ప్రత్యేక రాష్ట్రం కోసం..బంద్‌.. వేల మందితో ర్యాలీ..ఎక్కడంటే..
x

ప్రత్యేక రాష్ట్రం కోసం..బంద్‌.. వేల మందితో ర్యాలీ..ఎక్కడంటే..

కేంద్ర పాలిత ప్రాంతం లద్ధాఖ్‌ను ప్రత్యేక రాష్ట్రంగా ప్రకటించాలని అక్కడి జనం కోరుకుంటున్నారు. బంద్‌లో స్వచ్ఛందంగా పాల్గొన్న ప్రజలు..నిరసన ర్యాలీ కూడా చేపట్టారు.


లద్ధాఖ్‌ను ప్రత్యేక రాష్ట్రంగా ప్రకటించాలని శనివారం లేక్‌, కార్గిల్‌ జిల్లాల్లో బంద్‌ నిర్వహించారు. ప్రత్యేక రాష్ట్రంతో పాటు, స్థానిక నిరుద్యోగులకు ఉద్యోగాల్లో రిజర్వేషన్‌ కల్పించాలని, లేక్‌, కార్గిల్‌కు ఒక్కో పార్లమెంట్‌ స్థానాన్ని కేటాయించాలని అక్కడి ప్రజలు డిమాండ్‌ చేస్తున్నారు.

వేల సంఖ్యలో నిరసనకారులు..

లెక్‌ ఆపెక్స్‌ బాడీ (ఎల్‌ఏబీ), కార్గిల్‌ డెమోక్రటిక్‌ అలయన్స్‌ (కేడీఏ) పిలుపు మేరకు ఇచ్చిన బంద్‌లో వేల సంఖ్యలో జనం పాల్గొన్నారు. నిరసనకారులు చేపట్టిన ర్యాలీ లేక్‌లోని సెగ్నీ న్యామ్‌వాల్‌ నుంచి ప్రారంభమై కమిషనరేట్‌ వరకు కొనసాగి ఆ తర్వాత పోలో గ్రాండ్‌ వద్ద ముగిసింది. కార్గిల్‌ జిల్లాలో కూడా నిరసనకారులు ఇదే తరహాలో ర్యాలీ నిర్వహించారు.

వైరల్‌ అయిన ఫొటోలు, వీడియోలు..

లేక్‌, కార్గిల్‌ రోడ్లమీద వేల సంఖ్యలో గుమికూడిన నిరసనకారుల ఫొటోలు, వీడియోలు ఇప్పుడు నెట్టింట్లో వైరలవుతున్నాయి. ప్రజాస్వామాన్ని పునరుద్ధరించాలంటూ నిరసనకారులు నినదించారు. లద్ధాఖ్‌కు గిరిజన హోదా కల్పిందాలని డిమాండ్‌ చేశారు.

సోనమ్‌ వాక్‌చెక్‌ (Sonam Wangchuck)ఏమన్నారంటే..

ర్యాలీనుద్దేశించి ప్రసంగించిన వారిలో మెగాసేసే అవార్డు గ్రహీత సోనమ్‌ వాక్‌చెక్‌ ఉన్నారు.

‘‘డిమాండ్ల గురించి మాట్లాడే వారిని ఇబ్బందిపెట్టాలని చూస్తున్నారు. ప్రత్యేక రాష్ట్రం మా హక్కు. దాన్ని సాధించుకునేదాకా విశ్రమించం’’ అని సోనమ్‌ పేర్కొన్నారు.

ఆర్డికల్‌ 370 రద్దు తర్వాత లద్ధాఖ్‌ను ఆరవ షెడ్యూల్‌లో చేర్చుతామని హామీ ఇచ్చిన కేంద్రం ఇప్పుడు దానిపై స్పందించడం లేదని సోనమ్‌ గుర్తు చేశారు.

కేంద్రానికి వినతులు.

తమ డిమాండ్లను పరిష్కరించాలంటూ ఎల్‌ఏబీ, కేడీఏ రెండూ కూడా ఈ ఏడాది జనవరి 23న కేంద్ర మంత్రిత్వ వ్యవహారాల శాఖకు వినతిపత్రం అందజేశారు. అంతకుముందు జమ్ము కాశ్మీర్‌ పునర్‌వ్యవస్థీకరణ చట్టం 2019ని సవరించాలంటూ ముసాయిదా బిల్లును కేంద్రానికి సమర్పించింది.

చర్చల సమయంలోనూ..

కేంద్ర సహాయ మంత్రి నిత్యానంద రాయ్‌ అధ్యక్షతన కేంద్రం ఏర్పాటు చేసిన కమిటీ ఎల్‌ఏబీ, కేడీఏ నాయకులతో చర్చలు జరుపుతున్న సమయంలోనూ ఈ తరహా నిరసనలు వెల్లువెత్తాయి. డిసెంబర్‌ 4 ,2023 జరిపిన చర్చల్లో ఎలాంటి పురోగతి కనిపించలేదు. రెండో దఫా చర్చలు ఢల్లీిలో ఫిబ్రవరి 19న జరగనున్నాయి.

2019లో కేంద్రం 370 ఆర్టికల్‌ను రద్దు చేసి, జమ్ము కాశ్మీర్‌ రాష్ట్రాన్ని రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా మార్చారు. అందులో ఒకటి జమ్ము కాశ్మీర్‌. రెండోది లడ్డాక్‌.

Read More
Next Story