మన రేవంత్‌ రెడ్డే.. ఎన్‌ఆర్‌ఐ కాదు...
x

మన రేవంత్‌ రెడ్డే.. ఎన్‌ఆర్‌ఐ కాదు...

తెలంగాణ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన రేవంత్ తొలిసారి కొత్త గెటప్‌లో కనిపించారు. పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా దావోస్‌లో పర్యటించారు.


ఈ సూటు బూటు చూసి ఈయనెవరో పెద్ద పారిశ్రామిక వేత్తో, నాన్‌ రెసిడెంట్ ఇండియనో అనుకునేరు... సాక్షాత్తు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డే. నయా లుక్‌తో మెరిసిపోయారు. తెలంగాణ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారి కొత్త గెటప్‌లో కనిపించారు. పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా దావోస్‌లో పర్యటిస్తున్న ఆయన.. సూటు, బూటుతో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. సాధారణంగా వైట్‌ షర్ట్‌, బ్లాక్‌ ప్యాంట్‌లో కనిపించే రేవంత్‌రెడ్డి న్యూలుక్‌కు కాంగ్రెస్‌ నేతలు ఫిదా అవుతున్నారు. రేవంత్‌ దావోస్‌లో పర్యటించిన ఫొటోలు ట్విట్టర్‌లో ట్రెండింగ్‌గా మారాయి. వావ్‌ అదిరింది సూట్‌ అంటూ ఒకరు.. కింగ్‌లా ఉన్నారంటూ మరో నెటిజన్‌ ట్వీట్‌ చేశారు. మొత్తంగా కొత్త గెటప్‌లో కనిపించిన తెలంగాణ సీఎం.. ఇప్పుడో స్పెషల్‌ అట్రాక్షన్‌గా నిలిచారు.

దావోస్‌లో రేవంత్‌ బిజీబిజీ..

తెలంగాణ సీఎం రేవంత్‌ రెడ్డి బృందం దావోస్ పర్యటన కొనసాగుతోంది. ప్రపంచ ఆర్థిక సదస్సు వేదికగా తెలంగాణ ప్రభుత్వం ఇన్వెస్ట్ ఇన్ తెలంగాణ క్యాంపెయిన్‌ను విజయవంతంగా ప్రారంభించింది. రాష్ట్రానికి పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా ఈ సదస్సులో పాల్గొంటున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. అందులో భాగంగానే ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్‌ బాబుతో కలిసి.. ప్రపంచ దిగ్గజ కంపెనీల ప్రతినిధులతో కీలక సమావేశాల్లో పాల్గొంటున్నారు.

తొలి రోజు ఇలా సాగింది...

ఐటీ, జీవ వైద్య శాస్త్ర రంగానికి ముఖ్య కేంద్రంగా అభివృద్ధి చెందిన తెలంగాణ బలాలను ప్రపంచానికి చాటి చెప్పేందుకు.. భారీ పెట్టుబడులను ఆకర్షించాలనే లక్ష్యంతో తెలంగాణ ప్రతినిధి బృందం తొలి రోజే పలువురు ప్రముఖులతో కీలక చర్చలు జరిపింది. మెుదటి రోజు సీఎం రేవంత్ రెడ్డి.. వరల్డ్ ఎకనామిక్ ఫోరం ప్రెసిడెంట్ బోర్గ్ బ్రెండెతో సమావేశమయ్యారు. తెలంగాణలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలపై చర్చించారు. రాష్ట్రంలో ఏర్పడిన కొత్త ప్రభుత్వం ఏర్పాటుతో పాటు తమ ప్రభుత్వ ప్రాధాన్యతలను వివరించారు.


సుస్ధిరాభివృద్ధే మా ధ్యేయం...

పారిశ్రామికవేత్తలు, వ్యాపార వాణిజ్య వాటాదారులు కలిసికట్టుగా పని చేస్తేనే సుస్థిరమైన అభివృద్ధితో పాటు జీవన ప్రమాణాలు మెరుగుపడతాయి. రాష్ట్రంలో ఇంక్యుబేటర్ల ద్వారా వచ్చే ఐదేళ్లలో 20 వేల స్టార్టప్‌లపై ప్రభావం చూపించాలన్నది కాంగ్రెస్‌ లక్ష్యం. రాష్ట్రంలో సగం మంది ఫార్మా, బయోటెక్నాలజీ రంగాల్లో పనిచేస్తున్నారు. హైదరాబాద్‌లో C4IR ప్రారంభంతో మరిన్ని ఉపాధి అవకాశాలు మెరుగు పడతాయనడంలో సందేహం లేదన్నది రేవంత్‌రెడ్డి అభిప్రాయంగా ఉంది. పారిశ్రామిక అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం ఎంచుకున్న రూట్ మ్యాప్‌పైనా చర్చ సాగింది. రాష్ట్రంలో స్కిల్ డెవలప్‌మెంట్‌పై ప్రత్యేక దృష్టి సారించడం.. అందుకోసం అనుసరించే భవిష్యత్ మార్గాలపై చర్చించారు.

Read More
Next Story