రెండో వాహనం కోనేవారికి శుభవార్త
x
Additional tax waiver in Telangana

రెండో వాహనం కోనేవారికి శుభవార్త

రెండో వాహనం కొనుగులోపైన ఇప్పుడు విధిస్తున్న అదనపు పన్ను విధానాన్ని(Additional Tax dropped) రద్దుచేయబోతున్నది


చాలా కుటుంబాల్లో రెండో వాహనం కొనటం కామన్ అయిపోయింది. అది కారు కావచ్చు లేదా మోటారు సైకిల్ కూడా కావచ్చు. కారు, (Motorbikes)మోటార్ బైక్ ఉన్న కుటుంబాలు రాష్ట్రంలో లక్షల్లో ఉంటాయి. అలాగే రెండు లేదా మూడు మోటారు సైకిళ్ళు ఉన్న కుటుంబాలు కూడా లక్షల్లోనే. రెండో వాహనం(Second Vehicle) కొన్నవాళ్ళంతా కచ్చితంగా అదనపు పన్ను కట్టేఉంటారు. భవిష్యత్తులో రెండో వాహనం కొనుగోలు చేయాలని అనుకునేవారికి తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పబోతోంది. అదేమిటంటే రెండో వాహనం కొనుగులోపైన ఇప్పుడు విధిస్తున్న అదనపు పన్ను విధానాన్ని(Additional Tax dropped) రద్దుచేయబోతున్నది.

రెండో వాహనంపై ఇప్పుడు విధిస్తున్న అదనపు పన్ను విధానాన్ని రద్దుచేయాలని ఇప్పటికే రవాణాశాఖ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డికి ప్రతిపాదనలు పంపింది. ఈ ప్రతిపాదనకు రేవంత్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. దీనికి సంబంధించిన ఫైల్ పై సంతకం చేయటం, ఉత్తర్వులు జారీ అవటమే మిగిలుంది.

రాష్ట్రంలో ప్రతి ఏడాది 7 లక్షల కొత్త బైకులు, 2.57 లక్షల కార్లు కొంటున్నారు. వీటిల్లో సుమారు 2 లక్షల వరకు అదనపు వాహనాలే ఉంటున్నాయి. అంటే పైన చెప్పుకున్నట్లుగా ఒక వాహనం ఉన్న కుటుంబం అవసరాల కోసం రెండో వాహనాన్ని కొనటం అన్నమాట. రెండో వాహనం కొనుగోలు మీద 2 లక్షల మంది అదనపు ట్యాక్స్ ప్రభుత్వానికి చెల్లిస్తున్నారు. రెండో వాహనం కొనుగోలు వల్ల అదనంగా 2 శాతం అదనపు ట్యాక్స్ చెల్లిస్తున్నారు. వాహనం ధరను బట్టి ట్యాక్స్ లో మార్పులుంటాయి. ఉదాహరణకు రు. 1.20 లక్షల ఖరీదైన మోటారు బైక్ కొంటే అదనపు పన్ను కింద 2 శాతం అంటే రు. 2400 కట్టాల్సుంటుంది.

ఇలాంటి అదనపు పన్నువల్ల రవాణాశాఖకు ఏడాదికి సుమారు రు. 100 కోట్ల ఆదాయం అందుతోంది. రెండో వాహనంపై అదనపు ట్యాక్స్ ను ప్రభుత్వం ఎందుకు వసూలుచేస్తోంది అంటే కొనుగోలుదారులను నిరుత్సాహ పరచటానికే. కారణం ఏమిటంటే ఒకే ఇంట్లో రెండు, మూడు వాహనాలుంటే అనేక సమస్యలు తలెత్తుతున్నాయి. రోడ్డుపైన ట్రాఫిక్ రద్దీని తగ్గించేందుకు, వాహన కాలుష్యాన్ని నియంత్రించేందుకు, పబ్లిక్ ట్రాన్స్ పోర్ట్ యుటిలిటీని పెంచటం లాంటి అనేక కారణాల వల్ల రెండో వాహనం కాన్సెప్టుపై అదనపు పన్నును రవాణాశాఖ వసూలు చేస్తోంది.

అయితే కుటుంబ అవసరాలను దృష్టిలో పెట్టుకుని అదనపు ట్యాక్స్ ను పట్టించుకోకుండా రెండో వాహనాన్ని కొనేవాళ్ళ సంఖ్య పెరిగిపోతోంది. అంతేకాకుండా ఒక వాహనం ఉన్న యజమాని తన పేరుమీద రెండో వాహనం కొంటేనే అదనపు ట్సాక్స్ కట్టాలి. అదే కుటుంబంలోని ఇంకో వ్యక్తి పేరుమీద కొన్నపుడు అదనపు ట్యాక్స్ కట్టాల్సిన అవసరం ఉండదు.

ఎందుకంటే అదనపు వాహనం కొనుగోలు చేసే యజమాని పేరుమీద అంతకుముందు మరో వాహనం ఏదీ రిజిస్టర్ అయి ఉండదు కాబట్టే. ఇలాంటి అదనపు కొనుగోలు వాహనాలు ఏదైనా ప్రమాదాల్లో ఇరుక్కున్నపుడు బీమా క్లైమ్ సందర్భాల్లో చాలా సమస్యలు ఎదురవుతున్నట్లు రవాణాశాఖ ఉన్నతాధికారులు ప్రభుత్వం దృష్టికి తెచ్చారు. ఇదే సమయంలో కేంద్రప్రభుత్వం అమలుచేస్తున్న ‘వాహన్’ వ్యవస్ధలో కొత్తగా తెలంగాణ కూడా చేరింది. ఈ వాహన్ అనే వ్యవస్ధలో అదనపు ట్యాక్స్ విధించటం అన్న ఆప్షన్ లేదు. దీంతో ఆప్షన్ లేనపుడు తెలంగాణలో అదనపు ట్యాక్స్ విధించటాన్ని సాఫ్ట్ వేర్ తిరస్కరిస్తోంది.

వాహన్ లో భాగంగా ఉంటు ప్రత్యేకంగా అదనపు ట్యాక్స్ వసూళ్ళ కోసం ప్రత్యేక సాఫ్ట్ వేర్ ఏర్పాటు చేయటం సాధ్యంకాదు. అందుకనే ఈ ప్రాక్టికల్ సమస్యలను రేవంత్ దృష్టికి తీసుకెళ్ళినపుడు అదనపు ట్యాక్స్ విధానాన్ని రద్దు చేయమని ఆదేశాలు ఇచ్చినట్లు సమాచారం. తొందరలోనే అదనపు పన్ను విధానాన్ని తొలగింపుపై ప్రభుత్వం అధికారికంగా ప్రకటన చేయబోతోందని తెలుస్తోంది. రెండో వాహనానికి అదనపు ట్యాక్స్ తొలగించటం వల్ల ఎక్కువగా కార్లు కొనుగోలు చేసేవారికి లాభంగా ఉంటుంది. ఎవరికైనా అంతిమంగా ఇది గుడ్ న్యూసే కదా.

Read More
Next Story