కరువు పరిహారాన్ని కర్ణాటక సర్కారు ఎలా సాధించుకుంది?
x

కరువు పరిహారాన్ని కర్ణాటక సర్కారు ఎలా సాధించుకుంది?

ఎట్టకేలకు కర్ణాటకలో సిద్ధరామయ్య ప్రభుత్వం విజయం సాధించింది. కరువు పరిహారాన్ని సాధించుకోవడంలో సఫలమైంది. కేంద్రం కర్ణాటకకు రూ.3,498 కోట్లు కేటాయించింది.


ఎట్టకేలకు కర్ణాటకలో సిద్ధరామయ్య ప్రభుత్వం విజయం సాధించింది. కరువు పరిహారాన్ని సాధించుకోవడంలో సఫలమైంది. కేంద్రం కర్ణాటకకు రూ.3,498 కోట్లు కేటాయించింది.

కోర్టు తలుపుతట్టిన కర్ణాటక సర్కారు..

కరువు పరిహారానికి రూ. 18,171 కోట్లు అవసరమని కర్ణాటక ప్రభుత్వం కేంద్రాన్ని అభ్యర్థించింది. ఇందులో తగినంత వర్షపాతం లేక పంటలు నష్టపోయిన రైతులకు రూ. 5,662 కోట్లు అవసరమని పేర్కొన్నారు. అయితే నిధుల విడుదలలో కేంద్రం జాప్యం చేసింది. దీంతో ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఫిబ్రవరి 7న ఢిల్లీలో నిరసన కార్యక్రమం చేపట్టారు. అందులో కేంద్రం నుంచి గ్రాంట్‌లు రాకపోవడం, పన్నుల పంపిణీలో అసమానతలను ఎత్తిచూపారు.

“కర్ణాటక రాష్ట్రంలోని 240 తాలూకాలలో 223 తాలూకాలను కరువుగా ప్రకటించారు. 48 లక్షల హెక్టార్లలో వ్యవసాయ పంటలు నష్టపోయాయి. రైతులు తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నారు. కేంద్రం నుంచి పరిహారం కోసం వేచిచూశాం. స్పందన లేదు. రాజ్యాంగంలోని 32వ అధికరణ ప్రకారం ముందుకెళ్లాం. రాష్ట్రానికి ఎన్‌డిఆర్‌ఎఫ్ నిధులు వెంటనే విడుదల చేసేలా కేంద్రాన్ని ఆదేశించాలని సుప్రీంకోర్టును ఆశ్రయించాం. ”అని గతంలో సిఎం సిద్ధరామయ్య చెప్పారు.

ఈ నేపథ్యంలో కేంద్రం నుంచి సానుకూల స్పందన రావడంతో హస్తం పార్టీ నేతలు, రైతులు సంతోషం వ్యక్తం చేశారు. కేంద్రం నిర్ణయం రైతుల విజయమని రెవెన్యూ మంత్రి కృష్ణ బైరేగౌడ పేర్కొన్నారు.

‘‘నిధులు విడుదల చేయాలని 9 నెలలుగా విజ్ఞప్తి చేసినా.. కేంద్రం స్పందించలేదు. దీంతో న్యాయస్థానాన్ని ఆశ్రయించాల్సి వచ్చింది.’’ అని మంత్రి కృష్ణ తెలిపారు. ఇక ఏ మాత్రం ఆలస్యం చేయకుండా కేంద్రం వెంటనే నిధులు విడుదల చేయాలని కోరుతున్నారు. పంట నష్టపోయిన రైతులకు తక్షణం పరిహారం చెల్లించాల్సి ఉందని గుర్తుచేశారు.

Read More
Next Story