తాగునీటిని వృథా చేస్తే రూ. 5వేలు ఫైన్
x

తాగునీటిని వృథా చేస్తే రూ. 5వేలు ఫైన్

వాహనాలను శుభ్రం చేయడానికి, తోటపనికి లేదా ఇతర వినోద కార్యక్రమాలకు తాగునీటిని వినియోగించవద్దని బెంగళూరు నీటి సరఫరా బోర్డు కోరింది.


కర్ణాటకలోని బెంగళూరులో తీవ్ర నీటి ఎద్దడి నెలకొంది. తాగునీటి కోసం జనం నానా ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో బెంగళూరు నీటి సరఫరా బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. వాహనాలను శుభ్రం చేయడానికి, తోటపనికి లేదా ఇతర వినోద కార్యక్రమాలకు తాగునీటిని వినియోగించవద్దని కోరింది. మంచినీళ్లను పొదుపుగా వాడుకోవాలని సూచించింది.

14 మిలియన్ల జనాభా ఉన్న బెంగళూరులోని సినిమా హాళ్లు, మాల్స్‌లో నీటి వృథాను అరికట్టాలని సూచించింది. తాగడానికి మాత్రమే నీటిని వినియోగించాలని వాటి యజమానులను కోరింది.

‘‘రుతుపవనాలు సకాలంలో రాకపోవడం, భూగర్భజలాలు అడుగంటిపోవడంతో తాగునీటి సమస్య ఏర్పడింది. ప్రజల తాగునీటి అవసరాలను తీర్చడం చాలా ముఖ్యం. నీళ్లను పొదుపుగా వాడండి’’ అని బెంగళూరు నీటి సరఫరా బోర్డు ఒక ప్రకటనలో నగర వాసులను కోరింది.

తమ ఆదేశాన్ని ఉల్లంఘించిన వారికి రూ. 5వేలు జరిమానా విధిస్తామని బోర్డు హెచ్చరించింది.

Read More
Next Story