ట్రాక్టర్ బోల్తా.. నలుగురు మృతి
x

ట్రాక్టర్ బోల్తా.. నలుగురు మృతి

నలుగురు వ్యవసాయ కూలీలు అక్కడికక్కడే మృతి.


జగిత్యాలలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో నలుగురు వ్యవసాయ కూలీలు ప్రాణాలు కోల్పోయారు. పసుపు కోతకు వెళ్తున్న సమయంలో ఈ విషాద ఘటన చోటు చేసుకుందని స్థానికులు తెలిపారు. పంట కోత కోసం వ్యవసాయ కూలీలు ట్రాక్టర్‌లో బయలుదేరారు. మల్లాపూర్ మండల ముగిలిపేట దగ్గరకురాగనే ట్రాక్టర్ అదుపు తప్పింది. పక్కనే ఉన్న నీటి గుంతలో పడిపోయింది. ఈ ప్రమాదంలో నలుగురు వ్యవసాయ కూలీలు అక్కడికక్కడే మరణించగా మిగిలిన వారికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను స్థానికులు హుటాహుటిన స్థానిక ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాద సమాచారం అందిన వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. అసలు ఏం జరిగింది? అన్న అంశంపై ఆరా తీస్తున్నారు.

Read More
Next Story