హత్రాస్‌ ఘటనపై ఎట్టకేలకు స్పందించిన భోలే బాబా
x

హత్రాస్‌ ఘటనపై ఎట్టకేలకు స్పందించిన భోలే బాబా

"బాధితుల జాబితా మా వద్ద ఉంది. తొక్కిసలాటలో మరణించిన వారి కుటుంబాల విద్య, ఆరోగ్యం, వివాహ ఖర్చులను ట్రస్ట్ చూసుకుంటుంది" - భోలే బాబా తరపు న్యాయవాది


యూపీలోని హత్రాస్‌లో జరిగిన తొక్కిసలాట ఘటనపై స్వయం ప్రకటిత భోలేబాబా విచారం వ్యక్తం చేశారు. విచారణకు పూర్తిగా సహకరిస్తానని హామీ ఇచ్చారు.

“ఈ బాధను భరించే శక్తిని భగవంతుడు మాకు ప్రసాదిస్తాడు. దయచేసి ప్రభుత్వం, పాలనా యంత్రాంగంపై నమ్మకం ఉంచండి. గందరగోళం సృష్టించిన వారెవరిని విడిచిపెట్టరన్న నమ్మకం ఉంది. మృతుల కుటుంబాలకు, క్షతగాత్రలకు అండగా ఉండగా నిలవాలని మా వారికి చెప్పారు.’’ అని పేర్కొన్నారు కానిస్టేబుల్ ఉద్యోగాన్ని వదిలేని భోలేబాబాగా మారిన నారాయణ్ సాకర్ హరి.

విచారణకు సహకరిస్తాం'

తొక్కిసలాట ఘటన జరిగిన తర్వాతి నుంచి భోలేబాబా కనిపించలేదు. అయితే విచారణకు సహకరిస్తారని ఆయన న్యాయవాది ఏపీ సింగ్ శుక్రవారం తెలిపారు. " జిల్లాల వారీగా బాధితుల జాబితా మా వద్ద ఉంది. తొక్కిసలాటలో మరణించిన వారి కుటుంబాల విద్య, ఆరోగ్యం, వివాహ ఖర్చులను నారాయణ్ సకర్ హరి ట్రస్ట్ చూసుకుంటుంది" అని చెప్పారు.

పోలీసుల కస్టడీలో సత్సంగ్ ప్రధాన నిర్వాహకుడు..

సత్సంగ్ ప్రధాన నిర్వాహకుడు దేవప్రకాష్ మధుకర్ ఢిల్లీలో లొంగిపోయిన తర్వాత ఉత్తరప్రదేశ్ పోలీసులు ఆయనను కస్టడీలోకి తీసుకున్నారు.

‘మా క్లయింట్ ఎలాంటి తప్పు చేయలేదు. ముందస్తు బెయిల్ కోసం దరఖాస్తు కూడా చేసుకోం. దేవ్‌ప్రకాష్ మధుకర్ హార్ట్ పేషెంట్. ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. ఢిల్లీలోని పోలీసులు, సిట్, ఎస్‌టీఎఫ్‌లకు సమాచారం ఇచ్చి లొంగిపోయాం అని మధుకర్ తరఫు న్యాయవాది సింగ్ చెప్పారు.

సిట్ నివేదికలో ఏముంది?

‘‘హత్రాస్‌లో జరిగిన సత్సంగ్‌కు 2 లక్షల మందికి పైగా భక్తులు వచ్చారు. ఈ కార్యక్రమానికి భోలే బాబా హాజరయ్యారు. సత్సంగ్ పూర్తయ్యాక ఆయన కారులో వెళ్లారు. కారు వెళ్ళిన నేల నుండి మట్టిని తీసుకోవడం కోసం తొక్కిసలాట జరిగింది. పర్యావసానంగా పురుషులు, మహిళలు, పిల్లలు ఒకరిపై ఒకరు పడిపోయారు. ఫలితంగా చాలా మంది చనిపోయారు. అధికారులు 80 వేల మందిని మాత్రమే అనుమతి ఇచ్చారు.’’ అని తొక్కిసలాట ఘటనపై దర్యాప్తు చేస్తున్న ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) నివేదికను యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌కు అందజేసింది.

న్యాయ విచారణకు ఆదేశం..

ముగ్గురు సభ్యులతో కూడిన సిట్ ఇప్పటివరకు 90 మంది వ్యక్తుల నుంచి వాంగ్మూలాలను రికార్డు చేసింది. రాష్ట్ర ప్రభుత్వం రిటైర్డ్ హైకోర్టు న్యాయమూర్తి నేతృత్వంలో ముగ్గురు సభ్యులత న్యాయ కమిషన్‌ను కూడా ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే.

Read More
Next Story