ఎన్నికల బరిలో బాలీవుడ్ నటుడు గోవిందా.. ఎక్కడి నుంచి? పార్టీ ఏది?
బాలీవుడ్ నటుడు గోవిందా మళ్లీ రాజకీయాల్లోకి రానున్నారా? ఆయనతో టచ్‌లో ఉన్న పార్టీ ఏది? ఎక్కడి నుంచి పోటీ చేయబోతున్నారు?
బాలీవుడ్ నటుడు గోవిందా మళ్లీ క్రియాశీల రాజకీయాల్లోనూ వస్తున్నారన్న ఊహాగానాలు ఊపందుకున్నాయి. ఇందుకు కారణం ఆయనతో మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే జరిపిన సమావేశం. రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో ముంబై వాయువ్య (North-West) నియోజకవర్గం నుంచి శివసేన (షిండే) నుంచి గోవిందాను బరిలో నిలిపే ఆలోచనలో ఉన్నారు షిండే.
షిండే సహాయకుడు కృష్ణ హెగ్డే కూడా గురువారం జుహు నివాసంలో గోవిందను కలిశారు. పార్టీలోకి రావాలని కోరారు. అందుకు గోవిందా అంగీకరించడంతో ముఖ్యమంత్రి షిండే ఆయనకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానం పలికారు.
అమోల్ కీర్తికర్‌కు పోటీగా..
శివసేన (యుబిటి) నుంచి బరిలో దిగిన అమోల్ కీర్తికర్‌కు వ్యతిరేకంగా గోవిందాను పోటీకి నిలపాలని ముఖ్యమంత్రి షిండే గేమ్ ప్లాన్‌గా కనిపిస్తోంది. ఇక్కడ సిట్టింగ్ ఎంపీ గజానన్ కీర్తికర్. ఈయన కొడుకే కీర్తికర్. గజానన్ ఎన్నికల్లో పోటీ చేయడానికి ఆసక్తి చూపకపోవడంతో ఆయన కొడుకును రంగంలోకి దింపింది శివసేన (యుబిటి). కాగా అమోల్‌ను ఓడించే స్థాయి అభ్యర్థి కోసం అన్వేషణ మొదలుపెట్టిన షిండే వర్గం చివరకు గోవిందాను నిలపాలనే నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం.
2004లో విజయం..
గోవిందా రాజకీయ రంగానికి కొత్తేమీ కాదు. 2004లో అతను కాంగ్రెస్ తరపున పోటీ చేసి ముంబై నార్త్ లోక్‌సభ నియోజకవర్గంలో దీర్ఘకాల బిజెపి ఎంపి రామ్ నాయక్‌ను ఓడించారు. తర్వాత కాంగ్రెస్ పార్టీతో విడిపోయారు. 2009 లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయకూడదని నిర్ణయించుకున్నారు.
Next Story