తెలంగాణ ఇంటర్మీడియట్ ఫలితాల్లో అమ్మాయిలదే పైచేయి
x

తెలంగాణ ఇంటర్మీడియట్ ఫలితాల్లో అమ్మాయిలదే పైచేయి

అడ్వాన్స్ డ్ సప్లెమెంటరీ పరీక్షల కోసం ఫీజును ఏప్రిల్ 13 నుండి 20వ తేదీలోగా చెల్లించాలి


ఆదివారం విడుదలైన ఇంటర్మీడియట్ పరీక్షల ఫలితాల్లో అమ్మాయిలదే పైచేయిగా నిలిచింది. ఇంటర్మీడియట్ మొదటి, రెండో సంవత్సర ఫలితాలను ప్రభుత్వ సలహాదారుడు కే కేశవరావు, విద్యాశాఖ కార్యదర్శి యోగితారాణ విడుదలచేశారు. మొదటి సంవత్సరంలో 66.20 శాతం, రెండో ఏడాదిలో 70.58 శాతం ఉత్తీర్ణత సాధించారు. ఈసారి కూడా అమ్మాయిలదే పైచేయిగా నిలిచింది. మొదటి సంవత్సరం పరీక్షలకు 4,89,123 మంది విద్యార్ధులు హాజరైతే 3,23,807 మంది పాస్ అయ్యారు. ఇందులో అమ్మాయిల పాస్ శాతం 74.40 కాగా, అబ్బాయిల పాస్ శాతం 57.69. అలాగే రెండో సంవత్సరం పరీక్షలు రాసింది 5,07,948 మంది. ఇందులో 3,58,490 మంది పాస్ అయ్యారు. అమ్మాయిల ఉత్తీర్ణత శాతం 78.65, అబ్బాయిల ఉత్తీర్ణత శాతం 62.50 నమోదైంది. 2025లో మొదటి సంవత్సరం ఉత్తీర్ణత 66.91శాతం కాగా రెండో ఏడాది ఉత్తీర్ణత శాతం 72.43.

సప్లిమెంట్ పరీక్షలు

ఇంటర్ మీడియట్ రీ కౌంటింగ్, రీ వెరిఫికేషన్ ఏప్రిల్ 13 నుండి 20వ తేదీవరకు దరఖాస్తు చేసుకోవచ్చని బోర్డు అధికారులు తెలిపారు. అడ్వాన్స్ డ్ సప్లెమెంటరీ పరీక్షల కోసం ఫీజును ఏప్రిల్ 13 నుండి 20వ తేదీలోగా చెల్లించాలి. మే 13వ తేదీనుండి అడ్వాన్స్ డ్ సప్లిమెంటరీ పరీక్షలు ప్రారంభమవుతాయి. ఈ పరీక్షలను రెండు సెషన్లలో నిర్వహించబోతున్నట్లు అధికారులు తెలిపారు. మే 22వ తేదీనుండి ప్రారభమయ్యే ఇంటర్మీడియట్ ప్రాక్టికల్ పరీక్షలు కూడా రెండు సెషన్లలో జరుగుతాయని అధికారులు ప్రకటించారు.

Read More
Next Story