కోహ్లిపై ‘పాంటింగ్’ ఆసక్తికర వ్యాఖ్యలు.. ఏమన్నాడంటే..
x

కోహ్లిపై ‘పాంటింగ్’ ఆసక్తికర వ్యాఖ్యలు.. ఏమన్నాడంటే..

ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్, ఢిల్లీ క్యాపిటల్స్ కోచ్ రికీ పాంటింగ్ , కింగ్ కోహ్లి పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. కోహ్లి భారత జట్టుకు ఎందుకు ఎంపిక కాలేదని అభిమానులు కారణాలు వెతుకుతారని..


విరాట్ కోహ్లిని భారత జట్టుకు ఎంపిక చేయకపోతే ప్రజలు దానికి కారణాలు వెతుకుతుంటారని ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ అన్నారు. అయితే వరల్డ్ కప్ కోసం తన ఫస్ట్ చాయిస్ మాత్రం కోహ్లినే అని వివరించారు. ‘‘ప్రస్తుత ఐపీఎల్ లో విరాట్ కోహ్లి అద్బుతమైన ఫామ్ లో ఉన్నాడు.

ఈ సీజన్ లో ఇప్పటి వరకూ 14 ఇన్నింగ్స్ లలో 708 పరుగులు సాధించి టాప్ స్కోరర్ గా ఉన్నారు. అయినప్పటికీ కోహ్లి స్ట్రైక్ రేట్ పై విమర్శలు ప్రశ్నలు గుప్పిస్తున్నానే ఉన్నారు’’ అని ఆశ్చర్యం వ్యక్తం చేశారు. "భారత్‌కు అతను (కోహ్లీ) నా ఫస్ట్ ఛాయిస్. కాబట్టి, క్లాస్, అలాంటి అనుభవం, మీరు భర్తీ చేయలేరు అని పాంటింగ్ అన్నారు.

"ఇది కొంచెం ఫన్నీ.. భారత్ లోని ప్రజలు అతడిని ఎన్నుకోకపోవడానికి ఒక కారణాన్ని వెతుకుతున్నారు. దాని కోసం ఐపీఎల్ లోని ఇతర కుర్రాళ్లతో అతడిని(కోహ్లిని) పోలుస్తున్నారని నేను భావిస్తున్నాను" అని ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్, ఢిల్లీ క్యాపిటల్స్ ప్రధాన కోచ్ ICC కి చెప్పాడు.
వెస్టిండీస్- USA ఆతిథ్యం ఇవ్వనున్న T20 ప్రపంచ కప్‌లో కెప్టెన్ రోహిత్ శర్మతో కలిసి కోహ్లి ఇన్నింగ్స్‌ను ప్రారంభించాలని పాంటింగ్ సూచించాడు. ఎందుకంటే తరువాత వచ్చే సూర్యకుమార్ యాదవ్ లాంటి వారు రన్ రేట్ ను పెంచడంలో కీలకంగా వ్యవహరిస్తారు. "వారు (సెలెక్టర్లు) ఇంకా ఓపెనింగ్ జోడీపై నిర్ణయం తీసుకోవలసి ఉంది, ఎందుకంటే యశస్వి జైస్వాల్ జట్టుతో ఉన్నాడు. ప్రస్తుతం ఉన్న జట్టులో టాప్ ఆర్డర్ లో బ్యాటింగ్ చేసే లెప్ట్ హ్యాండర్లు ఎవరూ లేరు.
"కాబట్టి వారు జైస్వాల్ బ్యాటింగ్ స్థానం తో కలిపి నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. కానీ యజమాన్యం కోహ్లీ - రోహిత్ శర్మతో కలిసి ఇన్నింగ్స్ ఆరంభిస్తారని అనుకుంటున్నాను" అని పాంటింగ్ అన్నాడు.
కోహ్లి టాప్ పొజిషన్ లో ఉత్తమంగా ఆడగలడు. తరువాత వచ్చే సూర్యకుమార్ వంటి సరైన ఆటగాళ్లు చుట్టూ ఉంటే రోహిత్ శర్మ సైతం అధిక స్ట్రైక్ రేట్ తో ఆడగలడు. ఇది మిగిలిన ఆటగాళ్లపై ప్రభావం చూపుతుందన్నారు. " ఈ ఐపీఎల్ లో కోహ్లి ఒక సెంచరీని సాధించాడు, అలాగే ఐదు హాఫ్-సెంచరీలు సాధించాడు. ఇవన్నీ కూడా ఆర్సీబీ విజయంలో కీలకంగా మారి, ఆ జట్టును ప్లే ఆఫ్ కు చేర్చడానికి ఉపయోగపడ్డాయి. ఈ సీజన్‌లో కోహ్లి స్ట్రైక్ రేట్ 155.60 గురించి అన్ని చర్చలు జరిగినప్పటికీ, అతను RCB కోసం ఆడిన 17 ఏళ్లలో ఇది అతని అత్యుత్తమం, ఇది అతను మెరుగుపరుచుకుంటున్నాడని, ఇంకా మెరుగుపడుతుందని పాంటింగ్ వ్యాఖ్యానించారు.
మూడుసార్లు ప్రపంచ కప్ విజేత అయిన పాంటింగ్, ఇటీవలి కాలంలో సగటు కంటే స్ట్రైక్ రేట్లకు ప్రాధాన్యత ఇస్తున్నారని, అయితే భారత జట్టుకు కోహ్లి ప్రయోజనాన్ని తక్కువ అంచనా వేయవద్దని అన్నారు. మూడు,నాలుగు సంవత్సరాల క్రితం బ్యాట్స్ మెన్ ఎన్ని పరుగులు సాధించాడనే చూసేవారు.
వాటికి పట్టిన బంతుల గురించి ఎవరూ పెద్దగా చర్చించేవారు కాదు. కానీ ఇప్పుడు 55 బంతుల్లో 80 పరుగులు సాధించడం కంటే..15 బంతుల్లో 40 పరుగుల సాధించడం, ఎక్కువగా ప్రభావం చూపుతోందని మాట్లాడుకుంటున్నారు. ఇప్పుడు స్ట్రైక్ రేట్ ఆధారిత గేమ్ గా మారాయని అన్నారు.
2022లో ఆస్ట్రేలియాలో జరిగిన T20 ప్రపంచకప్‌లో కోహ్లి కీలక పాత్ర పోషించాడు, పాకిస్థాన్‌పై అజేయంగా 82 పరుగులు, సెమీఫైనల్స్‌లో ఇంగ్లండ్‌పై హాఫ్ సెంచరీ సాధించాడు. కష్టమైన పరిస్థితుల్లో అత్యంత విశ్వసనీయమైన ఆటగాడిగా పాంటింగ్ చెప్పాడు.
"నేను ఈ చాట్ మరియు నేను ICC కోసం చేసిన కొన్ని ఇతర చాట్‌లను గుర్తుచేసుకున్నాను, గత ఏడాది మాత్రమే విరాట్ తమ జట్టులో లేడని కొంత చర్చ జరిగింది, కానీ పెద్ద గేమ్ లు ఎదురయినప్పుడు అసలు సత్తా బయటపడుతుందన్నాడు.
Read More
Next Story