ఇజ్రాయెల్ కు నిరుద్యోగులు వెళ్లడం బీజేపీ అసమర్థతే: కాంగ్రెస్
x

ఇజ్రాయెల్ కు నిరుద్యోగులు వెళ్లడం బీజేపీ అసమర్థతే: కాంగ్రెస్

ఇజ్రాయెల్ కు ఉత్తరప్రదేశ్, హర్యానా నుంచి వేలాదీగా నిరుద్యోగ యువకులు వెళ్లడంపై కాంగ్రెస్ పార్టీ ఆగ్రహం వ్యక్తం చేసింది.


దేశంలో నిరుద్యోగం ఏవిధంగా తాండవిస్తోందో యూపీ, హర్యానా నుంచి ఇజ్రాయెల్ కు వెళ్తున్న యువకుల క్యూలను చూస్తే తెలుస్తుందని బీజేపీ పై కాంగ్రెస్ పార్టీ విమర్శలు గుప్పించింది. భారత దేశం వేగంగా అభివృద్ది చెందుతున్న ఆర్థిక వ్యవస్థగా ప్రభుత్వం గొప్పలు చెప్పుకుంటోందని, కానీ ఇది దేశంలోని భయంకర నిరుద్యోగ పరిస్థితిని ప్రతిబింబిస్తోందని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరాం రమేష్ విమర్శించారు. ఈ మేరకు ఆయన సామాజిక మాధ్యమం ఎక్స్ లో పోస్ట్ చేశారు.

"నిన్న అంతర్జాతీయ న్యాయస్థానం ఇజ్రాయెల్ పై ఇచ్చిన మధ్యంతర తీర్పును పక్కన పెడదాం. అందులో నైతిక, అనైతిక విషయాలు చర్చ కూడా ఇక్కడ అవసరం లేదు. ఇదీ మాత్రం మన దేశంలో ఉన్న నిరుద్యోగ పరిస్థితి తెలియజేస్తోంది. ఇదేనా దేశంలో జరుగుతున్న అభివృద్ధి. ఉద్యోగాలను సృష్టించే శక్తి మన ఆర్థిక వ్యవస్థ లేదా ఇదీ మనలను అపహస్యం చేసినట్లు కాదా? " అని ఎక్స్ లో ప్రశ్నించారు.

ఇజ్రాయెల్- హమాస్ యుద్దం ఇప్పటికీ ముగియలేదు. అక్టోబర్ 7న ఇజ్రాయెల్ లో జరిగిన మారణహోమంలో తమ దేశంలోకి రోజు వచ్చి పనిచేసిన పాలస్తీనా కార్మికులు ఇచ్చిన సమాచారం కూడా ఒకభాగమేనని ఆ దేశం భావించింది. ఇక నుంచి తమ దేశంలోని పాలస్తీనా నుంచి ఒక్కరూ కూడా అడుగుపెట్టడానికి వీలులేదని తీర్మానించుకుంది.

నమ్మకం, యువశక్తి అధికంగా ఉన్న దేశాల నుంచి కార్మికులను తీసుకుని నిర్మాణ, రోజువారీ పనులలో వాడుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది. వీరికి నెలకు భారత కరెన్సీలో రూ. 1,37,000 వరకూ గరిష్టంగా వేతనం తీసుకునే అవకాశం ఉండడంతో భారత దేశంలోని యువత ఇజ్రాయెల్ వెళ్లడానికి బారులుతీరుతున్నారు.

అంతేకాకుండా విదేశాల నుంచి తమ దేశానికి వచ్చే కార్మికులకు కూడా పూర్తి భద్రత కల్పిస్తామని ఆ దేశం హమీ ఇచ్చింది. దాదాపు లక్ష యాభై వేల నుంచి ఐదు లక్షల వరకూ ఇజ్రాయెల్ లో వివిధ రంగాలలో పనిచేయడానికి కార్మికులు అవసరమవుతారని ఓ అంచనా. దీనిని భారత యువత ఒడిసిపట్టుకోవాలని ఆరాటపడుతోంది. అలాగే తైవాన్ కు కూడా భారత్ నుంచి వేలాదీగా కార్మికులు కావాలని కోరింది. తమ దేశంలో వృద్దులను చూసుకోవడానికి, అలాగే నిర్మాణ రంగాలలో అవసరమైన కార్మిక శక్తి లేకపోవడంతో ఇక్కడి యువతను భర్తీ చేసుకోవాలని తైపీ ఆరాటపడుతోంది.

Read More
Next Story