లైసెన్స్, ఆర్సీ జారీ విషయంలో కీలకనిర్ణయం
x
RC and Driving License

లైసెన్స్, ఆర్సీ జారీ విషయంలో కీలకనిర్ణయం

వాహనాల ఆర్సీలు, లైసెన్సులను ఇకనుండి వాహనాల యజమానుల ఇళ్ళకే పంపించాలని రవాణశాఖ డిసైడ్ చేసింది


వాహనాల రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్లు(ఆర్సీ), లైసెన్సుల జారీవిషయంలో తెలంగాణ రవాణశాఖ కీలకమైన నిర్ణయం తీసుకున్నది. వాహనాల ఆర్సీలు, లైసెన్సులను ఇకనుండి వాహనాల యజమానుల ఇళ్ళకే పంపించాలని రవాణశాఖ డిసైడ్ చేసింది. ఇప్పటివరకు ఈ విషయం కేవలం ఒక ఆప్షన్ మాత్రమే. అంటే వాహన యజమాని కోరుకుంటే మాత్రమే ఇంటికి పంపిస్తున్నారు. ఇంటికి పంపిచాలని కోరిన వాహన యజమానుల దగ్గర నుండి నిర్ణీత రుసుమును వసూలు చేస్తున్నారు. లేకపోతే యజమానే ఆర్టీఏ ఉన్నతాధికారుల దగ్గరకు వెళ్ళి వాటిని కలెక్ట్ చేసుకోవాలి.

అయితే ఇకనుండి ఆప్షనల్ గా కాకుండా యజమానులు రవాణశాఖ అధికారుల చుట్టూ తిరగాల్సిన అవసరంలేదు. రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తయిన వెంటనే ఆర్సీ యజమాని ఇంటికి వచ్చేస్తుంది. అలాగే డ్రైవింగ్ టెస్టు అయిపోగానే లైసెన్సు కూడా వాహనయజమాని ఇంటికే వచ్చి చేరుతుంది. దీనికి కారణం ఏమిటంటే ‘సెంట్రలైజ్డ్ ప్రింటింగ్, డిస్పాచ్ ఆఫ్ ఆర్సీ అండ్ లైసెన్స్’ విధానాన్ని ప్రవేశపెడుతుండటమే. ఈ పద్దతిని ఎందుకు ప్రవేశపెడుతున్నారంటే అవినీతిని నియంత్రించటమే టార్గెట్ గా ఉన్నతాధికారులు పెట్టుకున్నారు కాబట్టే.

రాష్ట్రంలో ఏడాదికి సగటున 4.7 లక్షల వాహనాల డ్రైవింగ్ లైసెన్సులు, 9 లక్షల వాహనాలు రిజిస్టర్ అవుతున్నాయి. రెండింటిని కలిపితే సుమారు 15 లక్షల కార్డులు వాహనాల యజమానులకు అందించాల్సుంటుంది. అయితే వీటిని యజమానులకు చేర్చటానికి నెలలు పడుతున్నాయి. రవాణశాఖ రికార్డుల్లో ఏమో వాహనాల రిజిస్ట్రేషన్ అయినట్లు, లైసెన్సులు మంజూరు అయినట్లు చూపిస్తుంటుంది. కాని క్షేత్రస్ధాయిలో మాత్రం వాహనాలు ఫర్ రిజిస్ట్రేషన్ అని టెంపరరీ రిజిస్ట్రేషన్ అనే స్టిక్కర్లతోనే తిరుగుతుంటాయి. రోడ్లపైన వాహనాలను పట్టుకున్నపుడు యజమానులు తమ దగ్గరున్న ఎఫ్ఆర్, టీఆర్ పత్రాలను చూపిస్తున్నారు.

ఈ విధంగా ఎందుకు జరుగుతోందనే విషయంలో అధికారులు ఆలోచించారు. వాహనాల యజమానులు తాము పలానా ఏజెంట్ల ద్వారానే రవాణశాఖను అప్రోచ్ అయినట్లు చెప్పటంతో ఉన్నతాధికారులు సదరు ఏజెంట్ల ఆఫీసులపైన దాడులు చేశారు. అప్పుడు వందలకొద్ది ఆర్సీలు, లైసెన్సులు బయటపడ్డాయి. కారణం ఏమిటంటే ఏజెంట్లు అడిగినంత డబ్బులు ఇవ్వని కారణంగా ఆర్సీలు, లైసెన్సులు ఇంకా రవాణశాఖ దగ్గరే పెండింగులో ఉందని వాహనాల యజమానులకు ఏజెంట్లు సమాధానం ఇస్తున్నట్లు బయటపడింది.

ఇక రెండో కారణం ఏమిటంటే రవాణశాఖలోనే బాగా జాప్యం అవుతోంది. కారణం ఏమిటంటే కార్డుల ప్రింటింగ్ ప్రక్రియను రాష్ట్రంలోని 60 రవాణశాఖ ఆపీసులు చేపడుతున్నాయి. అవసరమైన కార్డులు అందుబాటులో లేనికారణంగా ప్రింటింగ్ బాగా ఆలస్యమవుతోంది. దాంతో ఏ ఆపీసులో ఎన్ని కార్డులు ప్రింటింగుకు ఇస్తున్నారు, ఎన్ని యజమానులకు అందుతున్నాయనే విషయంలో సరైన రికార్డులుండటంలేదు. అందుకనే కార్డుల ప్రింటింగ్, జారీ మొత్తాన్ని రవాణశాఖ సెంట్రలైజ్ చేసేసింది. అంటే ఆర్సీలు, లైసెన్సుల ప్రింటింగ్, జారీ అంతా ఇకనుండి సెంట్రల్ ఆఫీసు నుండే వాహనాల యజమానుల అడ్రస్ కు వెళిపోతుంది. ఏ కారణం వల్లయినా తమకు కార్డులు రాకపోతే ఆఫీసుకు రాకుండా ఆన్ లైన్లోనే యజమానులు ఆ విషయాన్ని రవాణశాఖ ఉన్నతాదికారుల దృష్టికి తీసుకెళ్ళవచ్చు.

Read More
Next Story