కాంగ్రెస్‌ను వీడిన మాజీ నేత రాధిక ఖేరా.. కారణమేంటి?
కాంగ్రెస్ మాజీ నేత రాధిక ఖేరా, నటుడు శేఖర్ సుమన్ పార్టీని వీడారు. కాంగ్రెస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసి తరువాతి రోజు బీజేపీలో చేరారు.
కాంగ్రెస్ మాజీ నేత రాధిక ఖేరా, నటుడు శేఖర్ సుమన్ పార్టీని వీడారు. కాంగ్రెస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసి తరువాతి రోజు బీజేపీలో చేరారు. కాంగ్రెస్ మీడియా విభాగం మాజీ జాతీయ సమన్వయకర్తగా ఉన్న ఖేరా.. గతంలో అయోధ్య రామ మందిరాన్ని సందర్శించారు. దాంతో సీనియర్ నాయకులు తన పట్ల అనుచితంగా ప్రవర్తించారని ఖేరా చెబుతున్నారు.
రామ మందిరాన్ని సందర్శించినందుకు ఏప్రిల్ 30న రాయ్‌పూర్‌లోని పార్టీ కార్యాలయంలో ఛత్తీస్‌గఢ్ కాంగ్రెస్ కమ్యూనికేషన్ వింగ్ ఛైర్‌పర్సన్ సుశీల్ ఆనంద్ శుక్లా తనను గదిలో బంధించి దుర్భాషలాడారని ఆరోపించారు. రాహుల్ గాంధీ భారత్ జోడో న్యాయ్ యాత్రలో శుక్లా తనకు మద్యం అందించారని విలేఖరులకు చెప్పారు. తమ బృందం కోర్బాలో ఉన్నప్పుడు మద్యం తాగిన శుక్లా పదే పదే తన గది తలుపు తట్టేవారని.. ఈ ఘటన గురించి సచిన్ పైలట్, జైరామ్ రమేష్, పవన్ ఖేరాకు చెప్పినా పట్టించుకోకపోగా.. తన ప్రసంగాల్లో హిందూ మతానికి సంబంధించిన ప్రస్తావన తగ్గించాలని పార్టీ నేతలు సూచించారని ఖేరా చెప్పారు.
ఢిల్లీలోని బీజేపీ ప్రధాన కార్యాలయంలో ఖేరా, సుమన్‌ల చేరిక కార్యక్రమానికి బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి వినోద్ తావ్డే, జాతీయ మీడియా విభాగం ఇన్‌ఛార్జ్ అనిల్ బలూనీ హాజరయ్యారు. సుమన్ ఇటీవలే సంజయ్ లీలా బన్సాలీ యొక్క నెట్‌ఫ్లిక్స్ సిరీస్ హీరామండిలో కనిపించారు.