తెలంగాణ అంతటా ఇందిరమ్మ ఇళ్ల కళ..
x

తెలంగాణ అంతటా ఇందిరమ్మ ఇళ్ల కళ..

రాష్ట్రవ్యాప్తంగా వేలాది పేదలు కొత్త ఇళ్లలోకి అడుగుపెడుతున్నారు. గృహనిర్మాణ పనులు వేగంగా సాగుతున్నాయి.


తెలంగాణలో ప్రారంభానికి భారీ సంఖ్యలో ఇందిరమ్మ ఇళ్లు ముస్తాబవుతున్నాయి. పేదవారి సొంతింటి కళను నెరవేర్చడానికి ముహూర్తాలు పెట్టుకోవడానికి టైమ్ వచ్చేసింది. ఈ గృహ ప్రవేశాలకు కావాల్సిన ఏర్పాట్లను సర్కార్ చేస్తోంది. ఇప్పటి వరకు 17,800 ఇందిరమ్మ ఇళ్లు పూర్తయ్యాయి, మరో 1,12,127 ఇళ్లు స్లాబ్‌లను కూడా పూర్తి చేసుకున్నాయి. దీంతో అతి త్వరలో రాష్ట్రమంతటా ఇందిరమ్మ ఇంళ్ల పండగ ప్రారంభం కానుందని సర్కార్ వెల్లడిస్తోంది. ఏప్రిల్ 20 నుంచి గ్రహ ప్రవేశాలకు ముహూర్తాలు ఫిక్స్ చేసుకోనున్్నట్లు తెలిపారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం కోసం ప్రభుత్వం విడుదల వారీగా రూ.5లక్షల సాయంతో పేదవారి సొంతింటి కళ నెరవేరింది.

ప్రభుత్వం అందిస్తున్న ఇందిరమ్మ ఇళ్లపై లబ్దిదారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. వర్షం పడితే ఎక్కడ పైకప్పు ఎగిరిపోతుందో అని బిక్కుబిక్కు మంటూ ఉండే తమకు ఇప్పుడు పక్కా ఇంటిని ప్రభుత్వం అందించిందని లబ్ధిదారుడు కొమురయ్య సంతోషం వ్యక్తం చేశారు. ఇలా ఒకరు ఇద్దరూ కాదు లక్షల మంది పేదలు గతంలో తాము సొంత గూడు లేక పడిన ఇబ్బందులకు ఇందిరమ్మ ఇళ్లు పరిష్కారం చూపిందని, తమకు ఎంతో సంతోషంగా ఉందని వారు చెప్తున్నారు. రేకుల ఇళ్లు, గడ్డిళ్లు, పగిలిన పెంకులతో ఎదురైన ఇబ్బందులు తొలగిపోయాయని వారు చెబుతున్నారు. ప్రభుత్వం దశల వారీగా రూ.5 లక్షల సాయం అందించడంతో ఇళ్లు నిర్మించుకుంటున్నారు.

రాష్ట్రవ్యాప్తంగా 2.66 లక్షల ఇళ్ల నిర్మాణాలు ప్రారంభమయ్యాయి. అందులో 2.24 లక్షలు వివిధ దశల్లో కొనసాగుతున్నాయి. ఇప్పటికే 17,800 ఇళ్లు పూర్తయ్యాయి. ఉగాది వరకు 10,576 గృహ ప్రవేశాలు జరిగాయి. ఖమ్మం, రంగారెడ్డి, రాజన్న సిరిసిల్ల, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో ఎక్కువ ఇళ్లు పూర్తయ్యాయి. అలాగే 11 జిల్లాల్లో 85 శాతానికి పైగా పనులు పూర్తయ్యాయి. ఖమ్మం జిల్లాలో అత్యధికంగా 95 శాతం పైగా పురోగతి నమోదైంది. ఇంకా 1.13 లక్షల ఇళ్లు స్లాబ్ దశలో ఉన్నాయి. వాటిని త్వరగా పూర్తి చేసి ఏప్రిల్, మే, జూన్ మొదటి వారాల్లో విడతల వారీగా లక్ష గృహ ప్రవేశాలు నిర్వహించాలని అధికారులు ప్రణాళికలు సిద్ధం చేశారు.

గృహనిర్మాణానికి సంబంధించిన బిల్లులు దశల వారీగా చెల్లిస్తున్నారు. స్లాబ్ పూర్తయిన వెంటనే పూర్తి బిల్లు విడుదల చేసే విధంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. చివరి విడతగా రావాల్సిన రూ.60 వేల చెల్లింపులు కూడా త్వరలో అందనున్నాయి. మొత్తంగా, పేదలకు గృహ భద్రత కల్పించాలనే లక్ష్యంతో ఇందిరమ్మ పథకం అమలు వేగంగా కొనసాగుతోంది. అధికారులు దశల వారీగా పనులను పూర్తి చేసే దిశగా చర్యలు తీసుకుంటున్నారు.

Read More
Next Story