నాలుగో దశ పోలింగ్: ఉదయం తొమ్మిది గంటల వరకూ దేశ వ్యాప్తంగా..
x

నాలుగో దశ పోలింగ్: ఉదయం తొమ్మిది గంటల వరకూ దేశ వ్యాప్తంగా..

దేశ వ్యాప్తంగా నాలుగోదశ పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. ఈ దశలో తెలుగు రాష్ట్రాలైన తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ తో పాటు, ఉత్తరాది రాష్ట్రాల్లో పోలింగ్..


దేశంలో నాలుగోదశ పోలింగ్ కొనసాగుతోంది. పది రాష్ట్రాల్లో 96 స్థానాలకు ఈ దశలో పోలింగ్ నిర్వహిస్తున్నారు. ఎన్నికల సంఘం ఉదయం 9 గంటల వరకు ప్రకటించిన సమాచారం ప్రకారం 10. 35 శాతం పోలింగ్ నమోదైంది. పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్ల భారీ క్యూలైన్లు దేశ వ్యాప్తంగా దర్శనమిస్తోంది.

ఎన్నికల సంఘం సమాచారం ప్రకారం జార్ఖండ్ లో అత్యధికంగా 17 శాతం పోలింగ్ నమోదైంది. ఇప్పటి వరకూ జరిగిన మూడు దశ పోలింగ్ లలో 283 స్థానాలకు ఓటింగ్ పూర్తయింది. నాలుగో దశ ఎన్నికల కోసం 19 లక్షల అధికారులను ఈసీ నియమించింది. 1.92 లక్షల పోలింగ్ బూతులు ఏర్పాటు చేసింది.

ఈదశలో 17.70 కోట్ల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఇందులో 8.73 కోట్ల మంది మహిళలు ఉన్నారు. ఈ దశలో 1717 మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు.

ఈ దశలో తెలంగాణలోని 17 సీట్లకు, ఆంధ్రప్రదేశ్ లోని 25 సీట్లు, ఉత్తర ప్రదేశ్ లోని 13 సీట్లకు, బిహార్ లో 5, జార్ఖండ్ లో నాలుగు, మధ్యప్రదేశ్ లో ఎనిమిది, మహారాష్ట్రలో 11, ఒడిషా లో నాలుగు, పశ్చిమ బెంగాల్ లో ఎనిమిది, జమ్ముకాశ్మీర్ లో ఒక్క స్థానానికి ఎన్నికలు నిర్వహిస్తున్నారు. అలాగే ఆంధ్ ప్రదేశ్ లోని 175 అసెంబ్లీ స్థానాలకు, ఒడిషాలో 28 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ జరుగుతోంది.
Read More
Next Story