ఆర్ఆర్ఆర్‌పై కీలక అప్‌డేట్.. ప్రపంచస్థాయిలో నిర్మాణం!
x

ఆర్ఆర్ఆర్‌పై కీలక అప్‌డేట్.. ప్రపంచస్థాయిలో నిర్మాణం!

హైదరాబాద్ చుట్టూ రీజినల్ రింగ్ రోడ్ నిర్మాణం వేగం పెరిగి, ప్రపంచ కంపెనీల దృష్టిని ఆకర్షిస్తోంది.


హైదరాబాద్ చుట్టు నిర్మించే రీజినల్ రింగ్ రోడ్డు అంతర్జాతీయ ప్రమాణాలతో ఉండనుందని తెలంగాణ రోడ్లు, భవనాల శాఖ మంత్ర కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి వెల్లడించారు. ఈ ఆర్ఆర్ఆర్ నిర్మాణంతో అభివృద్ధిలో కీలక మలుపుగా మారనుందని అన్నారు. ఈ ప్రాజెక్ట్‌లో కీలక అప్‌డేట్‌లు చేశామని, ఈ తాజా ప్రణాళికలతో ఈ ప్రాజెక్టు వేగం పెరిగిందని చెప్పారు. ప్రస్తుతం ఉన్న నెహ్రూ రింగ్ రోడ్డుకు 30 కిలోమీటర్ల వెలుపల రీజినల్ రింగ్ రోడ్ నిర్మాణం చేపడుతున్నట్లు వెల్లడించారు. ఈ రింగ్ రోడ్‌కు అనుబంధంగా రేడియల్ రోడ్లు కూడా ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఈ రహదారులతో పాటు రైలు మార్గాన్ని కూడా అభివృద్ధి చేస్తూ, రవాణా వ్యవస్థను ప్రపంచ స్థాయికి తీసుకెళ్లేలా ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు చెప్పారు. నగర ట్రాఫిక్ సమస్యలను తగ్గించేందుకు ఈ చర్యలు కీలకంగా మారనున్నాయి.

ఇక హైదరాబాద్ నుంచి ఎల్బీనగర్ వరకు డబుల్ డెక్కర్ రోడ్ నిర్మాణం చేపడుతున్నట్లు వివరించారు. కింది స్థాయి రహదారి స్థానిక రవాణాకు, పై అంతస్థులు నగరానికి వచ్చే, వెళ్లే వాహనాలకు వినియోగించనున్నట్లు తెలిపారు. నాగపూర్ తరహాలో ఈ డబుల్ డెక్కర్ రహదారులు నిర్మించబడుతున్నాయని పేర్కొన్నారు. రెండు నెలల్లో టెండర్ ప్రక్రియ పూర్తి చేసి పనులు ప్రారంభించనున్నట్లు చెప్పారు. ఈ అభివృద్ధి చర్యలతో హైదరాబాద్ నగరం మౌలిక వసతుల పరంగా మరింత బలోపేతం అవుతోంది. ట్రాఫిక్, కాలుష్య సమస్యలు అధికంగా ఉన్న ఇతర నగరాలతో పోలిస్తే హైదరాబాద్ మెరుగైన ప్రత్యామ్నాయంగా మారుతోంది.

ఇక ఐటి, పరిశ్రమల మంత్రి శ్రీధర్ బాబు హైదరాబాద్‌ను ప్రపంచ కంపెనీలకు కేంద్రంగా మారుస్తున్నట్లు వెల్లడించారు. అంతర్జాతీయ స్థాయి మౌలిక సదుపాయాలు, టేలెంట్ పూల్ కంపెనీలను ఆకర్షిస్తున్నాయని చెప్పారు. మొత్తంగా, రీజినల్ రింగ్ రోడ్‌తో పాటు అభివృద్ధి చెందుతున్న మౌలిక వసతులు హైదరాబాద్‌ను భవిష్యత్తులో అంతర్జాతీయ పెట్టుబడుల కేంద్రంగా నిలబెట్టే దిశగా సాగుతున్నాయి.

Read More
Next Story