ధాయ్ లాండ్  ఫుకేత్ రన్ వే మీద హైదరాబాద్ విమానానికి ప్రమాదం
x

ధాయ్ లాండ్ ఫుకేత్ రన్ వే మీద హైదరాబాద్ విమానానికి ప్రమాదం

విమానం నోస్ రెండు చక్రాలు ఊడిపోయాయి. వివరాలు-


138 మందితో ప్రయాణికులతో హైదరాబాద్ నుంచి ధాయ్ లాండ్ ఫుకేత్ వెళ్లిన ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ బోయింగ్ 737 మ్యాక్స్ విమానం బుధవారం ఫుకేత్ లో హార్డ్ ల్యాండింగ్ చేసింది. హైదరాబాద్ నుండి బయలుదేరిన విమానం లాండింగ్ అవుతున్నపుడు ఒక సారి హార్డ్ ట్యాపింగ్ చేసింది. తర్వాత ఒకసారి బౌన్స్ అయింది. , ఆపైన రన్‌వే ను రెండవసారి గుద్దినపుడు విమానం నోస్ వీల్స్ రెండు విడిపోయాయి. దీనితో విమానం రన్‌వేపై ఇరుక్కుపోయింది. అయితే ప్రయాణికులెవరూ గాయపడలేదు. ప్రమాదం తర్వాత రన్ వేను మూసేశారు. ఇక్కడ ఉన్న ది ఒకే ఒక రన్ వే కాబట్టి అనేక విమానాలను ఇతర విమానాశ్రయాలకు మళ్లించారు. ఎయిర్‌స్ట్రిప్ మళ్లీ అందుబాటులోకి వచ్చే వరకు విమానాశ్రయాన్ని మూసివేసారు.


ఫ్లైట్ ట్రాకింగ్ సైట్ Flightradar24 బుధవారం సాయంత్రం ఐఎస్ టి 5 గంటలప్పటి సమాచారం ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానం IX938 హార్డ్ ల్యాండింగ్ తర్వాత ముక్కు చక్రం తీవ్రంగా దెబ్బతిన్నది. ఫలితంగా దాదాపు ఏడు గంటల దాకా ఫుకెత్ ఇంటర్నేషనల్ ఏకైక రన్‌వే మూసివేశారు.

ఇప్పటివరకు, 20 విమానాలను ఇతర విమానాశ్రయాలకు మళ్లించారని తెలిసింది. AI ఎక్స్‌ప్రెస్ ఈ ఉదయం ఒక ప్రకటనలో ఈ సంఘటనకు క్షమాపణలు చెప్పింది. “ఫుకేత్ విమానాశ్రయంలో ప్రమాదానికి గురైన విమానంలో ముక్కు చక్రాలను బిగించగం పూర్తయింది. దీనితో విమానాశ్రయ కార్యకలాపాలు తిరిగి ప్రారంభమయ్యాయి. ఈ సంఘటనకు మేము క్షమాపణలు కోరుతున్నాము, దీనిపై చట్ట ప్రకారం దర్యాప్తు చేయబడుతుంది,” అని ప్రకటనలో పేర్కొంది.

Read More
Next Story