భారత్ తో జరిగే టెస్ట్ సిరీస్ నుంచి హ్యారీ బ్రూక్ ఔట్
x
హ్యరీ బ్రూక్, ఇంగ్లాండ్ బ్యాట్స్ మెన్

భారత్ తో జరిగే టెస్ట్ సిరీస్ నుంచి హ్యారీ బ్రూక్ ఔట్

భారత్ తో జరిగే టెస్ట్ సిరీస్ కు ముందే ఇంగ్లాండ్ కి ఎదురు దెబ్బ తగిలింది. కీలక ఆటగాడు బ్రూక్ సిరీస్ నుంచి తప్పుకున్నాడు.


భారత్ తో ఈ నెల 25 నుంచి ప్రారంభం కాబోయే ఐదు మ్యాచ్ ల టెస్ట్ సిరీస్ నుంచి ఇంగ్లాండ్ నయా సంచలనం, మిడిల్ ఆర్డర్ బ్యాట్స్ మెన్ హ్యరీ బ్రూక్ తప్పుకున్నాడు. గురువారం హైదరాబాద్ లో ప్రారంభం కానున్న మొదటి టెస్ట్ మ్యాచ్ నుంచే అతను అందుబాటులో ఉండట్లేదని ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు ప్రకటించింది. తన వ్యక్తిగత కారణాల వల్ల బ్రూక్ ఈ సిరీస్ నుంచి తప్పుకుంటున్నట్లు వెల్లడించింది.

సిరీస్ కు ముందు అబుదాబిలో జరిగిన సన్నాహక శిబిరానికి బ్రూక్ వెళ్లాడు. అయితే అనుకోని పరిస్థితుల వల్ల అతను జట్టు నుంచి తప్పుకోవాలని అనుకున్నాడని ఈసీబీ తెలిపింది. "అతను స్వదేశానికి తిరిగి రావడానికి సిద్దంగా ఉన్నాడు, ఈ పర్యటనలో ఇక భారత్ కు తిరిగి రాడు" అని ఓ ప్రకటనలో ఈసీబీ పేర్కొంది.

" దయచేసి అతని వ్యక్తిగత విషయాల జోలికి వెళ్లకండి. బ్రూక్ కుటుంబం కూడా పూర్తిగా ప్రైవసీని కోరుకుంటోంది, మీడియా కానీ వేరే ఇతర వ్యక్తులు కానీ అతని విషయంలో కొన్ని రోజులు దూరంగా ఉండాలని అభ్యర్థిస్తున్నాం" అని ఈసీబీ వెల్లడించింది. ప్రస్తుతం ఇంగ్లండ్ సెలక్టర్లు అతడి స్థానాన్ని భర్తీ చేసేందుకు చూస్తున్నారని, సరైన ఆటగాడిని ఎంపిక చేస్తారని ఈసీబీ తెలిపింది.

హ్యరీ బ్రూక్ 2022లో దక్షిణాఫ్రికా పై టెస్ట్ అరంగ్రేటం చేశాడు. అతి తక్కువ కాలంలోనే కీలక ఆటగాడిగా ఎదిగాడు. ఈ 24 ఏళ్ల యార్క్ షైర్ ఆటగాడు ఇప్పటి వరకూ 12 టెస్ట్ మ్యాచ్ లు ఆడాడు. అందులో నాలుగు సెంచరీలు, ఏడు అర్దసెంచరీలు సాధించాడు. 61 సగటుతో 1181 పరుగులు సాధించాడు. ముఖ్యంగా పాకిస్తాన్ తో పాకిస్తాన్ తో జరిగిన మ్యాచ్ లో ఆకాశమే హద్దుగా చెలరేగాడు. మిడిల్ ఆర్డర్ లో దూకుడుగా ఆడే తత్వం ఉన్న బ్రూక్, సిరీస్ మొత్తానికి దూరం అవడం ఇంగ్లాండ్ జట్టుకి పెద్ద ఎదురు దెబ్బే.

Read More
Next Story