బైజూస్‌పై జగన్‌కు ఎంత ప్రేమో

ట్యాబులు, కంటెంట్‌ కొనుగోళ్లలో రూ. 1,250 కోట్లు దోచిపెట్టారు: సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు


బైజూస్‌పై జగన్‌కు ఎంత ప్రేమో
x
సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోని 8వ తరగతి విద్యార్థులకు పంపిణీ చేసిన ట్యాబులు, అందులోని కంటెంట్‌ కొనుగోళ్ల విషయంలో భారీ కుంభకోణం చోటు చేసుకున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ట్యాబులు, కంటెంట్‌ కొనుగోళ్ల విషమై మొత్తంగా రూ. 1,250కోట్లు అదనపు చెల్లింపులు చేసినట్లు ప్రభుత్వంపై ఆరోపణలు వచ్చాయి. మార్కెట్లో ఉన్న ధరలు, చెల్లించిన ధరలు పరిశీలిస్తే ఇది నిజమని ఎవరికైనా తెలుస్తుంది. ముఖ్యమంత్రి జగన్‌కు ఎంత ప్రేమలేకపోతే బైజూస్‌కు భారీ ప్రయోజనం చేకూరుస్తారనేది ఇప్పుడు రాష్ట్రంలో చర్చనియాంశంగా మారింది.

ట్యాబుల కొనుగోలులో రూ. 250 కోట్లు హాంఫట్‌
రెండేళ్లల్లో 9,52,925 ట్యాబ్‌లను ఏపీ ప్రభుత్వం కొనుగోలు చేసింది. గతేడాది 5,18,745, ఈ ఏడాది 4,34,185 చొప్పున ట్యాబులు కొనుగోలు చేసినట్లు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. గతేడాది శ్యాంసంగ్‌ ఎ7 అనే మోడల్‌ ట్యాబు అమెజాన్‌ వెబ్‌సైట్‌లో కంపెనీనే రూ.11,999లకు అమ్ముతుంటే, రాష్ట్ర ప్రభుత్వం రూ.13,262లకు కొనుగోలు చేసింది. మార్కెట్లో హౌల్‌సెల్‌ ధర రూ.9వేలు మాత్రమే ఉంది. ఒక్కొ ట్యాబ్‌ను అదనంగా రూ.4వేలకు కొనుగోలు చేసినట్లు స్పష్టమైంది. ఈ ఏడాది ఈసర్‌ 1 మోడల్‌ ట్యాబును రూ.17,500లకు కొనుగోలు చేశారు. మార్కెట్‌లో ఇది రూ.14వేలకు మించి లేదు. çహోల్‌సేల్‌లో రూ.12వేలే ఉంటుంది. ట్యాబుల కొనుగోళ్లల్లో రూ.250కోట్లకు పైగా కుంభకోణం జరిగినట్లు ఆరోపణలు వచ్చాయి.
కంటెంట్‌ కొనుగోలులో రూ. 1,000కోట్ల కుంభకోణం
ప్రతి ట్యాబ్‌కు బైజూస్‌ కంటెంట్‌కు లైసెన్స్‌ కింద రూ.15,500లు ఇచ్చారు. ఇది రూ. 5వేల కంటే మించే అవకాశం లేదు. 8వ తరగతి విద్యార్థికి ఇచ్చిన కంటెంట్‌ వచ్చే ఏడాదికి ఉపయోగపడే అవకాశం లేదు. బైజూస్‌ మూతపడితే కంటెంట్‌ మొత్తాన్ని మార్చాల్సి ఉంటుంది. ఇప్పటికే ఈ కంపెనీ దివాళా తీసే స్థితిలో ఉంది. మోసాలకు పాల్పడి అప్పులపాలై ఫారెన్‌ ఎక్సె్చంజ్‌ కుంభకోణంలో విచారణను ఎదుర్కొంటున్నది. 20వేల మంది సిబ్బంది కంపెనీలో ఉంటే 12వేల మందిని తొలగించింది. ముగ్గురు డైరెక్టర్లు రాజీనామ చేశారు.
ఈ విషయాలపై సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు సోమవారం విజయవాడలో విలేకరులతో మాట్లాడారు. ఆయన మాటల్లోనే.. ట్యాబుల కొనుగోలు, కంటెంట్‌ కొనుగోలు విషయంలో భారీ కుంభకోణం చోటు చేసుకుంది. దీనిపై లోతైన విచారణ జరిపిందచాల్సిన అవసరం వుంది. ప్రభుత్వ నిధులు ఈ విధంగా దుర్వినియోగం అయ్యాయి. ఈ నిధులు ఎవరి జేబుల్లోకి వెళ్లాయో విచారణ జరిపితే తేలుతుంది. కొనుగోలు ధరలు కళ్లకు కనిపిస్తుంటే ఇంతకంటే ఆధారం ఏమి కావాలి. రూ. 1,250 కోట్ల ప్రజా ధనం దోపిడీకి గురైంది.
Next Story