
అస్సాం మాజీ ముఖ్యమంత్రి కుమార్తె ప్రజోయితా
డ్రైవర్ ను చెప్పుతో కొట్టిన మాజీ ముఖ్యమంత్రి కుమార్తె
మద్యం మత్తులో అసభ్యంగా ప్రవర్తించారనే ఆరోపణపై అస్సాం మాజీ ముఖ్యమంత్రి కుమార్తె ప్రజోయితా డ్రైవర్‌పై దాడి చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
మద్యం మత్తులో తన పట్ల అసభ్యంగా ప్రవర్తించారనే ఆరోపణపై అస్సాం మాజీ ముఖ్యమంత్రి ప్రఫుల్ల కుమార్ మహంత కుమార్తె ప్రజోయీత కశ్యప్ డ్రైవర్‌పై దాడి చేస్తున్నట్టున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఆమె వివాదంలో చిక్కుకుంది. మద్యం మత్తులో డ్రైవర్ తనను దుర్భాషలాడాడని ఆమె ఆరోపించింది.
ఆ వీడియో క్లిప్ లో ఏముందంటే..
చారల టీ షర్ట్ వేసుకున్న ఓ వ్యక్తి చెవులకి చేతులు అడ్డంపెట్టుకుని మోకాళ్లపై మోకరిల్లి ఉన్నాడు. ఓ మహిళ అతన్ని చెప్పుతో కొట్టినట్టు కనిపిస్తోంది. ఆమె పెద్దపెద్దగా అరుస్తున్నట్టు కూడా ఉంది. దాదాపు 50 సెకన్లు ఉన్న వీడియో అది.
అస్సాం రాజధాని డిస్పూర్ ప్రాంతంలోని హై సెక్యూరిటీ ఎమ్మెల్యే హాస్టల్ క్యాంపస్ లోపల, ఇతర సిబ్బంది ఈ సంఘటనను చూస్తున్నప్పుడు ఈ వీడియోను తీశారు.
ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ప్రపుల్ల కుమార్ మహంత కుమార్తె వివరణ ఇచ్చారు. దెబ్బలు తిన్న వ్యక్తి చాలా కాలంగా తమ వద్ద డ్రైవర్ గా పని చేస్తున్నాడని చెప్పారు.
“అతను ఎప్పుడూ తాగి ఉంటాడు. తరచూ నాపై కామెంట్లు చేస్తుంటాడు. ఈ సంగతి మావాళ్లందరికీ తెలుసు. మేము అతన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాం. అలా చేయవద్దని చెప్పాం. కానీ అతను ఈవేళ హద్దులు దాటి ప్రవర్తించాడు. నా గది తలుపును కొట్టడం ప్రారంభించినప్పుడు అది అన్ని పరిమితులను దాటింది” అని ప్రజోయిత చెప్పింది.
పోలీసులకు ఫిర్యాదు చేయడానికి ఎందుకు వెళ్లలేదని అడిగినప్పుడు ఆమె నేరుగా సమాధానం ఇవ్వలేదు. ఇలాంటి వ్యవహారాలలో పోలీసు స్టేషన్ కి వెళ్లినపుడు చాలా సందర్భాలలో తిరిగి ఆ మహిళలపైన్నే నిందలు వేస్తారని కూడా ఆమె అన్నారు. బహిరంగ ప్రదేశాల్లో మహిళల భద్రత గురించి ఆమె ప్రశ్నను లేవనెత్తినందున, ఆ డ్రైవర్ ఎవరితోనైనా నిశ్చితార్థం చేసుకున్నాడా అనే ప్రశ్నకు కూడా ఆమె జవాబు చెప్పలేదు.
ఈ డ్రైవర్ ప్రభుత్వ ఉద్యోగా లేక ప్రైవేటుగా పెట్టుకున్నారా అనేది కూడా తేలలేదు.
అసోం గణ పరిషత్ మాజీ అధ్యక్షుడు ప్రఫుల్ల కుమార్ మహంత ఇప్పుడు శాసనసభ్యుడు కాదు. కానీ ప్రభుత్వ అనుమతితో తన కుటుంబంతో కలిసి ఎమ్మెల్యే హాస్టల్‌లో ఉంటున్నారు.
ఆయన అస్సాంకు రెండుసార్లు ముఖ్యమంత్రిగా ఉన్నారు. 1985 నుండి 1990 వరకు, 1996 నుంచి 2001 వరకు ఆయన ముఖ్యమంత్రిగా పని చేశారు.
డిస్పూర్‌లోని హై సెక్యూరిటీ జోన్ లో ఈ ఎమ్మెల్యే హాస్టల్ క్యాంపస్ ఉంది. దీన్ని ఎవరు చిత్రీకరించారనేది తెలియలేదు. మద్యం మత్తులో తనను దూషించిన డ్రైవర్‌కు అస్సాం మాజీ సీఎం కుమార్తె దేహశుద్ధి చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
Next Story