నేనెక్కడికీ వెళ్లడం లేదు

ఐఏఎస్‌ అధికారి స్మితా సబర్వాల్‌


నేనెక్కడికీ వెళ్లడం లేదు
x
స్మితా సబర్వాల్‌ ias

ప్రస్తుతం వార్తల్లోని వ్యక్తి ఆమె. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వంలో కీలకంగా ఉన్నారు. రేవంత్‌ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక ఆమె ముఖం చాటేశారు. ఆమె త్వరలో ఢిల్లీ సర్వీసులకు వెళ్లబోతున్నారంటూ వదంతులు వస్తున్న నేపథ్యంలో ఆ సీనియర్ ఐఎఎస్‌ అధికారి క్లారిటీ ఇచ్చారు. ఆమె ఎవరంటే స్మితా సభర్వాల్. కేంద్ర ప్రభుత్వానికి డిప్యుటేషన్‌పై వెళ్తున్నారంటూ వస్తున్న వార్తలను స్మితా సభర్వాల్‌ (Smitha Sabharwal) తోసిపుచ్చారు. ఆ వార్తలు అవాస్తవమని ట్విటర్‌ వేదికగా పేర్కొన్నారు. తెలంగాణ కేడర్‌కు చెందిన ఐఏఎస్‌గానే విధులను నిర్వహిస్తానని స్మితా సభర్వాల్‌ అంటున్నారు. తెలంగాణ ప్రభుత్వం ఏ బాధ్యత ఇచ్చినా చేస్తానని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రయాణంలో భాగమైనందుకు గర్విస్తున్నట్టు చెప్పారు. BRS ప్రభుత్వం అధికారంలో ఉండగా ముఖ్యమంత్రి కార్యాలయంలో స్మితా సభర్వాల్‌ కీలక బాధ్యతలు నిర్వహించారు.


Next Story