2023 ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిచేది కాదు: రేవంత్
x

2023 ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిచేది కాదు: రేవంత్

పేదలకు ఇవ్వడానికి ప్రభుత్వం దగ్గర భూములు లేవని స్పష్టం చేసిన సీఎం రేవంత్.


తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు 2023లో కాంగ్రెస్ విజయంపై సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల్లో మూటలతో గెలిచే పని అయితే అప్పుడు కాంగ్రెస్ ఎట్టిపరిస్థితులల్లో గెలిచి ఉండేది కాదన్నారు. కానీ ప్రజలు చిత్తశుద్ధికి ఓటు వేశారని, అందుకే ప్రజాపాలన ప్రభుత్వం ఏర్పడిందని అన్నారు. శుక్రవారం శిల్పకళా వేదికలో నిర్వహించిన మాదిగ ఎంపాయిస్ కో-ఆర్డినేషన్ కమిటీ ధన్యవాద కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగానే రేవంత్ పలు కీలక అంశాలపై స్పందించారు. ఈ నేపథ్యంలోనే పేదలకు ఇవ్వడానికి ప్రభుత్వం దగ్గర భూములు లేవని స్పష్టం చేశారు.

తమ ప్రభుత్వం ఎప్పుడూ కూడా ప్రజల గురించే ఆలోచిస్తుంద తప్ప, తమ సంపాదన పెంచుకోవాలని, ఆస్తులు దండుకోవాలని చూడదన్నారు. పేదలకు ఇవ్వడానికి భూమి లేని కారణంగానే పేద పిల్లలకు నాణ్యమైన విద్యను అందించాలని తాము నిర్ణయించుకున్నామని రేవంత్ అన్నారు. నాణ్యమైన విద్య ద్వారా వారిలో చైతన్యం తీసుకొస్తామని, సామాజికంగా వారికి బలాన్ని పెంపొందించడం తమ ప్రభుత్వ లక్ష్యమని ఆయన పర్కొన్నారు. ఈ సందర్భంగానే ఆయన తమ ప్రభుత్వ లక్ష్యాలను ఉద్దేశించి మాట్లాారు.

ఈ సందర్భంగానే ఆయన 2023 ఎన్నికల సమయాన్ని గుర్తు చేసుకున్నారు. ‘‘మా దగ్గర ప్రభుత్వ యంత్రాంగం లేదు. అక్రమ సంపాదనా లేదు. ఆ ఎన్నికల్లో గెలవాలంటే ఎలా అని మా పరిస్థితి అగమ్య గోచరంగా ఉండేది. ఒకవైపు అక్రమ కేసులు, అక్రమ సంపాదనతో ఉన్నవారు ఆధిపత్యాన్ని చలాయిస్తున్నారు. కానీ మేము మాత్రం ఎన్నికల్లో నిలబడాలే చచ్చినా, బతికినా ఎలాగైనా గెలవాలని చిత్తశుద్ధితో ముందుకు అడుగు వేశాం. అప్పుడు మా ప్రయత్నానికి మీరంతా అండగా నిలవడం వల్లే ఈ రోజున ప్రజా పాలన ప్రభుత్వం ఏర్పడింది. మాటలతోనూ, మూటలతోనూ గెలిచే పని అయితే 2023 నాడు మేము గెలిసి ఉండే వాళ్ళం కాదు. కమిట్మెంట్ తో చిత్తశుద్ధి తో ప్రజా సమస్యలను పరిష్కరించాలన్న ఆలోచనతో ప్రజల ముందు కు వచ్చినా కాబట్టే ప్రజా పాలన ఏర్పడ్డది’’ అని రేవంత్ పేర్కొన్నారు.

పేదలకు భూములు లేవని స్పష్టంగా తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు, “మాదిగ సోదరులు, ఇతర పేదలు కోసం ప్రభుత్వం వద్ద భూములు అందుబాటులో లేవు. అందువల్ల వారి భవిష్యత్తుకు మెరుగైన విద్య అందించడం మా ప్రధాన లక్ష్యం’’ అని ముఖ్యమంత్రి తెలిపారు, చదువుద్వారా యువతలో చైతన్యం, సామాజిక బలాన్ని పెంపొందించడం ప్రభుత్వ ఉద్దేశ్యం. విద్యాశాఖను నేరుగా తన ఆధీనంలో ఉంచి, పల్లెప్రాంతాల విద్యాలయాలలోనూ, సాంఘిక సంక్షేమ హాస్టళ్లలోనూ నాణ్యమైన విద్య మరియు భోజనం అందిస్తున్నట్టు ఆయన చెప్పారు.

అంతేకాక మహాభారతంలోని కర్ణుడు, బార్బరికుడి పాత్రలను ఆదర్శంగా తీసుకున్నట్టు, మిత్రధర్మం, బలహీనుల పక్షాన నిలబడడం వంటి విలువలను స్వయంగా అమలు చేస్తున్నట్టు చెప్పారు. సమాజంలోని పేద, లోబడి ఉన్న వర్గాల కోసం ప్రభుత్వం విద్యార్ధుల భవిష్యత్తు నిర్మాణంపై దృష్టి పెట్టిందని సీఎం స్పష్టంచేశారు. ప్రభుత్వానికి ఆర్థిక పరిమితులు ఉన్నప్పటికీ, పేదలకు సహాయం అందించడానికి అన్ని ప్రయత్నాలు జరుగుతున్నట్టు తెలిపారు. రిటైర్మెంట్లు, రేషన్ కార్డులు, సన్న బియ్యం, ఇళ్ల పథకాలు, ఉచిత విద్యుత్ వంటి సంక్షేమ కార్యక్రమాలు కొనసాగుతున్నాయని చెప్పారు.

ఎస్సీ, బీసీ వర్గీకరణలో న్యాయం అమలు చేయడం, భవిష్యత్తులో పేద విద్యార్థుల హక్కులను కాపాడడం, నాణ్యమైన విద్య అందించడం లక్ష్యంగా ఉందని చెప్పారు. ప్రభుత్వ ఉద్యోగులు ప్రణాళిక అమలులో కళ్ళు, చెవులు, బ్రాండ్ అంబాసిడర్లుగా ఉన్నారని చెప్పారు. ప్రజల సంక్షేమం, అభివృద్ధి, విద్య, హక్కుల పరిరక్షణలో ప్రభుత్వం నిరంతరం దృష్టి పెట్టుతుందని, ఎలాంటి ఇబ్బందులు వచ్చినా, మాదిగ సోదరులకు, పేదలకు అండగా ఉండే ప్రభుత్వ విధానం కొనసాగుతుందని స్పష్టం చేశారు.

Read More
Next Story