ఇండియాలో ఇంగ్లీష్ మాట్లాడేవాళ్లెందరన్నారు?
ఇంగ్లీష్ మాట్లాడే నాన్ నేటీవ్ స్పీకింగ్ దేశాల్లో నెదర్లాండ్ మొదటి స్థానంలో నిలవగా, స్వీడన్ తరువాత స్థానాన్ని ఆక్రమించింది. ఈ జాబితాలో భారత్ మాత్రం..
ప్రపంచంలో అత్యధిక యువ జనాభా ఉన్న దేశం భారత్. వేగంగా గ్రోత్ రేట్ సాధిస్తూ ఆర్థిక శక్తిగా మారుతోంది. ఈ ఆర్థిక శక్తికి కారణం మన మేధస్సు. ప్రపంచంలో జరుగుతున్న మార్పులను ముందుగానే పసిగట్టిన మనదేశ మేధావులు విద్యా వ్యవస్థను పటిష్టం చేసే పనిని దశాబ్దాల కిందే మొదలు పెట్టారు. వాటి ప్రతిఫలాలు ఇప్పుడు మనం అనుభవిస్తున్నాం. ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన టెక్ కంపెనీల్లో భారతీయులే సీఈఓలై నడిపిస్తున్నారంటే కారణం మన విద్యా వ్యవస్థే అని చెప్పడంలో సంశయం లేదు.
మనదేశాన్ని బ్రిటిష్ వారు 200 సంవత్సరాలు పరిపాలించిన సమయంలో నూతన విద్యావిధానాలను ప్రవేశ పెట్టారు. ఇందులో భాగంగా ఇంగ్లీష్ ను తప్పనిసరిగా చేశారు. తరువాత కాలంలో బ్రిటిష్ ప్రభుత్వంలో ఉద్యోగాలు చేయాలంటే ఆంగ్ల బాష ప్రావీణ్యం తప్పనిసరిగా అని తల్లిదండ్రులు కూడా తమ పిల్లలను ఆంగ్లం నేర్పించడానికి ప్రాధాన్యం ఇచ్చారు.
ఇంగ్లీష్ మాట్లాడటం అప్పటి తరం నుంచి నేటీ తరం వరకూ కూడా గౌరవ సూచకంగా భావిస్తారు. ఇంగ్లీష్ వస్తే చాలు ఎక్కడో ఒక చోట ఉన్నత ఉద్యోగం చేసుకుని బతకవచ్చనే అనే భావన తల్లిదండ్రులు, సమాజంలో స్థిరపడిపోయింది. అందుకోసం తమ పిల్లలను ప్రభుత్వ బడులను మాన్పించి ప్రయివేట్ పాఠశాలలకు పంపడం ప్రారంభించారు.
ప్రభుత్వ పాఠశాలలకు విద్యార్థుల సంఖ్య క్రమంగా తగ్గుతుండటంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రభుత్వాలు కూడా ఆంగ్ల మాధ్యమంలో పాఠాలు బోధించడం ప్రారంభించాయి. దాదాపుగా ఇంగ్లీష్ మాతృభాష స్థాయిని, స్థానాన్ని మన దేశంలో పొందింది.
వార్షిక అంతర్జాతీయ సర్వే ప్రకారం దేశంలో ఇంగ్లీష్ మాట్లాడే వారి సంఖ్య ప్రతి పదిమందిలో ఒకరు ఉన్నారని తెలియజేసింది. అయితే ఇది ప్రాంతాలను బట్టి మారుతోంది. కొన్ని ప్రాంతాల్లో ప్రతి ఇద్దరిలో ఒకరు మాట్లాడుతున్నారు. దేశంలో దాదాపుగా 129 మిలియన్ల మంది ప్రజలు ఇంగ్లీష్ మాట్లాడుతున్నారు. అమెరికాలో 300 మిలియన్ల మంది ప్రజలు ఆంగ్లం మాతృభాషగా ఉన్నారు. ఈ జాబితాలో భారత్ రెండో స్థానంలో ఉంది.
ఇంగ్లీషేతర దేశాలు..
ఓ అంతర్జాతీయ సర్వే ప్రకారం.. నెదర్లాండ్(74. 74 పాయింట్లు) స్థానికేతర ఇంగ్లీష్ మాట్లాడుతున్న దేశాల్లో మొదటి స్థానంలో ఉంది. ఇంతకుముందు ఈ స్థానంలో స్వీడన్(74.63) ఉండేది. ఇప్పడు రెండో స్థానంలో నిలిచింది. నార్వే మూడు, డెన్మార్క్, సింగపూర్ తరువాత స్థానంలో ఉన్నాయి. ఈ సర్వేను ప్రపంచంలోనే వంద దేశాలు, 400 నగరాల్లో 1.45 మిలియన్ శాంపిల్స్ తో పూర్తి చేసి డేటా విడుదల చేశారు. ప్రపంచంలోనే 145 బిలియన్ల మంది ప్రజలు ఇంగ్లీష్ ను మాట్లాడతారు. ఇందులో 380 మిలియన్ల మంది ప్రజలు తమ మాతృభాషగా చెప్పుకున్నారు.
భారత్ ఏ స్థానంలో ఉంది..
భారత్ లో దాదాపు 129 మిలియన్ల మంది ప్రజలు ఇంగ్లీషును మాట్లాడుతున్నారు. అయితే మనవాళ్లు మాత్రం ఇంగ్లీషును రెండో భాషగానే పరిగణిస్తున్నారు. 2023 ఎడిషన్ సర్వే ప్రకారం భారత్ 800 పాయింట్లకు గాను 500 పాయింట్ల ఈపీఐ స్కోర్ తో ప్రపంచంలో 60 వ స్థానంలో.. ఆసియాలో 9 వ స్థానం దక్కింది.
ఇటీవల అంచనాలు ప్రకారం దేశంలో 6 -10 శాతం మంది ప్రజలు ఇంగ్లీష్ మాట్లాడతారు. 2019 గణాంకాల ప్రకారం భారతీయ పాఠశాల్లో నాలుగింట ఒక వంతు మంది ఆంగ్ల మాధ్యమ పాఠశాలల్లో చదువుతున్నారు. మనదేశంలో మహారాష్ట్రలో ఇంగ్లీష్ మాతృభాషగానే చూస్తున్నారు. తరువాతి స్థానాల్లో తమిళనాడు, కర్ణాటక ఉన్నాయి. ఈ మూడు రాష్ట్రాల్లోనే దేశంలోని మొత్తం ఇంగ్లీష్ మాట్లాడే జనాభాలో దాదాపుగా 60 శాతంగా ఉన్నారు.
నేటీ ఆధునిక సమజంలో బతకడానికి ఇంగ్లీష్ తప్పనిసరి అవసరంగా మారడం, ఉన్నత ఉద్యోగవకాశాలు కూడా వీరికే మెండుగా ఉండటంతో సమాజం కూడా ఆ వైపు ఆలోచిస్తోంది. అంతేకాకుండా దేశంలోని అత్యంత ప్రతిష్టాత్మకమైన పరీక్షలు కూడా ఆంగ్లంలో జరపడానికే ప్రభుత్వాలు మొగ్గు చూపడంతో నేర్చుకోవడం తప్పనిసరైంది.
Next Story