అగ్నిపథ్ రిక్రూట్‌మెంట్‌పై రాహుల్ వ్యాఖ్యలకు బీజేపీ ఎలా స్పందించింది?
x

అగ్నిపథ్ రిక్రూట్‌మెంట్‌పై రాహుల్ వ్యాఖ్యలకు బీజేపీ ఎలా స్పందించింది?

సైనికుల కోసం ప్రవేశపెట్టిన అగ్నిపథ్ రిక్రూట్‌మెంట్‌ను కాంగ్రెస్‌ అధినేత రాహుల్‌ గాంధీ తప్పుబట్టారు.


సైనికుల కోసం ప్రవేశపెట్టిన అగ్నిపథ్ రిక్రూట్‌మెంట్‌ను కాంగ్రెస్‌ అధినేత రాహుల్‌ గాంధీ తప్పుబట్టారు. ఇటీవల రాయ్‌బరేలీలో జరిగిన ఎన్నికల ర్యాలీలో ఆయన మాట్లాడారు. మోదీ ప్రభుత్వం సైనికుల్లో రెండు కేటగిరీలను సృష్టించి, ఒకదాన్ని పేద కుటుంబాలకు చెందిన వారి కోసం, రెండోదాని ధనిక వర్గాలకు చెందిన వారి కోసం కేటాయించిందని రాహుల్‌ వ్యాఖ్యలు ఇప్పుడు దుమారం రేపుతున్నాయి.

జైశంకర్ ఏమన్నారంటే..

'నరేంద్ర మోదీ రెండు రకాల సైనికులను సృష్టించారని రాహుల్ అన్నారు. దళితులు, ఆదివాసీలు, ఆర్థికంగా వెనుకబడిన, మైనార్టీ వర్గాలకు చెందిన వారి కుమారులను ఒక సైన్యంగా, ధనవంతుల కుమారులను మరో సైన్యంగా అభివర్ణించి సాయుధ బలగాల మనోధైర్యాన్ని దెబ్బతీయాలనుకుంటున్నారు. ఇది ఎన్నికల అంశం కాదు. దేశ భద్రతకు సంబంధించినది" అని జైశంకర్ విలేకరులతో అన్నారు. ఎన్నికల సంఘం రాహుల్‪పై చర్య తీసుకోవాలని డిమాండ్ చేసింది.

రాహుల్ గాంధీ సైనికులపై దాడి చేయడం ఇదే మొదటిసారి కాదని అన్నారు జైశంకర్. కొన్నేళ్ల క్రితం అరుణాచల్‌లో మన సైనికులు చైనా బలగాలను వెనకునెట్టినపుడు రాహుల్‌గాంధీ పార్లమెంటులో మన సైనికులను కొట్టారని ఆరోపించిన విషయాన్ని జైశంకర్ గుర్తు చేశారు.

Read More
Next Story