ఎంపీ హగ్డేపై చర్యలు తీసుకునే దమ్ముందా?
x

ఎంపీ హగ్డేపై చర్యలు తీసుకునే దమ్ముందా?

కర్ణాటక ఎంపీ అనంత్‌కుమార్ హెగ్డే చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ పార్టీ బీజేపీపై విరుచుకుపడింది.


కర్ణాటక ఎంపీ అనంత్‌కుమార్ హెగ్డే చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ పార్టీ బీజేపీపై విరుచుకుపడింది. రాజ్యాంగం పట్ల తనకున్న నిబద్ధతను రూపించుకోడానికి కర్ణాటక ఎంపీపై చర్య తీసుకుంటారా? అని బీజేపీ నేతలను కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి జైరాం రమేష్‌ ప్రశ్నించారు.

గుజరాత్‌, రాజస్థాన్‌ పర్యటనలో ఉన్న ప్రధానికి ఆయన ఐదు ప్రశ్నలు సంధించారు. ‘‘సబర్మతి ఆశ్రమ స్మారక ప్రాజెక్టు కోసం ప్రధాని అహ్మదాబాద్‌లో ఉన్నారు. ప్రధానమంత్రి తన రాజకీయ ప్రయోజనాల కోసం మహాత్మాను ఆలింగనం చేసుకుంటున్నారు. అయితే ఆయన ఆదర్శాలైన అహింస, కలుపుగోలుతనం, సమానత్వానికి కట్టుబడి ఉంటారా?” అని జైరాం రమేష్ ఎక్స్ లో పోస్టు చేశారు.

శనివారం కర్ణాటకలోని కార్వార్‌లో జరిగిన సభలో హెగ్డే మాట్లాడుతూ.. రాజ్యాంగాన్ని సవరించడానికి బిజెపికి పార్లమెంటు ఉభయ సభలలో మూడింట రెండొంతుల మెజారిటీ అవసరమని అన్నారు. దీనికి ప్రతిగా గుజరాత్‌లో గత ఏడేళ్లుగా జరిగిన 14 పేపర్ లీకేజీలపై ప్రధాని మోదీ నోరు నొప్పుతారా? అని ప్రశ్నించారు రమేష్. ఇతర రాష్ట్రాలతో పోల్చితే గుజరాత్‌లో అభివృద్ధి చాలా తక్కువగా ఉందని అన్నారు. "హయ్యర్ సెకండరీ విద్యార్థులను నిలుపుకోవడంలో గుజరాత్ అధ్వాన్నంగా ఉంది. రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్ వంటి పేద రాష్ట్రాల కంటే ప్రభుత్వ విద్యపై తక్కువ ఖర్చు చేస్తోంది. దారిద్య్ర రేఖకు దిగువన నివసిస్తున్న జనాభా పరంగా చూస్తే.. గుజరాత్ ప్రస్తుతం 20 ప్రధాన రాష్ట్రాల్లో 10వ స్థానంలో ఉంది" అని జైరాం రమేష్ అన్నారు.

'బేటీ బచావో, బేటీ పడావో'పై ప్రధానమంత్రి బహిరంగంగా ప్రచారం చేసినా..లింగ నిష్పత్తిలో గుజరాత్ 20 రాష్ట్రాల్లో 15వ స్థానంలో ఉంది. గుజరాత్ సామాజిక-ఆర్థిక వెనుకబాటుతనాన్ని 2014లో తాను ప్రచారం చేసిన 'గుజరాత్ మోడల్'తో లేదా నేడు ఆయన సమర్థిస్తున్న 'డబుల్ ఇంజిన్' సర్కార్ మోడల్‌తో ప్రధాని మోదీ ఎలా సమన్వయం చేస్తారు? అని కాంగ్రెస్ నేత ప్రశ్నించారు.

"ఆర్థిక సంవత్సంర 2019లో కేంద్ర బడ్జెట్‌లో రక్షణ రంగ వ్యయం 17.43 శాతం నుంచి ఆర్థిక బడ్జెట్ 2025కి 13 శాతానికి పడిపోయింది. జీడీపీ శాతం ప్రకారం ఇది 2014, 2024 మధ్య 2.13 శాతం నుంచి 1.9 శాతానికి పడిపోయింది - కనీసం 2 శాతం ప్రపంచ ప్రమాణం కంటే తక్కువ," అని జైరాం చెప్పారు.

సాయుధ బలగాలకు సరిపడా నిధులు ఇవ్వకుండా భారత సరిహద్దును కాపాడాలని, చైనాను భయపెట్టాలని ప్రధాని ఎలా ప్లాన్ చేస్తున్నారని రమేష్ ప్రశ్నించారు.

DRDOని ప్రైవేటీకరించడం లేదంటే మూసివేయడం కోసం ప్రధానమంత్రి గత మూడేళ్లలో రెండు కమిటీలను ఏర్పాటు చేసిన విషయాన్ని జైరాం రమేష్ గుర్తు చేశారు.

Read More
Next Story