‘విచారణకు తప్పకుండా వస్తా’.. వీడియో రిలీజ్ చేసిన ప్రజ్వల్ రేవన్న
x

‘విచారణకు తప్పకుండా వస్తా’.. వీడియో రిలీజ్ చేసిన ప్రజ్వల్ రేవన్న

‘SIT విచారణకు తప్పకుండా హాజరవుతా. మే 31న బెంగళూరుకు వస్తా’ పరారీలో ఉన్న ప్రజ్వల్ రేవన్న తాజాగా విడుదల చేసిన వీడియోలో చెప్పిన మాటలివి. తీవ్ర లైంగిక వేధింపుల..


‘SIT విచారణకు తప్పకుండా హాజరవుతా. మే 31న బెంగళూరుకు వస్తా’ పరారీలో ఉన్న ప్రజ్వల్ రేవన్న తాజాగా విడుదల చేసిన వీడియోలో చెప్పిన మాటలివి. తీవ్ర లైంగిక వేధింపుల ఆరోపణలు రేకెత్తడంతో ఆయన భారతదేశం నుంచి పరారయిపోయారు. ఆ తర్వాత ఎక్కడికి వెళ్లారు.. ఏంటి అన్నది ఎవరికీ తెలియదు. ఈ విషయంపై దర్యాప్తు సంస్థలు మాత్రం దూకుడు కనబరుస్తున్నాయి. ఎక్కడిక్కడ ఈ వ్యవహారంతో సంబంధం ఉన్నవారిని అదుపులోకి తీసుకుంటుంది. ఇందులో భాగంగానే ఈ కేసు విచారణకు కోసం ప్రత్యేక ఎస్ఐటీ బృందాన్ని కూడా పోలీసులు ఏర్పాటు చేశారు. ఈ కేసు విచారణలో భాగంగానే త్వరలో తమ విచారణకు హాజరుకావాలని ఎస్‌ఐటీ సమన్లు జారీ చేసింది. దాంతో ప్రజ్వల్ రేవన్న ఈరోజు ఓ వీడియోను విడుదల చేశారు.

అందులో తాను తప్పకుండా విచారణకు హాజరవుతానని చెప్పారు. ‘‘తప్పకుండా విచారణకు వస్తారు. సదరు వ్యవహారం దర్యాప్తుకు పూర్తి సహకారం అందిస్తాను. నాకు న్యాయవ్యవస్థపై పూర్తి నమ్మకం ఉంది. ఈ తప్పుడు కేసుల నుంచి కోర్టు ద్వారా నేను బయటపడతానన్న విశ్వాసం ఉంది. దేవుడు, కుటుంబీకులు, ప్రజల ఆశీర్వాదాలు నాకెప్పుడూ ఉంటాయి’’అని వ్యాఖ్యానించారు. దీంతో ఈ నెల 31న ఆయన బెంగళూరుకు చేరుకుంటారని, పోలీసుల దర్యాప్తుకు హారవుతారని తేటతెల్లం అయింది. ఈ క్రమంలోనే అసలు ఈ వ్యవహారంలో ఎవరు మాస్టర్‌మైండ్ అని, పోలీసులకు ప్రజ్వల్ ఏం చెప్తారు? విడుదలైన వీడియోల గురించి ఎలాంటి వివరణ ఇస్తారు? అన్నది హాట్ టాపిక్‌గా మారింది.

డిప్రెషన్‌లోకి వెళ్లా

ఇటువంటి స్కాండల్ వ్యవహారంలో తన పేరు రావడంతో తీవ్ర డిప్రెషన్‌కు గురయ్యానని, అలాంటి దిక్కుతోచని పరిస్థితుల్లోనే అజ్ఞాతంలోకి వెళ్లానంటూ ప్రజ్వల్ తన వీడియోలో వివరించారు. తన రాజకీయ జీవితాన్ని అంతం చేయడానికి హస్సన్ నియోజకవర్గంలోని కొన్ని శక్తులు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నాయని, ఈ కుంభకోణం వ్యవహారం బయటకు రావడానికి, అందులో నా పేరు ఉండటానికి, ఇదంతా దేశవ్యాప్తంగా సంచలనం రేకెత్తించడానికి ఆ శక్తులే కారణమని ఆయన ఆరోపించారు. అనంతరం ప్రజ్వల్ తాను విడుదల చేసిన వీడియోతో తన తండ్రి హెచ్‌డీ కుమారస్వామి, తాతయ్య దేవేగౌడనను క్షమాపణలు కోరారు. వారితో పాటుగా కర్ణాటక ప్రజలు, పార్టీ కార్యకర్తలను కూడా క్షమాపణలు కోరారు. కానీ తాను ఎక్కడ ఉంది మాత్రం ప్రజ్వల్ చెప్పలేదు.

నెల రోజుల తర్వాత ఎందుకు!

