బాల్యవివాహాలు, బహుభార్యత్యవానికి అసోం ప్రభుత్వం ఎలా చెక్ పెట్టిందంటే..
x

బాల్యవివాహాలు, బహుభార్యత్యవానికి అసోం ప్రభుత్వం ఎలా చెక్ పెట్టిందంటే..

బాల్య వివాహాలు, బహుభార్యత్వానికి స్వస్తి పలికేందుకు అసోం రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సీఎం నిర్ణయానికి క్యాబినెట్ ఆమోద ముద్ర కూడా వేసింది.


అసోం రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ‘అసోం ముస్లిం వివాహ, విడాకుల నమోదు చట్టం-1935’ని ప్రభుత్వం రద్దు చేసింది. వాస్తవానికి అమ్మాయికి 18 అబ్బాయికి 21 ఏళ్లు వయసు దాటాక వివాహం చేయాలి. కాని అస్సాంలో బాల్య వివాహాలు పెరిగిపోయాయి. అలాగే బహుభార్యత్వం కూడా. ఈ రెంటికి స్వస్తి పలకాలని ముఖ్యమంత్రి హిమంత బిస్వ శర్మ నిర్ణయం తీసుకున్నారు. ఇందుకు అసోం క్యాబినెట్ శుక్రవారం ఆమోదం తెలిపింది.

ముస్లిం రిజిస్ట్రార్లకు ఇక సెలవు..

ఈ చట్టం కింద ఇప్పటికే పనిచేస్తున్న 94 మంది ముస్లిం రిజిస్ట్రార్‌లను ఒక్కొక్కరికి రూ.2 లక్షల చొప్పున పరిహారంతో విధుల నుంచి తొలగిస్తున్నట్లు కేబినెట్ మంత్రి ప్రకటించారు. ఇకపై ముస్లింల వివాహాలు, విడాకుల నమోదును జిల్లా కమిషనర్, జిల్లా రిజిస్ట్రార్ చేపడతారని మంత్రి వివరించారు. ముస్లిం వివాహ చట్టం రద్దుతో ప్రత్యేక వివాహ చట్టం పరిధిలోకి రానున్నాయి.

కేసులు.. అరెస్టులు..

అసోం రాష్ట్ర ప్రభుత్వం గత ఏడాది నుంచే బాల్యవివాహాలపై కన్నేసి ఉంచింది. పేద కుటుంబానికి చెందిన ఆడపిల్లలను వృద్ధులు పెళ్లి చేసుకున్నారు. ఇలా పెళ్లి చేసుకున్న వారిపై గతేడాది ఫిబ్రవరిలో మొదటి దశలో 3,483 మందిని అరెస్టు చేయగా, ఫిబ్రవరిలో 4,515 కేసులు నమోదయ్యాయి. గత అక్టోబర్‌లో రెండో దశలో 915 మందిని అరెస్టు చేసి 710 కేసులు నమోదు చేశారు.

Read More
Next Story