‘భారతరత్న’బీజేపీకి ఎన్నికల టూల్ గా మారిందా?
x

‘భారతరత్న’బీజేపీకి ఎన్నికల టూల్ గా మారిందా?

ఈ సంవత్సరం లోక్ సభ ఎన్నికలకు ముందు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ఐదుగురికి భారత రత్న పురస్కారాలు ప్రకటించింది. ఇది ప్రభుత్వం తమ రాజకీయాల కోసం వాడుకోబోతుందా?


ప్రతిపక్ష నాయకులు, మాజీ ప్రధానులు, మాజీ రాష్ట్రపతులు, క్రీడాకారులు ఇలా పలువురికి మోదీ ప్రభుత్వం భారత రత్నలు ప్రకటిస్తోంది. తాజాగా భారత మాజీ ప్రధాని పీవీ నరసింహరావు, చౌదరి చరణ్ సింగ్, వ్యవసాయ విప్లవ పితామహుడు ఎంఎస్ స్వామినాథన్ లకు భారత రత్న అవార్డులను ప్రభుత్వం ప్రకటించింది.

ఈ మేరకు ప్రధాని తన ఎక్స్ ఖాతాలో ట్వీట్ చేశారు. ఇంతకుముందే మాజీ ఉప ప్రధాని, బీజేపీ కురు వృద్ధుడు ఎల్ కే ఆద్వానీ, బిహార్ మాజీ ముఖ్యమంత్రి కర్పూరీ ఠాకూర్ లకు కూడా భారత రత్న అవార్డులను కేంద్రం ప్రకటించింది. ఇలా దేశంలో ఒకే సంవత్సరం ఐదుగురికి దేశ అత్యున్నత రాజకీయ పురస్కారం ప్రకటించడం ఇదే మొదటి సారి. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో ప్రతిపక్షాలు ఇండియా కూటమిని వేసుకుని వస్తున్నప్పటికీ తాము సులువుగా 400 మార్కును దాటుతామని కమల దళం ప్రచారం చేస్తోంది.

ఆర్ఎల్డీతో పొత్తు

బీజేపీ తన బలాన్ని పెంచుకునే ప్రయత్నంలో భాగంగానే ఉత్తర ప్రదేశ్ కు చెందిన ప్రముఖ రైతు నాయకుడు మాజీ ప్రధాని చౌదరి చరణ్ సింగ్ కు భారతరత్న ప్రకటించినట్లు విశ్లేషణలు వినిపిస్తున్నాయి. వీరి కుటుంబం ఆధీనంలో ఆర్ఎల్డీ పార్టీ జయంత్ చౌదరి నేతృత్వం లో ఉంది. ఈయన చరణ్ సింగ్ కు మనవడు.



ఆ పార్టీని ప్రసన్నం చేసుకోవడానికే దేశ అత్యున్నత పురస్కారం ప్రకటించ వచ్చనే అనుమానాలు ఉన్నాయి. ఢిల్లీ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్న జాట్లు ఈ ఆర్ఎల్ఢీ కి మద్దతుగా ఉన్నారు. దేశంలో 80 లోక్ సభ సీట్లున్న యూపీలో బీజేపీ- ఆర్ఎల్డీ పొత్తు ఏ మేరకు ఉపయోగపడుతుందో చూడాలి. పొత్తులో భాగంగా ఆ పార్టీకి రెండు లోక్ సభ సీట్లు, ఒక రాజ్య సభ సీట్ ఆఫర్ చేయవచ్చని పలు జాతీయ మీడియా సంస్థలు అంచనా వేస్తున్నాయి. ఆర్ఎల్డీకీ బాగ్ పత్, బిజ్నోర్ ఎంపీ సీట్లతో పాటు, జయంత్ భార్య కు రాజ్యసభ సీటు వస్తుందని ఊహగానాలు వినిపిస్తున్నాయి.

సామాజిక న్యాయం నినాదం

యూపీ తరువాత మరో పెద్ద రాష్ట్రమైన బిహార్ లో 40 ఎంపీ స్థానాలు ఉన్నాయి. ఇక్కడ కూడా పలు ఓట్లు బ్యాంకులపై బీజేపీ కన్నేసీ కర్పూరీ ఠాకూర్ కు భారతరత్న ప్రకటించింది. ఇది జరగడానికి కొన్ని రోజుల ముందే నితీష్ కుమార్ ఆర్జేడీ- కాంగ్రెస్ కూటమితో తెగతెంపులు చేసుకుని తిరిగి ఎన్డీఏ కూటమిలో చేరారు.



కర్పూరీ ఠాకూర్ కు అవార్డు రావడం వెనక కులాల ఏకీకరణ జరగకుండా చూడాలనే బీజేపీ లక్ష్యం కూడా ఉన్నట్లు కనిపిస్తోంది. ఓబీసీలు, ఎంబీసీల మధ్య స్పష్టమైన విభజన చేసి ప్రతిపక్షాలకు లబ్ధి చేకూరకుండా చూడాలనే లక్ష్యం కనిపిస్తోంది. బిహార్ కుల గణన సర్వే ప్రకారం మొత్తం జనాభాలో దాదాపు 63 శాతం వెనకబడిన తరగతులు ఉన్నాయి.

