అదానీ జీతం.. తన కింద పని చేసే వాళ్ల కంటే తక్కువ?
దేశంలోనే రెండో అత్యంత సంపన్నుడు అయినా గౌతమ్ అదానీ తన గ్రూప్ లో పని చేసినందుకు ఎంత జీతం తీసుకుంటున్నారో తెలుసా? అసలు ఆయనకు ఎన్ని కంపెనీలు ఉన్నాయి. వేటీ నుంచి..
దేశంలోనే రెండో అత్యంత సంపన్నుడు గౌతమ్ అదానీ గత ఏడాది కాలంలో తన కంపెనీల నుంచి వార్షిక వేతనంగా రూ. 9.26 కోట్ల తీసుకున్నారు. అయితే ఇది తన పరిశ్రమలోని కింది స్థాయి అధికారులకంటే తక్కువ కావడం గమనార్హం. అదానీ గ్రూప్ కు చెందిన పోర్ట్స్, ఎనర్జీ కంపెనీల్లో 10 లిస్ట్ అయ్యాయి. వాటిలో ఆయన కేవలం రెండు కంపెనీల నుంచి మాత్రమే వేతనం అందుకుంటున్నారు. ఈ విషయాన్ని కంపెనీల వార్షిక నివేదికలు చూపించాయి.
రెన్యుమరేషన్
గ్రూప్ ఫ్లాగ్ షిప్ సంస్థ అయిన అదానీ ఎంటర్ ప్రైజెస్ లిమిటెడ్(ఏఈఎల్) నుంచి 2023-24 నుంచి ఈ మొత్తం అందుకున్నట్లు నివేదికలు సూచిస్తున్నాయి. ఆయనకు జీతంతో పాటు ఇతర అలవెన్సులు కూడా కంపెనీ అందించింది. అయితే ఇది గత సంవత్సరం అందుకున్న వార్షిక వేతనం కంటే మూడు శాతం ఎక్కువ. అంతేకాకుండా, అదానీ పోర్ట్స్,SEZ లిమిటెడ్ (APSEZ) నుంచి రూ.6.8 కోట్లు డ్రా చేశారు.
అదానీ జీతం దేశంలోని దాదాపు అన్ని పెద్ద కుటుంబ యాజమాన్యంలోని కంపెనీల అధిపతుల కంటే తక్కువగా ఉంది. దేశంలోనే అత్యంత సంపన్న భారతీయుడు, ముఖేష్ అంబానీ కోవిడ్-19 తరువాత కంపెనీలను తీసుకునే వార్షిక వేతనాలను వదులుకున్నాడు. అంతకంటే ముందు తన వేతనం సంవత్సరానికి రూ. 15 కోట్లుగా ఉండేది. ప్రస్తుతం భారతీ ఎయిర్ టెల్ ఓనర్ భారతీ మిట్టల్ రూ. 16.7 కోట్లు(2022), రాజీవ్ బజాజ్ రూ. 53 కోట్లు, పవన్ ముంజాల్ రూ. 80 కోట్లు, తీసుకుంటున్నారు. వారితో పోల్చితే ఆదానీ జీతం చాలా తక్కువ.
అగ్రస్థానం కోసం..
బ్లూమ్‌బెర్గ్ బిలియనీర్ ఇండెక్స్ ప్రకారం ఆదాని సంపద విలువ ప్రస్తుతం 106 బిలియన్ డాలర్లు, ప్రస్తుతం ఆసియాలోనే అత్యంత సంపన్న వ్యక్తి స్థానం కోసం అంబానీతో పోటీపడుతున్నాడు. అయితే హిండెన్ బర్గ్ తప్పుడు నివేదికతో ఆదాని దాదాపు 40 బిలియన్ డాలర్ల సంపదను నష్టపోయాడు. అంతకుముందు అతని సంపద విలువ 150 యూఎస్ బిలియన్ డాలర్లుగా ఉండేది. ఈ ఆర్ధిక సంవత్సరంలో రెండుసార్లు అంబానీని మించి పోయాడు కానీ.. మార్కెట్ ర్యాలీలో తిరిగి రెండో స్థానానికి వచ్చాడు. 111 బిలియన్ డాలర్ల నికర సంపదతో అంబానీ ప్రపంచ సంపన్నుల జాబితాలో 12వ స్థానం, అదానీ 14వ స్థానంలో ఉన్నారు.
అదానీ తమ్ముడు రాజేష్ ఏఈఎల్ నుంచి రూ.4.71 కోట్ల కమీషన్‌తో సహా రూ.8.37 కోట్లు పొందగా, అతని మేనల్లుడు ప్రణవ్ అదానీ రూ.4.5 కోట్ల కమీషన్‌తో సహా రూ.6.46 కోట్లు డ్రా చేసినట్లు వార్షిక నివేదికలో తేలింది. గౌతమ్ అదానీ AEL నుంచి ఎటువంటి కమీషన్ తీసుకోలేదు కానీ APSEZ నుంచి 5 కోట్ల రూపాయలు పొందారు. APSEZ నుంచి వచ్చే రెమ్యునరేషన్‌లో రూ. 1.8 కోట్ల జీతం, రూ. 5 కోట్ల కమీషన్ 2024-25 ఆర్థిక సంవత్సరంలో చెల్లించబడుతుందని కంపెనీ వార్షిక నివేదిక తెలిపింది. అతని కుమారుడు, కరణ్ APSEZ నుంచి రూ. 3.9 కోట్లు సంపాదించాడు. గౌతమ్ అదానీ సోదరుడు, మేనల్లుడు, కొడుకు ఒకటి కంటే ఎక్కువ కంపెనీల నుంచి జీతాలు తీసుకోలేదు.
AEL బోర్డులో కీలకమైన ఎగ్జిక్యూటివ్, డైరెక్టర్ అయిన వినయ్ ప్రకాష్ రూ. 89.37 కోట్ల రూపాయలను అందుకున్నారు. గ్రూప్ సీఎఫ్ఓ జుగేషీందర్ సింగ్ రూ.9.45 కోట్ల వేతనం పొందారు. గ్రూప్ పునరుత్పాదక ఇంధన సంస్థ, అదానీ గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్ సీఈవో వీనీత్ ఎస్ జైన్ రూ. 15.25 కోట్లు వార్షిక వేతనం పొందగా, అదానీ టోటల్ గ్యాస్ లిమిటెడ్ (ఏటీజీఎల్) సీఈవో సురేష్ పి మంగ్లానీ రూ. 6.88 కోట్లు ఆర్జించారు. అదానీ విల్మార్ సీఈవో అంగ్షు మల్లిక్ రూ.5.15 కోట్లు పొందారు. అదానీ పవర్ సీఈవో ఎస్‌బీ ఖ్యాలియాకు రూ.5.63 కోట్లు లభించాయి.
రెన్యుమరేషన్ పెరుగుదల
"కీలక నిర్వాహక సిబ్బంది మినహా ఉద్యోగులకు సగటు వేతనం 12 శాతం పెరిగింది. KMPలకు 5.37 శాతం పెరిగింది" అని AEL తన వార్షిక నివేదికలో పేర్కొంది.
Next Story