భారత్ పాక్ మ్యాచ్ అగ్గికి తారిఖ్ అజ్యం పోశాడా ?
x
Pakistan spinner Usman Tariq

భారత్ పాక్ మ్యాచ్ అగ్గికి తారిఖ్ అజ్యం పోశాడా ?

బాల్ బాల్ కు రన్ రన్ కు ఆటగాళ్ళకు కాదు ప్రేక్షకులకు, అభిమానుల్లో మంటలు రేగుతుంటాయి


అసలే ఇండియా, పాకిస్తాన్ జనాలకు క్రికెట్ అంటే పిచ్చి. అందులోను ఇండియా-పాక్ మ్యాచ్ అంటే ఇక చెప్పాల్సిన పనేలేదు. బాల్ బాల్ కు రన్ రన్ కు ఆటగాళ్ళకు కాదు ప్రేక్షకులకు, అభిమానుల్లో మంటలు రేగుతుంటాయి. రెండుదేశాల మధ్య మ్యాచ్ అంటేనే సరిహద్దుల్లో జరుగుతున్న యుద్ధాన్ని లైవ్ లో చూస్తున్నట్లుగా ఆవేశం కట్టలు తెంచుకుంటుంది. ఇందుకనే ఇరుదేశాల మధ్య మ్యాచులను రెండుదేశాల ప్రభుత్వాలు రద్దుచేసేశాయి. అయితే అంతర్జాతీయ టోర్నమెంట్లలో మ్యాచులు ఆడక తప్పదు. ఇపుడు జరుగుతున్నది ఇదే. నిజానికి టీ20 ఛాంపియన్ షిప్పులో ముందు భారత్ తో మ్యాచులను ఆడను పొమని చెప్పింది పాకిస్తాన్.

కొంతకాలం తర్వాత అసలు టోర్నమెంటులోనే ఆడను అనిచెప్పింది. అయితే ఆర్ధికఅంశాలు తెరమీదకు రావటంతో మెత్తపడింది. మ్యాచులు ఆడకపోవటం వల్ల జరిగే ఆర్ధికనష్టాన్ని పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ఇంటర్నేషనల్ క్రికెట్ కమిటీకి చెల్లించాల్సిందే అని గట్టిగా ఒత్తిడి పెరిగేసరికి మెత్తపడిన పాకిస్తాన్ టోర్నమెంటుతో పాటు ఇండియాతో కూడా మ్యాచ్ ఆడటానికి అంగీకరించింది. సరిగ్గా ఇక్కడే సమస్య మొదలైంది.

అదేమిటంటే పాకిస్తాన్ స్పిన్నర్ ఉస్మాన్ తారిఖ్ బౌలింగ్ యాక్షన్. తారిక్ బౌలింగ్ యాక్షన్ గురించే ఇపుడు దేశమంతా చర్చించుకుంటోంది. తారిఖ్ బౌలింగ్ లో బంతిని విడుదల చేసేముందు కొన్ని సెకన్లు ఆపి తర్వాత రిలీజ్ చేస్తాడు. బౌలింగ్ పై భారత్ నుండి ఎలాంటి అభ్యంతరాలు రాకపోయినా ఇతర దేశాల నుండి అభ్యంతరాలు పెరిగిపోయాయి. తారిక్ బౌలింగ్ యాక్షన్ ను రివ్యు చేసిన ఐసీసీ కమిటి తన బౌలింగులో ఎలాంటి పొరబాట్లు లేవని తేల్చేసింది.

దాంతో తారిఖ్ బౌలింగ్ పైన ఇపుడు దేశంలో పెద్ద దుమారమే రేగుతోంది. ఎందుకంటే తన బౌలింగును ఎలా ఎదుర్కోవాలనే విషయంలో. రిటైర్డ్ ఆటగాళ్ళు, కోచ్ లు, అభిమానులు చెప్పేది ఏమిటంటే తారిక్ బౌలింగుకు దిగినపుడు బ్యాట్స్ మెన్ కాస్త నిదానంగా ఆడాలని. మరికొందరు చెబుతున్నది ఏమిటంటే బౌలర్ బాల్ ను రిలీజ్ చేసేటపుడు ఆగగానే బ్యాట్స్ మెన్ కూడా స్టంప్స్ నుండి పక్కకు జరగాలని. దానివల్ల ఏమవుతుందంటే తారిఖ్ వేసే బాల్ డెడ్ బాల్ అవుతుంది. అలా ఎన్నిసార్లు చేయాలనే విషయంలో ఎలాంటి నిబంధనలు లేవు. కాబట్టి తారిఖ్ కు విసుగుపుట్టేంతవరకు చేయచ్చు. కాని అలాచేస్తే బ్యాట్స్ మెన్ పై ఐసీసీ యాక్షన్ తీసుకునే అవకాశాలున్నాయి.

మొత్తంమీద తారిఖ్ బౌలింగును జాగ్రత్తగా గమనించాలి, అలాంటి బౌలింగ్ యాక్షన్ తో ఇప్పటికే మన బ్యాట్స్ మెన్ నెట్ ప్రాక్టీస్ కూడా చేశారు. తారిక్ బౌలింగును ఇప్పటికే మన బ్యాట్స్ మెన్, కోచులు వీడియోలో చూసే ఉంటారనటంలో సందేహంలేదు. కాబట్టి అతని బౌలింగును ఏ విధంగా ఆడాలి, అతని బౌలింగును ఏ విధంగా ఎదుర్కోవాలనే విషయాలను జాగ్రత్తగానే అధ్యయనం చేసుంటారనటంలో సందేహంలేదు. ఇండియా-పాక్ మ్యాచ్ అంటేనే మంటలు రేగుతుంటాయి. అలాంటి మంటలకు ఉస్మాన్ తారిఖ్ అనే బౌలర్ కొత్తగా ఆజ్యం పోసాడు అనటంలో ఎలాంటి సందేహంలేదు. చివరకు ఏమవుతుందో చూడాల్సిందే.

Read More
Next Story