మార్చి 16న ’డప్పు‘ రమేష్  సంస్మరణ సభ
x

మార్చి 16న ’డప్పు‘ రమేష్ సంస్మరణ సభ

డప్పు ను ఇంటి పేరు చేసుకున్న కళాకారుడు. డప్పు విప్లవాయుధంగా మార్చిన వాడు డప్పు రమేష్... రెండో వర్ధంతి సభ


-రమణాచారి


ప్రజా కళల్లో అత్యంత ప్రాచుర్యం పొందింన కళారూపం డప్పు.డప్పు సవ్వడి చేయని సందర్భం గ్రామీణజీవితంలో ఉండదు.

- చాటింపు డప్పు

- పెళ్లి డప్పు

- చావు డబ్బు

- గ్రామదేవతల పండుగలో డప్పు

ప్రజా జీవనంలో మమేకమైన డప్పు చావులో, పెళ్ళిలో కనిపించిన ప్రజలందరికీ అందుబాటులో ఉండే కళా వాయిద్యం డప్పు. ఉన్నోడు, లేనోడు తేడా లేకుండా అందరూ వాయించడానికి ఇష్టపడే వాయిద్యమే ఈ డప్పు. అందరూ ఇష్టపడే, జనాలను ఉర్రూతలూగించే కళాబృందాలు కనుమరువు కావడం, ఆదరణ లేకపోవడం, ప్రత్యామ్నాయ రూపాలు అందుబాటులోకి రావడం వల్లనే. ప్రజలందరూ ఇష్టపడే ఇలాంటి కళాకారుల బృందం భవిష్యత్ తరాలకు ఒక చరిత్ర మిగిలిపోయే అవకాశం ఉంది. ఎన్నో విధాలుగా ప్రచుర్యం పొందిన, ప్రధానంగా దళిత కళాకారులకు ఉపాధిని, గుర్తింపును తెచ్చింది డప్పు. జంతు చర్మంతో చేసిన డప్పు ఇప్పుడు ఉనికిలో లేదు ప్లాస్టిక్ డప్పులు వచ్చాయి. కీబోర్డ్ వచ్చాక దాదాపు డప్పు వాయిద్యం అదృశ్యమైపోతుందని చెప్పవచ్చు. ప్రస్తుతం ఈ వాయిద్యాలు ఆదివాసుల దగ్గర, దళితవాడల్లో, గ్రామీణ ప్రాంతాల్లో మాత్రమే మిగిలాయి. ప్రాచీన వాయిద్యమైన డప్పు కళా రూపాన్ని అంతరించి పోకుండా కాపాడుకోవడం కళాకారుల,ప్రజలందరి చారిత్రక బాధ్యత!

మానవ పరిణామ క్రమంలో కళారూపాలు, జీవన క్రియలలో భాగస్వామ్యం అయ్యాయి . ప్రధానంగా గ్రామీణ ప్రాంతంలో డప్పు . జానపద కళారూపాలలోఅత్యంత ప్రాచుర్యం పొందింది డప్పు. గ్రామీణ ప్రాంతాలలో ప్రజాదరణ పొందిన కళారూపం డప్పు ప్రదర్శన.




తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట కాలంలో, విప్లవోద్యమంతో విడదీయారాని బంధం పెనవేసుకుంది డప్పు. పీడిత ప్రజల ప్రజల ప్రచారాయుధంగా పని చేసింది డప్పు. సామాజిక ఉద్యమాల పట్టుగొమ్మ డప్పు. అణగారిన వర్గాల సహచరి డప్పు. అణచివేతను బ్రద్దలు చేసిన శబ్దం డప్పు.

ఇంటి పేరు డప్పుగా మారిన కళాకారులు

డప్పు రమేష్ (జెఎన్ ఎం)

డప్పు ప్రభాకర్(పికెఎం)

డప్పు కరుణాకర్ (వి.ర.సo)

అందె భాస్కర్ ద్వారా(ఉస్తాద్ బిస్మిల్లా ఖాన్ అవార్డు గ్రహీత) అంతరించిపోతున్న కళారూపానికి గుర్తింపుఅవకాశం దొరికింది.

ఇలా డప్పుకు గుర్తింపు తెచ్చిన వారందరో .. వారిలో ఒకరైన డప్పు రమేష్ సంస్మరణ సభ హైదరాబాద్ లో జరుగుతూ ఉంది.

డప్పు రమేష్ మెదటి ఎలియాజర్. పేద దళిత కుటుంబం నుంచి వచ్చాడు. చిన్నప్పటి నుంచి పాటలంటే ఇష్టం. చర్చిలో పాటలు పాడుతూ కాంగో పై ప్రచండ సంగీతం సృష్టించే వాడు. మొదటి సంవత్సరం డిగ్రీ చదువుతున్నపుడు 1980 లో అతనికి విప్లవరాజకీయాలు పరిచమమయ్యాయి. అపుడే జననాట్య మండలి తో సాన్నిహిత్యం మొదలయింది. అలా జననాట్యామండలితోనే పయనించారు. ఈ ప్రయాణంలోనే ఆయన రమేష్ అయాడు. ఆపైన డప్పురమేష్ అయ్యాడు. ఆయన ఆట పాటలతో దక్షిణ కోస్తా దద్దరిల్లింది. నక్సల్బరీ బిడ్దలున, ఒగ్గు కథ, రగల్ జెండా, కారంచేడు ఒగ్గురూపకల్పనలో రమేశ్ ముఖ్యభూమిక పోషించారు.

2004లో అప్పటి ఆంద్రప్రదేశ్ ప్రభుత్వం మావోయిస్టులతో శాంతి చర్చలు జరిపినప్పుడు అజ్ఞాతం నుంచి బయటకు వచ్చాడు. అయినప్పటికీ ఆయన తన కార్యాచరణను కొనసాగించారు. తను నమ్మిన మార్గంలోనే పయనిస్తూ చనిపోయారు. రమేశ్ 61 సంవత్సరంలో 2021,మార్చి 18, శుక్రవారం విజయవాడలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో కార్డియాక్ అరెస్ట్ కారణంగా మరణించారు. ఆయన ద్వితీయ వర్థంతిని మార్చి 16న హైదరాబాద్ సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో నిర్వహిస్తున్నారు.


(రమణాచారి, రచయిత, కవి, విమర్శకుడు, తెలంగాణ)

Read More
Next Story