వారిలో ఓబీసీలు 27 శాతం, ఎంబీసీ 36 శాతం ఉన్నారు. అలాగే కుల గణన చేస్తామనే మాటను పదే పదే ప్రస్తావిస్తున్న కాంగ్రెస్ ను బలహీన పరచాలనే లక్ష్యం కూడా ఈ అవార్డు ప్రకటనలో కనిపిస్తోంది. రిజర్వేషన్ లపై 50 శాతం ఉన్న పరిమితిని సైతం ఎత్తివేస్తామనే వేసిన రాహూల్ గాంధీ ప్రకటనను కూడా బలహీన పరిచేందుకు ఈ అవార్డు ఉపయోగపడుతుందని కమల దళం వ్యూహం లా కనపడుతోంది.

దక్షిణాదిన బలమైన ముద్ర కోసం

లోక్ సభ ఎన్నికల ముందు భారత మాజీ ప్రధాని పీవీ నరసింహరావుకు భారత రత్న ప్రకటించడం కూడా ఈ కోవలోకే వస్తుందని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు.



మాజీ ప్రధాని పీవీని చాలాసార్లు బహిరంగంగా అవమానపరిచింది. ఈ విషయాన్ని గుర్తు చేసి తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ లో భావోద్వేగం రగిలించి ఓటర్ల ప్రసన్నం వేసుకునే ఎత్తును బీజేపీ వేసింది.

ప్రధాని నరేంద్రమోదీ ఈ రోజు చేసిన ట్వీట్ లో కూడా పీవీ దక్షిణాదికి చెందిన వారు అని అర్థం వచ్చేలా ఉంది. " నరసింహారావు గారూ.. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా, కేంద్రమంత్రిగా, అనేక సంవత్సరాల పాటు పార్లమెంట్, శాసన సభ్యుడి గా చేసిన కృషికి చిరస్థాయిగా గుర్తుండి పోతారు" అని ట్వీట్ చేశారు.

లోక్ సభ స్థానాల పరంగా ఉత్తర భారతంలో బీజేపీ గరిష్ట స్థాయికీ చేరుకుంది. అలాగే దక్షిణాదిలో కూడా విస్తరించాలని కోరుకుంటోంది. 129 స్థానాల్లో కేవలం 29 స్థానాలనే బీజేపీ కైవసం చేసుకోగలిగింది. అందులో కర్నాటకలోని 29 స్థానాల్లో 25, తెలంగాణలో 4 స్థానాలు గెలుచుకుంది. మిగిలిన రాష్ట్రాల్లో కనీసం ఖాతా కూడా తెరవలేదు. దీనిని ఇప్పుడు విస్తరించుకోవాలనే లక్ష్యంగా పెట్టుకుంది. ఏపీలో జనసేనతో పొత్తులో ఉన్న బీజేపీ, తెలంగాణలో రాజకీయాలకు అతీతంగా పీవీకి భారతరత్న ప్రకటించడం పై హర్షాతిరేకాల వ్యక్తం అయ్యాయి.

హిందుత్వ ఓటు





రామమందిరాన్ని ప్రారంభించిన కొన్ని రోజులకే అయోధ్య ఉద్యమ రథసారథి ఎల్ కే ఆద్వానీకి కేంద్ర ప్రభుత్వం భారతరత్న ప్రకటించింది. బాల రాముడి ప్రతిష్టకు ఆద్వానీని రాకపోవడంపై ఉన్న వ్యతిరేకతను తగ్గించుకోవడానికే దేశ అత్యున్నత పురస్కారం ప్రకటించారని ఊహగానాలు వస్తున్నాయి. నిజానికి అయోధ్య ఉద్యమానికి , హిందూ సెంటిమెంట్ కు ప్రధాన ఛాంపియన్ ఆద్వానినే. అతనే బీజేపీ పార్టీ పోస్టర్ బాయ్. ఓబీసీ కోటా, బీపీ మండల్ కమిషన్ పై దేశంలో రాజకీయంగా గందరగోళం లో ఉన్న పరిస్థితుల్లో అయోధ్య రథయాత్ర చేసి విజయవంతం అయ్యారు.

రైతుల నిరసన

దేశ హరిత విప్లవ పితామహుడు ఎంఎస్ స్వామినాథన్ కు భారతరత్న ప్రకటించడం కూడా కీలకమైన సమయంలో జరిగింది. ఓ వైపు దేశంలో ఎంఎస్పీ ధర ప్రకటించాలని కోరుతూ యూపీలో రైతులు పార్లమెంట్ ముట్టడికి బయల్దేరితే వారిని నోయిడా దగ్గర యూపీ పోలీసులు అడ్డుకున్నారు.



అయితే ఎంఎస్ స్వామినాథన్ కమిటీ సూచించిన కనీస మద్ధతు ధరలను అమలు చేయాలని, అదే ఆయనకు అసలైన నివాళి అని రైతు సంఘాలు పేర్కొంటున్నాయి. చట్టపరమైన C2+50 గురించి పూర్తిగా అమలు చేయాలని రైతు సంఘాలు కోరుతున్నాయి.



Read More
Next Story