FLASH| ఇజ్రేల్ ప్రధాని నెతన్యాహు అరెస్టుకు వారంట్
x
ఇజ్రేల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు

FLASH| ఇజ్రేల్ ప్రధాని నెతన్యాహు అరెస్టుకు వారంట్

నెతన్యాహు యుద్ధనేరాలకు సాక్ష్యాలున్నాయని చెబుతున్న ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్టు


పాలస్తీనాలోని గాజా ప్రాంతంలో యుద్ధ నేరాలు చేసి మారణకాండ సృష్టించినందుకు ఇజ్రేల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు (Benjamin Netanyahu) కు ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్టు (ICC) అరెస్టు వారంట్ జారీ చేసింది. నెతన్యాహు తో పాటు ఆ దేశ మాజీ రక్షణ మంత్రి యువావ్ గ్యాలంట్ (Yoav Gallant) అరెస్టుకు కూడా వారంట్ జారీ చేసింది. వీళ్లిద్దరు 2023 అక్టోబర్ 8- 2024 మే 20 మధ్య అనేక యుద్ధ నేరాలకు పాల్పడినా ఐసిసి భావించింది.

ప్రధాన మంత్రి నెతన్యాహూ, మాజీ రక్షణ మంత్రి గ్యాలంట్ మీద విచారణ జరిపేందుకు కోర్టుకు పరిధి లేదని ఇజ్రేల్ ప్రభుత్వం చేసిన ఐసిసి తోసిపుచ్చింది. వీళ్లిద్దరు మానవ సమాజానికి వ్యతిరేకంగా యుద్ధం, హింస, కేసులు పెట్టడం వంటి అమానుష కార్యకాలపాలను పాల్పడినట్లు కొర్టు దగ్గిర ఆధారాలున్నాయని, ప్రజలను ఆకలితో్ మాడ్చడాన్ని వీరిద్దరు ఒక యుద్ధ వ్యూహంగా మార్చారని కోర్టు అభిప్రాయపడింది. ఉద్దేశపూర్వకంగా నెతన్యాహు, గ్యాలంట్ లు పౌరుల మీదికి దాడులను ఊసికొల్పి యుద్ధనేరాలకు పాల్పడినందుకు బాధ్యత వహించాల్సిందేనని కోర్టు పేర్కొంది.

అయితే, ఇజ్రేల్ ప్రధాని కార్యాలయం ఈ వారంట్ ను ఖండించింది. ఇజ్రేల్ అందించిన సాక్ష్యాలను ఐసిసి ఖాతరు చేయడం లేదని, ఐసిసి యూదు రాజ్యానికి వ్యతిరేకంగా సాగుతున్న తీవ్రవాద చర్యలను సమర్థిస్తున్నదని ఆదేశ ప్రధాని కార్యాలయం పేర్కొంది. ప్రపంచదేశాలలో ఇజ్రేల్ ను ఏకాకిని చేసిన టెర్రరిస్టు దాడలు జరిగేలా ఐసిసి చేస్తున్నదని ప్రధాని నెతన్యాహు సలహాదారు డిమిట్రి జెండిల్ మన్ పేర్కొన్నారు.

Read More
Next Story