
వేములవాడలో శివరాత్రి హెల్స్ డెస్క్ లు
జాతరలో ఏడు చోట్ల సహాయ కేంద్రాల ఏర్పాటు
తెలంగాణ వేములవాడ మహా శివరాత్రి జాతర సందర్భంగా భక్తులకు సమాచారం అందించేందుకు పలు ప్రాంతాల్లో మే ఐ హెల్ప్ యూ డెస్క్ లు ఏర్పాటు చేశారు
ఇంచార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్ ఆదేశాల మేరకు జిల్లా సంక్షేమ శాఖ ఆధ్వ ర్యంలో
1)తిప్పాపూర్ మెయిన్ బస్ స్టేషన్, 2)తిప్పాపూర్ బ్రిడ్జి దాటిన తర్వాత కాలినడక దారిలో,
3)జగిత్యాల తాత్కాలిక బస్ స్టేషన్ వద్ద,
4)కోరుట్ల బస్ స్టేషన్ జూనియర్ కళాశాల సర్కిల్ వద్ద,
5)శివార్చన స్టేజి.. పార్కింగ్ ప్రాంతం వద్ద,
6)బద్ది పోచమ్మ ఆలయం దగ్గర,.
7)భీమేశ్వర సదన్ వద్ద హెల్ప్ డెస్క్ లు ఏర్పాటు చేశారు.
ఈ కేంద్రాలు 24 గంటలు అందుబాటులో ఉంటాయి. మంచినీటి సరఫరా కోసం రెండు డెస్క్ లు ఏర్పాటు చేయడం జరిగింది.భక్తులకు అన్ని రకాల సౌకర్యాలు ఎక్కడెక్కడ లభిస్తాయి అనే విషయాలను అందుబాటులో ఉంటాయి. చంటి పిల్లలకు పాలు ఇవ్వడం కోసం కళ్యాణకట్ట సమీపంలో బేబీ ఫీడింగ్ క్యాబిన్ ఏర్పాటు చేశారు. ఆయా కేంద్రాలను జిల్లా సంక్షేమ అధికారి లక్ష్మీరాజం ఆదివారం పరిశీలించారు.
Next Story

