మన ‘సంతోషం’ పాతాళంలో, ఫ్లిన్లండ్ ఆకాశంలో...
మన సంతోషం ఎక్కడో కిందపడిపోయింది. పై నుంచి చూస్తే ఎంత వెతికినా కనిపించనంత కింద ఉంది. సంతోషంగా దేశాలేవి అని సర్వేలో తేలిన పచ్చినిజం...
ప్రపంచంలోనే అత్యంత ఎక్కువ జనాభా ఉన్నదేశం. అందులో యువతరం పాల్లు 40 శాతం కంటే ఎక్కువ. బిలియన్ డాలర్ల బిజినెస్ లు, ఐదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ. కానీ ఇవన్నీ మనల్నీ సంతోషంగా ఉంచలేకపోతున్నాయి. రేపో మాపో మనం విశ్వ గురు. ఎక్కడో ఏదో మిస్సయింది. భారతదేశంలో ఏ మాత్రం సంతోషం లేదు. చిన్న చిన్న దేశాలు కూడా మనకంటే సంతోషంగా ఉన్నాయి. భారత్ ఖుషీగా లేదని ప్రపంచ హర్ష నివేదిక (World Happiness Index) వెల్లడించింది.
ఏంటీ ఇదంతా అనుకుంటున్నారా? వరల్డ్ హ్యపీయెస్ట్ రిపోర్టుల్లో మన ర్యాంకు ఎంత అనుకుంటున్నారు. 126, మొత్తం 143 దేశాలను సర్వే చేసి రిపోర్టు ఇస్తే మనం ఎక్కడో ఉన్నాం. భారతీయులు అస్సలు సంతోషంగా లేరంట.. ఎందుకో మరీ.. పాకిస్తాన్, నేపాల్, చైనా కూడా మనకంటే సంతోషంగా ఉందంట. పాలస్తీనా కూడా మనకంటే మెరుగ్గా ఉంది. దాని ర్యాంకు 103..
World Happiness Index 2023
— Informal Economy (@EconomyInformal) March 20, 2024
1. Finland🇫🇮
2. Denmark🇩🇰
3. Iceland🇮🇸
4. Israel🇮🇱
5. Netherlands🇳🇱
6. Sweden🇸🇪
7. Norway🇳🇴
8. Switzerland🇨🇭
9. Luxembourg🇱🇺
10. New Zealand🇳🇿
11. Austria🇦🇹
12. Australia🇦🇺
13. Canada🇨🇦
14. Ireland🇮🇪
15. US🇺🇸
16. Germany🇩🇪
19. UK🇬🇧
21. France🇫🇷
31.… pic.twitter.com/mkn7bABwkI