ఐపీఎల్‌కు ముందు యువతకు సజ్జనార్ స్ట్రాంగ్ వార్నింగ్ !
x

ఐపీఎల్‌కు ముందు యువతకు సజ్జనార్ స్ట్రాంగ్ వార్నింగ్ !


ఐపీఎల్ జాతర షురూ కావడానికి ముందు హైదరాబాద్ సీపీ సజ్జనార్.. యువతకు కీలక హెచ్చరికలు చేశారు. ఆటను ఎంజాయ్ చేయండి కానీ, బెట్టింగ్ ఊబిలో పడొద్దని హెచ్చరించారు. ఈజీ మనీ కోసం బెట్టింగ్ ఊబిలో పడి బతుకులను ఛిద్రం చేసుకోవద్దని అన్నారు. ఈమేరకు ఆయన ఎక్స్ వేదికగా ఆయన పోస్ట్ పెట్టారు. ‘‘ఐపీఎల్ సీజన్ మొదలవుతున్న తరుణంలో క్రికెట్‌ను కేవలం క్రీడగా ఆస్వాదించాలని, బెట్టింగ్ ఊబిలో పడి జీవితాలను నాశనం చేసుకోవద్దని విజ్ఞప్తి చేస్తున్నాం’’ అని ఆయన తన పోస్ట్‌లో పేర్కొన్నారు.

‘‘గతంలో #SayNoToBettingApps ప్రచారం ద్వారా వందలాది యాప్‌లను ప్రభుత్వం నిషేధించినప్పటికీ, ఇప్పుడు టెలిగ్రామ్, వాట్సాప్, ఇన్‌స్టాగ్రామ్ వంటి సోషల్ మీడియా వేదికగా ఈ దందా కొత్త రూపం దాల్చింది. కేవలం డబ్బు కోసం ఇటువంటి ప్రమాదకరమైన యాప్‌లను ప్రమోట్ చేసే సోషల్ మీడియా ఇన్ఫ్లూయెన్సర్లపై కఠిన చర్యలు తీసుకుంటాం. ఆన్‌లైన్ మాత్రమే కాకుండా ఫామ్ హౌస్‌లు, రహస్య ప్రాంతాల్లో సాగే ఆఫ్‌లైన్ బెట్టింగ్‌లపై మా ప్రత్యేక నిఘా ఉంది. బెట్టింగ్ వల్ల అప్పులపాలై కుటుంబాలు రోడ్డున పడే పరిస్థితి తెచ్చుకోవద్దు. మీ పరిసరాల్లో ఎవరైనా బెట్టింగ్‌కు పాల్పడుతున్నట్లు తెలిస్తే వెంటనే డయల్ 100 లేదా మా వాట్సాప్ నంబర్ 94906 16555 కు సమాచారం ఇవ్వండి’’ అని సజ్జనార్ కోరారు.

Read More
Next Story