ప్రజ్వల్ రేవన్న.. పలువురు మహిళలపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్న వీడియోలో బహిర్గతమై నెల రోజులు పూర్తయ్యాయి. ఇప్పుడు తాను విచారణకు వస్తానని ప్రజ్వల్ వీడియో విడుదల చేశారు. ఈ వీడియోను కూడా ఆయన ఎక్కడి నుంచి విడుదల చేశారన్నది ఎవరికీ తెలియదు. దీంతో ప్రజ్వల్ వీడియో వెనక ఏదో ప్లాన్ ఉందని, ఎవరో ఉన్నారన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఆ వీడియో వెనక కూడా స్కాండల్ వెనక ఉన్న మాస్టర్ మైండే ఉన్నారని ప్రచారం కూడా జరుగుతుంది. వాళ్లు చెప్తేనే నెల రోజుల తర్వాత ప్రజ్వల్ వీడియోను విడుదల చేశారని వారు అనుమానాలు వ్యక్తం చేశారు.

అయితే ప్రజ్వల్ రేవల్ల డిప్లొమాటిక్ పాస్‌పోర్ట్ జూన్ 4తో ముగియనున్న నేపథ్యంలోనే ఆయన ఈ వీడియోను విడుదల చేశారని, పాస్‌పోర్ట్ టైమ్ అయ్యాక కూడా ఇతర దేశాల్లో ఉంటే అతడిని జైల్లో వేయడం, ఆయన లొకేషన్ రివీల్ అవ్వడం ఒకేసారి జరుగుతాయని, అందుకే వచ్చి లొంగిపోవడానికి సిద్ధమయ్యాడని పలువురు నిపుణులు చెప్తున్నారు.

అసలు ప్రజ్వల్ ఏమన్నారు

ప్రజ్వల్ రేవన్న విడుదల చేసిన వీడియోలో.. ‘‘మా నాన్న, తాత, ప్రజలు, పార్టీ కార్యకర్తలకు నా క్షమాపణలు, విదేశాల్లో నేను ఎలా ఉన్నాను అనేది చెప్పడానికి ఈ వీడియో విడుదల చేస్తున్నారు. ఏప్రిల్ 26న ఎన్నికల సమయంలో నాపై ఎటువంటి ఫిర్యాదు నమోదు కాలేదు. ఎస్‌ఐటీ కూడా ఏర్పాటు కాలేదు. ఏప్రిల్ 26న విదేశాలకు వెళ్లాలని ముందే నిర్ణయించుకున్నాం. అందుకే విదేశాలకు వెళ్లాను. విదేశాలకు వెళ్లిన మూడు నాలుగు రోజుల తర్వాత యూట్యూబ్‌లో చూసి ఈ కేసు గురించి తెలుసుకున్నాను. ఎస్‌ఐటీ కూడా నోటీసులు ఇచ్చింది. ఆ తర్వాత నా లాయర్ ద్వారా ఏడు రోజుల సమయం కోరాను. ఆ తర్వాత ఇదే అంశంపై కాంగ్రెస్ నేతలు రాహుల్ గాంధీ సహా పలువురు బహిరంగంగానే చర్చించుకుంటున్నారు. వాళ్లంతా నాకు వ్యతిరేకంగా కుట్ర చేశారు’’ అని ఆరోపించారు.

‘‘ఇవన్నీ చూసిన తర్వాత నేను డిప్రెషన్‌లోకి వెళ్లిపోయాను. అందుకే నేను క్షమాపణలు కోరుతున్నా. నాకు వ్యతిరేకంగా కొన్ని శక్తులు పనిచేస్తున్నాయి. రాజకీయంగా నేను ఎదుగుతున్న క్రమంలో నన్ను తొక్కేయడానికి ఈ శక్తులన్నీ ప్రయత్నిస్తున్నాయి. దాంతో నేను షాకయ్యాను. అందుకే దీనికి దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నాను. ఎవరు దీనికి గురించి తప్పుగా అనుకోవద్దు. నేనే ఎస్ఐటీ ముందు హాజరవుతాను. మే 31వ తేదీ ఉదయం 10 గంటలకు విచారణకు వస్తాను. వీటన్నింటి నుంచి బయటకు వస్తానను భావిస్తున్నా’’ అని చెప్పారు.

ప్రజ్వల్‌కు బ్లూ కార్నర్ నోటీసులు

ప్రజ్వల్ ఎక్కడ ఉన్నారు? ఏం చేస్తున్నారు? వంటి సమాచారం కోసం ఇంటర్‌పోల్ అధికారులు బ్లూ కార్నర్ నోటీసులు విడుదల చేశారు. అంతేకాకుండా ఎంపీ, ఎమ్మెల్యేల కోరటు మే 18న అరెస్ట్ వారెంట్ కూడా విడుదల చేసింది.

Read More
Next Story