ఇక హైదరాబాద్ లో ప్రతి మూల ఒక అందమైన సెల్ఫీ పాయింటే....
x
Photos: I&PR, Telangana Govt.

ఇక హైదరాబాద్ లో ప్రతి మూల ఒక అందమైన సెల్ఫీ పాయింటే....

మిళమిళ మెరిసే హైదరాబాద్: జిహెచ్ ఎం సి 2026 కొత్త శపథం


కొత్త సంవత్సరం గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ (GHMC)ఒక కొత్త నిర్ణయం ప్రకటించింది. తొందరలో నగరాన్ని మిళమిళ మెరిసేలా చేయాలని నిర్ణయించింది. తెలంగాణ రాజధాని నగరం మెగా సిటీ కాబోతున్నందున దీనికోసం ఒక మెగా శానిటేషన్ కార్యక్రం చేపట్టనుంది. డిసెంబర్ 29 నుంచి రోజుల పాటు ఈ కార్యక్రమం జరగనుంది. దోమల వ్యాప్తిని అరికట్టడం, డెంగ్యూ కేసులను నివారించేందుకు శానిటేషన్ డ్రైవ్ చేపట్టడుతున్నారు. హైదరాబాద్ కు ఈ సందర్భంగా కొత్త సంవత్సర శుభాకాంక్షలు చెప్పాల్సిందే.



ఇది మంచి నిర్ణయం ఈసారి ఇది విజయవంతమవుతుందని ఆశిద్దాం. ఎందుకంటే, ఇలాంటి కార్యక్రమాలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రోజుల నుంచి ప్రతికమిషనర్ పదవి చేపట్టగానే ఇలాంటి మహత్తర కార్యక్రమం చేపట్టేవాడు. కొంతమంది కమిషనర్లు శానిటేషన్ డ్రైవ్ ల ను ప్రారంభించడమే కాదు, ఆర్ధరాత్రి పర్యటనలుకూడా చేశారు. ఆరోజుల్లో హైదరాబాద్ కు కొన్నాళ్లు చాలా సీనియర్ ఐఎఎస్ అధికారులు కమిషనర్లు గా వచ్చేవారు. కాబట్టి ఈ పర్యటలనకు మంచి ప్రచారం వచ్చేది. అయితే, రెండుమూడు నెలల్లో మమూలు మళీ హైదరాబాద్ చెత్తకుప్పగా మారేది. గతంలో తీసుకున్న నిర్ణయాలలో బజార్లలో షాపుల ఎదురుగా పడే చెత్తకి షాపు వారు జవాబు దారి అన్నారు. ఈ ఛెత్త ఎత్తేయకపోతే జరిమాన అన్నారు. మొన్నామధ్య బిఆర్ ఎస్ అధికారంలో ఉన్నపుడు తడిచెత్త పొడి చెత్త వేసేందుకు ప్రతి ఇంటికి డబ్బాలు ఇచ్చారు. చెత్తతీసుకుపోయే వారికోసం వాహానాలు ఇచ్చారు. దీనివల్ల ఏమీ ప్రయోజనం జరగలేదు. ఉమ్మడి రాష్ట్రంలోఉన్నపుడు ఎలా ఉందో ప్రత్యేక తెలంగాణ వచ్చాక కూడా చెత్త విషయంలో హైదరాబాద్ నగర వాసులు, మునిసిపాలిటీ ఒకే లాగా ఉన్నాయి. ఖాళీ స్థలం కనిపిస్తే, పౌరులు, రియల్ ఎస్టేట్ వాళ్లు ఎక్కడెక్కడినుంచి చెత్త తీసుకువచ్చి వేయడం బాధ్యతగా పెట్టుకున్నారు. ఇళ్ల మధ్య ఖాళీ స్థలం కనపడితే చాలు, కాలనీ వాళ్లంతా అక్కడ చెత్త వేస్తారు. ఆ చెత్త రోడ్డు మీద లేదు కాబట్టి, దాని తీసేయడం మన బాధ్యత కాదని మునిసిపల్ శానిటేషన వర్కర్లు భావిస్తుంటారు. ఈ నేపథ్యం 2026 కొత్త సంవత్సర శపథం ప్రకటించారు. అంతే, కొత్త సంవత్సరం పాతశపథమే.


శానిటేషన్ మెగా డ్రైవ్

ఈ కార్యక్రమంలో భాగంగా ప్రతీరోజు 300 వార్డుల్లో పారిశుద్ద పనులు చేపట్టనున్నారు. వార్డుల్లో ఎప్పటినుంచో పేరుకుపోయిన చెత్తను దీని ద్వారా తొలగిస్తారు. అలాగే భవనాలు, ఇళ్లు కూల్చివేతలు చేపట్టిన సమయంలో పేరుకుపోయిన వ్యర్థాలను కూడా తొలగిస్తారు ఇక పార్కులు, పుట్‌పాత్‌లపై ఉన్న చెత్తాచెదారాలను కూడా శుభ్రం చేస్తారు.. ప్రజలు తరచుగా చెత్త వేసే ప్రదేశాలను గుర్తించడం, అక్కడ చెత్త వేయకుండా మొక్కలు నాటడం, గోడలకు రంగులు వంటి పనులను చేపట్టనున్నారు.

మెట్రో పిల్లర్ల వద్ద కూడా శుభ్రత

ఇలాగే ఫ్లైఓవర్లు, మెట్రో పిల్లర్ల మధ్య కూడా శుభ్రం చేసే పనులను జీహెచ్‌ఎంసీ చేపట్టనుంది. ఇక రోడ్లపై చెత్తచెదారం వేయడం వల్ల దోమల వ్యాప్తి చెందుతుంది. దీని వల్ల ప్రలు డెంగ్యూ, మలేరియా వంటి రోగాలు వ్యాపిస్తాయి. ఇటీవల నగరంలో డెంగ్యూ కేసులు పెరుగుతున్నాయి. వర్షాకాలంలో డెంగ్యూ కేసులు మరింతగా పెరుగుతున్నాయి. దీంతో పాటు నగరాన్ని సుదరంగా తీర్చిదిద్దేందుకు ఈ కార్యక్రమాన్ని జీహెచ్ఎంసీ చేపడుతోంది. హైదరాబాద్ లోని ప్రతి అంగుళాన్ని సెల్ఫీ పాయింట్ చేయబోతున్నారని సమాచారం, పౌరసంబంధాల శాఖ ప్రకటించింది.

Read More
Next Story