
వారణాసిలో భక్తులు, పర్యాటకులకు ఉచిత బోటు ప్రయాణం
Free boat ride for devotees and tourists in Varanasi
అయోధ్యలో రామ మందిర ప్రారంభోత్సవం ఈ నెల 22న అంగరంగ వైభవంగా జరగనుంది. అదే రోజున బాలరాముడి (రామ్ లల్లా) విగ్రహాన్ని గర్భగుడిలో ప్రతిష్ఠించనున్నాయి. ఈ నేపథ్యాన్ని పురస్కరించుకుని వారణాసిలో బోట్ మెన్లు 84 గంగా ఘాట్‌ల వద్ద భక్తులు, పర్యాటకులకు ఉచిత ప్రయాణానికి అనుమతిస్తున్నారు. మా గంగా నిషాద్ రాజ్ సేవా ట్రస్ట్ కార్యదర్శి శంభు సాహ్ని మాట్లాడుతూ.. "పడవ నడిపే నిషాద్ కమ్యూనిటీకి శ్రీరాముడితో అవినాభావ సంబంధం ఉంది. అడవికి వెళ్ళేటప్పుడు, నిషాద్ రాజ్ సహాయం చేశాడట. డబ్బులు తీసుకోకుండానే రాముడు, లక్ష్మణుడు సీతను తన పడవలో నదిని దాటించాడట. ఈ సంప్రదాయాన్ని ముందుకు తీసుకువెళుతూ, మొత్తం 84 ఘాట్‌లలో గంగా నదికి ఒక చివర నుంచి మరొక చివర వరకు వెళ్లే భక్తులు, పర్యాటకులకు ఉచిత బోట్ ప్రయాణాన్ని కల్పిస్తున్నారు. ’’ అని తెలిపారు.
Next Story

