కాంగ్రెస్ ను నమ్మితే ఏం చేస్తుందో తెలుసు కదా.. ప్రధాని మోదీ
x

కాంగ్రెస్ ను నమ్మితే ఏం చేస్తుందో తెలుసు కదా.. ప్రధాని మోదీ

తమిళనాడు మత్స్యకారుల గురించి పట్టించుకోకుండా అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ కచ్చదీవులను శ్రీలంకకు ఏకపక్షంగా అప్పగించారని ప్రధాని మోదీ ఆగ్రహం వ్యక్తం చేశారు.


కాంగ్రెస్ పార్టీపై ప్రధాని మోదీ మరోసారి విమర్శలు గుప్పించారు. దేశ సార్వభౌమత్వాన్ని పట్టించుకోకుండా ఇష్టానుసారంగా నిర్ణయాలు తీసుకున్నారని ఆరోపించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆదివారం ఒక మీడియా కథనాన్ని ఉటంకిస్తూ, శ్రీలంకకు కచ్చ ద్వీపాన్ని కాంగ్రెస్ "నిస్సంకోచంగా" ఇచ్చిందని ఆగ్రహం వ్యక్తం చేశారు.

"కచ్చదీవిను కాంగ్రెస్ ఎంత నిర్ద్వంద్వంగా వదిలివేసింది. ఇది ప్రతి భారతీయుడికి కోపం తెప్పించింది. మేము కాంగ్రెస్‌ను ఎప్పటికీ విశ్వసించలేము," అని ప్రధాని సామాజిక మాధ్యమం X లో అన్నారు. దీనిలో ఒక జాతీయ దినపత్రిక నివేదికను పంచుకున్నారు. "భారతదేశం ఐక్యత, సమగ్రత, ప్రయోజనాలను బలహీనపరచడం 75 సంవత్సరాలుగా కాంగ్రెస్ ప్రధాన పని " అని అన్నారాయన.
RTI ప్రత్యుత్తరాన్ని ఉటంకిస్తూ టైమ్స్ ఆఫ్ ఇండియా ఓ వార్తను ప్రచురించింది. అన్నామలై సమాచార హక్కుచట్టం ద్వారా అడిగిన ప్రశ్నకు సమాధానంగా ‘ఇందిరా గాంధీ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు భారతదేశ తీరానికి 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న 1.9 చదరపు కిలోమీటర్ల భూమిని శ్రీలంకకు విడిచిపెట్టిందని పేర్కొంది’. అలాగే మొదటి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ చేసిన వ్యాఖ్యలను సైతం మీడియా ప్రస్తావించింది. కచ్చదీవులను వదులుకోవడానకి మాకు ఎలాంటి ఇబ్బందిలేదని ఆయన అప్పట్లో పేర్కొన్నట్లు వివరించింది.
భారతీయ మత్స్యకారులను ప్రభావితం చేసింది: బీజేపీ
బిజెపి అధికార ప్రతినిధి సుధాంశు త్రివేది మాట్లాడుతూ, అప్పటి కేంద్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వల్ల తమిళనాడు మత్స్యకారులు అనేక సార్లు జైలుపాలయ్యారని విమర్శించారు. ఇది తమిళనాడు తీరానికి కేవలం 25 కిలోమీటర్ల దూరంలో ఉంది.
"ఈ ద్వీపం 1975 వరకు భారతదేశంలో ఉంది," అని అతను చెప్పాడు. "తమిళనాడు మత్స్యకారులు అంతకుముందు అక్కడికి వెళ్లేవారు, అయితే ఇందిరాగాంధీ ప్రభుత్వంలో లంకతో భారతదేశం సంతకం చేసిన ఒప్పందం వారిని అలా చేయకుండా నిరోధించింది," అన్నారాయన. దురదృష్టవశాత్తు, డిఎంకె, కాంగ్రెస్ ఈ అంశాన్ని లేవనెత్తడం లేదని, అయితే మోదీకి దేశం, ప్రజలకు సంబంధించిన సమస్యలపై నిబద్ధత ఉందని ఆయన అన్నారు. లోక్ సభ ఎన్నికల వేల తమిళనాడులో ఈ అంశం తమకు ఉపయోగపడుతుందని బీజేపీ భావిస్తోంది.
కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీని త్రివేది ప్రశ్నిస్తూ, ఈ అంశంపై ఎందుకు మౌనంగా ఉన్నారని, దీనికి తన పార్టీ మాత్రమే కాకుండా తన కుటుంబం కూడా కారణమని ప్రజలకు చెప్పాలని త్రివేది ప్రశ్నించారు.


Read More
Next Story