వారణాసి కోర్టు తీర్పుపై హైకోర్టులో విచారణ
x

వారణాసి కోర్టు తీర్పుపై హైకోర్టులో విచారణ

జ్ఞానవాపి మసీదు సెల్లార్‌లోని విగ్రహాలకు పూజ చేయవచ్చని వారణాసి కోర్టు తీర్పునిచ్చింది. దీనిపై మసీదు కమిటీ వేసిన పిటిషన్‌ను హైకోర్టు విచారించనుంది.


చారిత్రాత్మక జ్ఞానవాపి మసీదు సెల్లార్‌లో హిందూ ప్రార్థనలకు వారణాసి కోర్టు అనుమతినిచ్చింది. ఈ తీర్పును వ్యతిరేకిస్తూ మసీదు వ్యవహారాలను చూసే అంజుమాన్‌ ఇంతేజామియా మసీదు కమిటీ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. అత్యున్నత న్యాయస్థానం సూచనమేరకు కమిటి హైకోర్టు తలుపుతట్టింది. కాగా హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ రోహిత్‌ రంజన్‌ అగర్వాల్‌ ఈ కేసు విచారణను ఫిబ్రవరి 6కి వాయిదా వేశారు.

వారణాసి కోర్టు తీర్పును నిరసిస్తూ శుక్రవారం మసీదు కమిటీ సూచనమేరకు వారణాసిలో ముస్లింలు తమ దుకాణాలను మూసివేశారు. మసీదుల్లో ప్రార్థనలు శాంతియుతంగా ముగించాలని కమిటీ కోరింది.

పోలీసు బలగాల మోహరింపు..

శాంతిభద్రతల పరిరక్షణ కోసం ఉత్తరప్రదేశ్‌లోని పొరుగు జిల్లాల నుంచి అదనపు పోలీసు బలగాలను రప్పించినట్లు పోలీసు అధికారులు తెలిపారు. వారణాసిలోని కాశీ విశ్వనాథ్‌ ధామ్‌ సమీపంలో, దాని చుట్టుపక్కల అదనపు భద్రతా బలగాలను మోహరించారు. జ్ఞానవాపి మసీదు సెల్లార్‌లోని విగ్రహాలకు పూజారి పూజ చేయవచ్చని వారణాసి కోర్టు బుధవారం తీర్పునిచ్చిన విషయం తెలిసిందే.

Read More
Next Story