యూత్ ప్రపంచకప్ లో అదరగొట్టిన హైదరాబాద్ పిల్లోడు అరోన్ జార్జ్
x
Hyderabad Aaron George excelled in youth World Cup

యూత్ ప్రపంచకప్ లో అదరగొట్టిన హైదరాబాద్ పిల్లోడు అరోన్ జార్జ్

అండర్-19 జట్టులో ఆడిన (Aaron George)జార్జ్ ఓపెనర్ గా అదరగొట్టాడు


అండర్-19 యూత్ ప్రపంచకప్ లో వైభవ్ సూర్యవంశీతో పాటు అదరగొట్టిన మరో ఆటగాడు అరోన్ జార్జ్. అరోన్ జార్జ్ కేరళకు చెందిన కుర్రాడే అయినా హైదరాబాదులోనే స్ధిరపడ్డాడు. (Hyderabad)హైదరాబాద్ తరపునే క్రికెట్ పోటీల్లో పాల్గొంటున్నాడు. (Under 19 world cup)అండర్-19 జట్టులో ఆడిన (Aaron George)జార్జ్ ఓపెనర్ గా అదరగొట్టాడు. ఈ టోర్నీలో రెండు సెంచిరీలు చేసి అందరి దృష్టినీ ఆకట్టుకున్నాడు. ఆఫ్ఘనిస్ధాన్ తో సెమీఫైనల్లో 311 పరుగులు చేదించాల్సిన సమయంలో జార్జ్ 115 చేసి జట్టుకు మంచి ఆరంభాన్ని అందించాడు.

అలాగే అంతకుముందు లీగ్ దశలో దక్షిణాఫ్రికాపైన మ్యాచ్ లో 118 కొట్టి శభాష్ అనిపించుకున్నాడు. అండర్-19 ప్రపంచకప్ లో సెంచిరీ చేసిన తొలి హైదరాబాదీగా అరోన్ రికార్డు సృష్టించాడు. గతంలో అంబటి రాయుడు, తిలక్ వర్మ కూడా భారత్ తరపున అండర్-19 లో ఆడారు కాని సెంచిరీలు అయితే చేయలేదు. మణికట్టు మాయాజాలంతో డ్రైవ్ లు, కవర్ డ్రైవ్ లు , స్ట్రోక్ ప్లే ఆడగలిగిన జార్జ్ అందరినీ ఆకట్టుకున్నాడు. టీ 20 మ్యాచుల జమానాలో బంతిని బాదటమే క్రికెట్ అనుకుంటున్న సమయంలో సొగసైన బ్యాటింగ్ తో అద్భుతమైన టైమింగ్ తో కళాత్మకంగా ఆడటం అందరినీ ఆకట్టుకున్నది. మొత్తానికి అరోన్ జార్జ్ హైదరాబాదీ కావటం అందరం గర్వించాల్సిన విషయం.

Read More
Next Story