దీపావళిని ముందే తెచ్చిన జీఎస్టీ సంస్కరణలు
x

దీపావళిని ముందే తెచ్చిన జీఎస్టీ సంస్కరణలు

నాలుగు స్లాబుల విధానం నుంచి రెండు స్లాబుల విధానంలోకి పన్నులు, దేశీయ వినియోగాన్ని పెంచడమే ఏకైక లక్ష్యం


అంతర్జాతీయంగా భారత వస్తువులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించడానికి కేంద్రం నడుం బిగించింది. దేశీయంగా వినిమయం పెంచి, పారిశ్రామిక అభివృద్దిని స్థిరంగా కొనసాగించడానికి జీఎస్టీ సంస్కరణలకు పచ్చజెండా ఊపింది.

ఇక నుంచి తల నూనె మొదలు కార్న్ ప్లేక్స్ వరకూ, టీవీలు సహ ఎలక్ట్రానిక్ వస్తువులు, లైఫ్ ఇన్సురెన్స్ పాలసీలు, హెల్త్ పాలసీలుపై పన్ను రేట్లను జీఎస్టీ కౌన్సిల్ సవరించింది. వీటిని ఈ నెల 22 ను అధికారికంగా అమలు చేస్తున్నట్లు ప్రకటించింది.




అన్ని వ్యక్తిగత వస్తువులను పన్ను రేట్లను మండలి తగ్గిస్తున్నట్లు వెల్లడించింది. దేశీయంగా వినియోగాన్ని పెంచి అమెరికా టారిఫ్ వార్ నుంచి విముక్తి పొందడానికే ఈ చర్య తీసుకున్నట్లు స్పష్టం. నిన్న జీఎస్టీ కౌన్సిల్ 56 వ సమావేశం సుదీర్ఘంగా సాగింది. పన్ను రేట్లను తగ్గించడానికి అంగీకరించింది. అన్ని నిర్ణయాలను కౌన్సిల్ ఏకగ్రీవంగా తీసుకుందని ఎవరూ వ్యతిరేకించలేదని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ విలేకరుల సమావేశంలో చెప్పారు.
కొత్తగా 40 శాతం స్లాబ్..
జీఎస్టీలో ఇంతకుముందు నాలుగు స్లాబుల విధానం అమలులో ఉండేది. అంటే 5, 12, 18, 28 పన్ను రేట్లు ఉండేవి. అయితే కొత్త దీన్ని కేవలం రెండు స్లాబుల కిందకు మార్చారు. ఇక నుంచి వీటని కేవలం 5, 18 శాతం కింద సరళీకరించడానికి జీఎస్టీ మండలి అంగీకరించింది.
లగ్జరీ కార్లు, పొగాకు ఉత్పత్తులు, కొన్ని ప్రత్యేక వస్తువులపై ఈ పన్ను రేట్లు మాత్రం 40 శాతం గా నిర్ణయించారు. గుట్కా, పొగాకు, పొగాకు ఉత్పత్తులు, సిగరెట్లు మినహ అన్ని ఉత్పత్తులకు కొత్త పన్ను రేట్లు సెప్టెంబర్ 22 నుంచి అమలులోకి తెస్తున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి వివరించారు.
ధరలు తగ్గేవి..
ఇక నుంచి రోజువారీ ఆహార పదార్థాలకు పన్ను రేట్లు మినహయించారు. వెన్న, నెయ్యి, డ్రై ప్రూట్స్, కండెన్సడ్ మిల్క్, సాసేజ్, మాంసం ఉత్పత్తులు, మాంసం, పండ్ల రసం, గుజ్జు, ఐస్ క్రీం, ప్రేస్టీ, బిస్కెట్లు, కార్న్ ప్లేక్స్, తృణధాన్యాలు, ఆహార పానీయాలపై పన్ను రేట్ ప్రస్తుతం 18 శాతంగా ఉంది.
ఇక నుంచి ఇవి 5 శాతానికి తగ్గిస్తారు. అన్ని రకాల చపాతీ, పరోటాలపై ప్రస్తుతం 5 శాతం పన్నులు విధిస్తున్నారు. ఇక నుంచి వీటిపై ఎలాంటి పన్ను ఉండదు. అలాగే అన్ని వ్యక్తిగత, ఆరోగ్య బీమా పాలసీలకు ఎటువంటి పన్ను ఉండదు.
తగ్గనున్న సిమెంట్ ధరలు..
సిమెంట్ రేట్ కూడా భారీగా తగ్గబోతోంది. ప్రస్తుతం వీటిపై 28 శాతం పన్ను విధిస్తున్నారు. ఇక నుంచి ఇది 18 శాతానికి తగ్గడంతో వీటి ధర తగ్గనుంది. 1200 సీసీ కంటే తక్కువ, 4000 ఎంఎం కంటే ఎక్కువ పొడవు లేని పెట్రోల్, ఎల్పీజీ, సీఎన్జీ వాహానాలపై కూడా 28 శాతం నుంచి 18 శాతానికి పన్ను రేట్లను తగ్గించారు.
1200 సీసీ కంటే ఎక్కువ, 4 వేల మిమి కంటే ఎక్కువ సామర్థ్యం ఉన్న అన్ని ఆటోమొబైల్స్, అలాగే 350 సీసీ కంటే ఎక్కువ సామర్థ్యం ఉన్న బైక్ లు, వ్యక్తిగతీ ఉపయోగం కోసం పడవలు, విమానాల, రేసింగ్ కార్లు 40 శాతం పరిధిలోకి వస్తాయి. అయితే ఎలక్ట్రిక్ వాహనాలపై మాత్రం 5 శాతం జీఎస్టీని వసూలు చేస్తారు.
Read More
Next Story