నీట్ యూజీ రీ టెస్ట్‌లో వారికి ఈ సారి ఎన్ని మార్కులొచ్చాయి ?
x

నీట్ యూజీ రీ టెస్ట్‌లో వారికి ఈ సారి ఎన్ని మార్కులొచ్చాయి ?

నీట్ యూజీ ప్రశ్న పత్రం లీకైందని వస్తున్న వార్తల నేపథ్యంలో గతంలో అత్యుత్తమ మార్కులు సాధించిన విద్యార్థులకు మరోసారి పరీక్ష నిర్వహించారు. అయితే ఈ సారి వారికి..


హర్యానాలోని నీట్ పరీక్షా కేంద్రానికి హాజరై గత నెలలో ఆరుగురు విద్యార్థులు 720 మార్కులకు 720 మార్కులు సాధించి అందరి దృష్టిని ఆకర్షించారు. సుప్రీం కోర్టు ఆదేశాలతో నిర్వహించిన రీటెస్ట్‌లో ఎవరూ కూడా 682 మార్కులను మించి సాధించలేకపోయారు.

హర్యానాలోని బహదూర్‌ఘర్‌లోని ఓ స్కూల్‌లో మొత్తం 494 మంది విద్యార్థులు రీ-ఎగ్జామినేషన్‌కు హాజరయ్యారు. వాటిలో ఒక విద్యార్థి మాత్రమే అత్యధిక స్కోరు 682 మార్కులు సాధించాడు. 13 మంది విద్యార్థులు మాత్రమే 600 మార్కులకు పైగా స్కోర్ చేయగలిగారు. ఇది మే 5 పరీక్ష ఫలితాలకు పూర్తి విరుద్ధంగా ఉందని నివేదిక పేర్కొంది.

మేలో తొలిసారి నీట్-యూజీ పరీక్షలు నిర్వహించినప్పుడు 500 మందికి పైగా విద్యార్థులు ఈ కేంద్రంలో పరీక్షకు హాజరయ్యారు. ఇదే కేంద్రం నుంచి ఇద్దరు అభ్యర్థులు వరుసగా 718 మరియు 719 మార్కులు సాధించారు. ఈ మార్కులు రావడం అసంభవం.

మరోవైపు సుప్రీంలో విచారణ..

ఇదిలాఉండగా.. నీట్‌ పరీక్షలో పేపర్‌ లీక్‌ జరిగిన ఆరోపణలపై సుప్రీం కోర్టులో విచారణ జరుగుతోంది. ఈ క్రమంలోనే విచారణలో భాగంగా మిగతా కేంద్రాలతో పోలిస్తే అనుమానిత పరీక్ష కేంద్రాల్లో రాసిన వారికి ఎక్కువ మార్కులు వచ్చాయా.. లేదా అని తెలుసుకోవడానికి కేంద్రాల వారీగా ఫలితాలు అందించాలని కోర్టు ఎన్టీఏను ఆదేశించింది. ఫలితాలను ఎన్టీఏ వెబ్‌సైట్‌లో అప్‌లోడ్‌ చేయాలని, అయితే విద్యార్థుల గుర్తింపు బయటపడకుండా చూడాలని సూచించిన సంగతి తెలిసిందే.

ఈ ఏడాది మే 5న నీట్ యూజీ పరీక్ష జరిగింది. 571 నగరాల్లోని 4,750 సెంటర్లలో నిర్వహించిన ఈ పరీక్షకు 24 లక్షల మందికి పైగా హాజరయ్యారు. ఇందులో 14 కేంద్రాలు విదేశాల్లో ఉన్నాయి.

Read More
Next Story