బ్రాహ్మణులు నలుగురు పిల్లల్ని కంటే లక్ష, చెలరేగిన వివాదం
మధ్యప్రదేశ్ ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే పరశురామ్ కల్యాణ్ బోర్డు బ్రాహ్మణులకు ఓ వినూత్న నజరానా ప్రకటించింది. ఎక్కువ మంది పిల్లల్ని కనాలని పిలుపునిచ్చింది.
భారతీయులు పిల్లల్ని కనడం మానేశారా? అందుకే రాష్ట్ర ప్రభుత్వాలు నజరానా ప్రకటిస్తున్నాయా? అంటే అవుననే సమాధానమే వస్తోంది. ఆమధ్య ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుుడు ఇద్దరు ముగ్గురు పిల్లల్ని కనమని, పిల్లల్ని కంటే ప్రభుత్వం ప్రోత్సాహమిస్తుందని ప్రకటించారు.
ఆర్.ఎస్.ఎస్. చీఫ్ మోహన్ భగవత్ కూడా ఇదే ఉద్బోధించారు. కుటుంబ వ్యవస్థపై దృష్టి సారించాలని, ఎక్కువ మంది పిల్లలు ఉండాలని పిలుపిచ్చారు.
ఇప్పుడు ఏకంగా మధ్యప్రదేశ్ ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే పరశురామ్ కల్యాణ్ బోర్డు బ్రాహ్మణులకు ఓ వినూత్న నజరానా ప్రకటించింది. బ్రాహ్మణ కమ్యూనిటీని పెంచుకునేందుకు ఎక్కువ మంది సంతానాన్ని కనాలని పిలుపునిచ్చింది. నలుగురు పిల్లలను కనే బ్రాహ్మణ దంపతులకు రూ.లక్ష నజరానా ప్రకటించింది.
మధ్యప్రదేశ్ (Madhya Pradesh) రాజధాని భోపాల్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో పరశురామ్ కల్యాణ్ బోర్డు (Parshuram Kalyan Board) అధ్యక్షుడు పండిత్ విష్ణు రాజోరియా ఈ ప్రకటన చేశారు. ఆయన ఏమన్నారంటే ‘‘మనం మన కుటుంబాలపై దృష్టి పెట్టడం మానేశాం. ఈ మధ్య యువత ఒక బిడ్డను కని ఆగిపోతున్నారు. ఇది చాలా సమస్యాత్మకంగా మారుతోంది. భవిష్యత్ తరాన్ని కాపాడాల్సిన బాధ్యత మనదే. అందుకే కనీసం నలుగురు పిల్లల్ని కనాలని కోరుతున్నా’’ అని రాజోరియా తెలిపారు.
చెలరేగిన వివాదం, ఎందుకంటే...
ఇప్పుడీ ప్రకటన వివాదాస్పదమైంది. రాజోరియా చేసిన ప్రకటనను కొన్ని రాజకీయ పక్షాలు తప్పుబట్టాయి. కాంగ్రెస్, సమాజవాదీ పార్టీ (ఎస్పీ) సహా పలు పార్టీలు ఆయన ప్రకటనతో విభేదించాయి. పండిట్ విష్ణు రాజోరియా పరశురామ్ కల్యాణ్ బోర్డు అనే బ్రాహ్మణ సంఘానికి నాయకత్వం వహిస్తున్నారు.
తక్కువ మంది పిల్లలకే పరిమితమవ్వడం తమకు సమస్యగా అనిపిస్తోందని రాజోరియా పేర్కొన్నారు. "యువతపై నాకు భారీ ఆశలు ఉన్నాయి. పాత తరాల నుంచి పెద్దగా ఆశించలేం. భవిష్యత్ తరాన్ని రక్షించడానికి మీరు బాధ్యత వహించాలి. కనీసం నలుగురు పిల్లలను కనండి" అని ఆయన ఇండోర్‌లో జరిగిన ఒక కార్యక్రమంలో చెప్పారు.
ఈ ప్రకటన తన వ్యక్తిగతమన్నారు. ప్రభుత్వంతో సంబంధం లేదని వివరణ ఇచ్చారు. "బ్రాహ్మణ సమాజం ఈ విధానాలను, పిల్లల విద్య, శిక్షణను, ఉన్నత స్థాయికి తీసుకువెళ్లగలదు" అని రాజోరియా అన్నారు.
కాంగ్రెస్ నేత పాలక రాజోరియా వ్యాఖ్యలను పునఃపరిశీలన చేయాలని కాంగ్రెస్ పార్టీ వ్యాఖ్యానించింది. వ్యక్తిగత అభిప్రాయం అని పక్కనపెట్టినప్పటికీ, కాంగ్రెస్ నేత ముకేష్ నాయక్ ఆయన "పునరాలోచించాల"ని విజ్ఞప్తి చేశారు.
"ఆయన ఓ గుణవంతుడు, నా స్నేహితుడు. జనాభా పెరుగుదల ప్రపంచంలో పెద్ద సమస్యలలో ఒకటని నేను ఆయనకు చెప్పాలనుకుంటున్నాను. పిల్లల సంఖ్య తక్కువగా ఉంటే, వారికి అవగాహన కల్పించాలని, ఈ తరహా నజరానాల వల్ల అనర్థాలు వస్తాయి" అని నాయక్ అన్నారు.
"సమాజాన్ని ముస్లింలు, హిందువులుగా విడగొట్టే కుట్రలో భాగమే ఈ తరహా ప్రకటనలను భావించాల్సి వస్తోందన్నారు.
‘‘నలుగురు పిల్లల్ని కనే మహిళలకు బోర్డు తరఫున రూ.లక్ష నజరానా అందిస్తాం. నేను బోర్డు అధ్యక్షుడిగా దిగిపోయిన తర్వాత కూడా ఈ అవార్డు కొనసాగుతుంది’’ అని ఆయన అన్నారు. ప్రస్తుతం ఈ వార్త నెట్టింట వైరల్‌గా మారింది.
Next Story