
ఘోర రోడ్డు ప్రమాదంలో నలుగురు విద్యార్ధుల మృతి
విద్యార్దులందరు ఇక్ఫాయ్, ప్రైవేటు ఇంజనీరింగ్ కాలేజీలో చదువుతున్నారు
రంగారెడ్డి జిల్లాలోని మోకిలా దగ్గర జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు విద్యార్దులు మరణించారు. గురువారం తెల్లవారుజామున హైదరాబాద్ నుండి మోకిలా వైపు వెళుతున్న కారు తీవ్రమైన మంచుకారణంగా చెట్టుకు ఢీకొన్నది. అతివేగంగా వెళుతున్న కారు ఒక మలుపు దగ్గర అదుపుతప్పి చెట్టుకు ఢీకొనటంతో నలుగురు విద్యార్దులు అక్కడికక్కడే మరణించినట్లు పోలీసులు ప్రాధమికంగా నిర్ధారించారు. విద్యార్దులందరు ఇక్ఫాఐ (ICFAI University), ప్రైవేటు ఇంజనీరింగ్ కాలేజీలో చదువుతున్నారు. మరో విద్యార్ధికి తీవ్రమైన గాయాలు అవటంతో పోలీసులు సమీపంలోని ఆసుపత్రిలో చేర్పించారు.
మృతుల్లో బీబీఏ రెండవ సంవత్సరం చదువుతున్న సూర్యతేజ, మూడో ఏడు చదువుతున్న సుమిత్, శ్రీ నిఖిల్, ప్రైవేటు ఇంజనీరంగ్ కాలేజీలో విద్యార్ధి రోహిత్ గా పోలీసులు గుర్తించారు. కారునెంబర్ ఆధారంగా అడ్రస్ పట్టుకుని పోలీసులు సమాచారం అందించారు.

