ప్రచారానికి సిద్ధం కండి : కార్యకర్తలకు తమిళనాడు సీఎం స్టాలిన్‌ లేఖ
x

ప్రచారానికి సిద్ధం కండి : కార్యకర్తలకు తమిళనాడు సీఎం స్టాలిన్‌ లేఖ

‘నియంత పాలన పోవాలి, భారతదేశం పురోగమించాలి’ పేరుతో డీఎంకే మూడు రోజుల పాటు ప్రచారం నిర్వహించనుంది. ఈ ప్రచారం రేపటి నుంచి ప్రారంభం కానుంది.


తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌ కేంద్రంపై విరుచుకుపడ్డారు. తమ డిమాండ్లను పరిష్కరించాలంటూ ఢిల్లీకి బయలుదేరిన రైతుల పట్ల కేంద్రంలోని ఎన్డీఏ సర్కారు అనుచితంగా వ్యవహరిస్తోందని విమర్శించారు. యుద్ధభూమి కంటే దారుణమైన పరిస్థితులను సృషిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఢిల్లీ సరిహద్దుల వద్ద ఉద్రిక్తత..

దేశ రాజధానిలోకి ప్రవేశించే సరిహద్దుల వద్ద తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పోలీసులు బారికేడ్లు ఏర్పాటు చేశారు. పోలీసులను భారీగా మోహరించారు. ‘ఢిల్లీ చలో’ కార్యక్రమంలో భాగంగా పంజాబ్‌ నుంచి వచ్చిన రైతులపై బుధవారం షంభు బార్డర్‌ వద్ద హర్యానా పోలీసులు టియర్‌ గ్యాస్‌ను ప్రయోగించారు. బారికేడ్లను తొలగించేందుకు రైతులు ప్రయత్నించారు. వారిని అడుకున్న పోలీసులపై రైతులు రాళ్లు రువ్వారు.

ప్రచారానికి సిద్ధం కావాలని లేఖ..

‘నియంత పాలన పోవాలి, భారతదేశం పురోగమించాలి’ పేరుతో డీఎంకే మూడు రోజుల పాటు ప్రచారం నిర్వహించనుంది. ఫిబ్రవరి 16 నుంచి ప్రారంభమయ్యే ‘హక్కుల కోసం స్టాలిన్‌ పిలుపు (ఉరిమైగలై మీట్కా స్టాలిన్‌-కురళ్‌)’ పేరుతో చేపట్టే రాష్ట్రవ్యాప్త ప్రచారానికి సిద్ధం కావాలని కార్యకర్తలకు లేఖ రాశారు.

‘‘నిరసన వ్యక్తం చేస్తున్న రైతులను అణిచివేసేందుకు కేంద్ర ప్రభుత్వం యుద్ధభూమి కంటే అధ్వాన్నమైన వాతావరణాన్ని సృష్టిస్తోంది. అసలు దేశంలో ప్రజాస్వామ్యం ఉందా? రాజ్యాంగం అమలులో ఉందా?’’ అని డీఎంకే అధ్యక్షుడు స్టాలిన్‌ లేఖలో కేంద్రాన్ని ప్రశ్నించారు.

మొదటి గళం మాదే..

ప్రజాస్వామ్యానికి ఎప్పుడు ముప్పు వాటిల్లిన్నపుడల్లా, దాన్ని ఖండిరచడంలో తమిళనాడు ముందుంటుందని పేర్కొన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిత్‌ షా, బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డాతో సహా బీజేపీ నేతలకు డీఎంకే నిద్రలేని రాత్రులు మొదలయ్యాయని విరుచుకుపడ్డారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి 2024 లోక్‌సభ ఎన్నికలు తగిన సమాధానం చెబుతాయని లేఖలో పేర్కొన్నారు. గవర్నర్‌లను అడ్డం పెట్టుకుని, కేంద్ర దర్యాప్తు సంస్థలు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌, సీబీఐ, ఆదాయపు పన్ను శాఖలతో బీజేపీయేతర పాలిత రాష్ట్రాలపై దాడులు చేసి సంక్షోభం సృషించడం బీజేపీకి అలవాటైపోయిందన్నారు. కేంద్రం నియంతలా వ్యవహరిస్తూ తమిళనాడు వంటి రాష్ట్రాల హక్కులను కాలరాస్తుంటే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు.

Read More
Next Story