపీ మిత్రపక్షమైన JD(S)..హాసన్, మాండ్య, కోలార్ స్థానాల్లో పోటీ చేయనున్నట్లు ఇప్పటికే ప్రకటించింది. అయితే ఆ మేరకు బిజెపి నుంచి అధికారిక ప్రకటన రాలేదు. కాగా కోలార్ సీటును జెడి(ఎస్)కి కేటాయించేందుకు బీజేపీ విముఖంగా ఉంది. ప్రస్తుతం అక్కడ ఎస్ మునిస్వామి బీజేపీ ఎంపీగా ఉన్నారు.

“మేం మిగిలిన ఐదు సీట్లపై కేంద్ర హోం మంత్రి (అమిత్ షా), బిజెపి జాతీయ అధ్యక్షుడు జెపి నడ్డాతో నిన్న చర్చించాం. మార్చి 22న ప్రధాని మోదీతో చర్చించాక తుది నిర్ణయం వెలువడనుంది. బీజేపీ, జేడీ(ఎస్‌)ల మధ్య పొత్తు ఉన్నందున ఈసారి మొత్తం 28 స్థానాల్లో విజయం సాధిస్తాం’’ అని యడ్యూరప్ప దేశ రాజధానిలో విలేకరులతో అన్నారు.

2019 సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ 25 స్థానాలను కైవసం చేసుకోగా, ఆ పార్టీ మద్దతుతో స్వతంత్ర అభ్యర్థి కూడా విజయం సాధించారు. అప్పట్లో ఎన్నికల్లో కలిసి పోటీ చేసిన కాంగ్రెస్, జేడీ(ఎస్)లు ఒక్కో సీటు దక్కించుకున్నాయి.

సీట్ల సర్దుబాటలో జేడీ(ఎస్) అంసతృప్తిగా ఉందన్న ప్రశ్నకు.. ‘‘మాజీ ప్రధాని దేవెగౌడ, మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి సహా జేడీ(ఎస్) నేతలంతా మాకు మద్దతు ఇస్తారని భావిస్తున్నారు. వారు ఆశిస్తున్న సీట్లను వారికి ఇవ్వడానికి ప్రయత్నిస్తాం. ఈ విషయంలో హైకమాండ్‌దే తుది నిర్ణయం " అని బిజెపి పార్లమెంటరీ బోర్డు సభ్యుడు యడియూరప్ప తెలిపారు.

Read More
Next Story