‘ఇండోనేషియాతో పోగు బంధం అవసరం’
x
photo source: Bharatiyam

‘ఇండోనేషియాతో పోగు బంధం అవసరం’

ఇండోనేషియాలోని బాలి లో వరల్డ్ వీవర్స్ కాన్ఫరెన్స్ ను విజయవంతం చేసేందుకు తెలుగు చేనేత యాక్టివిస్టులు తీవ్రంగా కృషి చేస్తున్నారు.


ప్రపంచ చేనేత దినోత్సవ సాధన దిశగా వరల్డ్ వీవర్స్ కాన్ఫరెన్స్ ని ఇండోనేషియా లో నిర్వహించడం మహాద్భుతం భారతీయం వ్యవస్థాపకురాలు శ్రీమతి సత్యవాణి వ్యాఖ్యానించారు. ఇండియా, ఇండోనేషియా దేశాల మధ్య సాంస్కృతిక సారుప్యత ఉందని, ఇప్పటికీ అక్కడ రామాయణాన్ని నిత్యం ప్రదర్శిస్తారని చెబుతూ ఇలాంటి ఇండోనేషియాని వరల్డ్ వీవర్స్ కాన్ఫరెన్స్ వేదికగా ఎన్నుకున్నందుకు ఆమె ఈ కాన్ఫరెన్స్ నిర్వహణకోసం కృషి చేస్తున్న యర్రమాద వెంకన్నను అభినందించారు.

సత్యవాణి ప్రముఖ రచయిత, విద్యావేత్త. భారతీయం అనే సంస్థ ద్వారా ఆమె చేనేత కళని ప్రోత్సహించే బాగా కృషి చేశారు. సంప్రదాయిక హస్తకళలను ప్రమోట్ చేసేందుకు ఇమె ఇప్పటికి కృషి చేస్తున్నారు.




ఫిబ్రవరి 18న ఇండోనేషియాలోని బాలిలో జరిగే వరల్డ్ వీవర్స్ కాన్ఫరెన్స్ కు రావాల్సిందిగా ఆమెను ఈ రోజు వెంకన్న సత్యవాణిని ఆహ్వానించారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పవిత్ర ప్రదేశంలో ఈ కాన్ఫరెన్స్ కు తనను ఆహ్వానించడం చాలా సంతోషంగా ఉందని, తాను తప్పకుండా ఈ కాన్ఫరెన్స్ కు హాజరై చేనేత యొక్క విశిష్టతను ప్రపంచానికి చాటి చెబుతానని చెప్పారు.

తాను గతంలోనే చేనేత పురోగతికి చేనేత కట్టుబొట్టు పై చేసిన ప్రచారాన్ని గుర్తుచేశారు. 12 సంవత్సరాల క్రితమే అమ్మవారికి 108 చేనేత చీరలతో పూజలు నిర్వహించిన విషయాన్ని ఆమె గుర్తు చేశారు..

Read More
Next Story